ఎందుకయ్యా.. చరిత్రని తెలుసుకోకుండా కథనాలను వండి వారుస్తారు. భావి తరాలను తప్పుదారి పట్టించే ఇలాంటి వీడియోలను నిషేధించాలి. అనపోతారెడ్డికి శ్రీనాథుడికి సంబంధం ఏంటి? శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి. ఇకపోతే పురిటి పన్ను వేసిన రాచవేముడు చిట్టచివరి రెడ్డిరాజు. ఇక లకుమాదేవి విషయానికొస్తే, రాచవేముడికి పూర్వ తరాలవాడైన కుమారగిరికి ఆమె ప్రేయసి. కాక, ఆస్థాన నర్తకీను. ఇలా చెప్పుకుంటూపోతే ఈ వీడియోలో అన్నీ అపసవ్య కథనాలే. చరిత్రను తప్పుదారి పట్టించే ఇలాంటి అర్ధరహిత కథనాలను ఉపేక్షించడం తెలుగుజాతికి పట్టిన పీడగానే పరిగణించాలి.
నాడు ప్రజలను హింసించిన వారిని అంత మంది రాజులను చంపారంటే ప్రజలు ఏ స్థాయిలో ఇబ్బందుల గురయ్యారో మనం అర్థం చేసుకోవాలి నేటి పాలకులను ఓటు అనే ఆయుధంతో ఇలానే చంపాలి