నిను స్తుతించడానికే బ్రతికున్నా లోకంలో. నిను ఆరాధించుటయే ఇలలో నా పనియే. ||2||. యేసయ్యా వాడుకో యేసయ్యా వాడుకో||2||. ||నిను స్తుతించ||. 1. నా జన్మము నా మనుగడ నీమదిలో మెదిలెనే మది తలపు ఇలలాగే ఈ మనిషిగా ||2||. నిను స్తుతియించాలని నీతో జీవించాలని ||2|. నీ ఆశ నీ కోరిక నే నిరవేరుస్తానయ్యా||2|| ||యేసయ్యా వాడుకో||. || 4 || ||నిను స్తుతించ|| 2. నీ చెలిమిని నీ కలిమిని నాకు పంచాలని ఆ కార్యము నెరవేర్చా ఏకమైతివే ||2|| నీ ప్రేమకు సాటేవ్వరూ నీవంటి వేల్పులెవరు. ||2|| నీ త్యాగం నీ యాగం మాకు వేసెను మార్గమయ్యా ||2||. ||యేసయ్యా వాడుకో||. || 4 ||. ||నిను స్తుతించ||