నిజ క్రైస్తవ జీవితానికి సరియైన పునాది, దైవ ప్రేరితములైన పరిశుద్ధ లేఖనాలే. వాటినే మన మార్గానికి వెలుగుగా; వ్యక్తిగత, సంఘ జీవితాన్ని నియంత్రించే సూత్రాలుగా ధృడ నిశ్చయం చేసుకోవడానికి సత్య వాక్యాన్ని సరిగా విభజించే ఆరోగ్యకరమైన బోధ ఈ దినాలలో అత్యవసరం. విశ్వాసుల ఆత్మీయ క్షేమార్థం ఇట్టి వాక్య బోధను అందిస్తూ, నశించే ఆత్మల రక్షణార్ధం లేఖనానుసారమైన సువార్త ప్రకటించడానికి ఈ ఛానెల్ ఉద్దేశించబడింది. ఇందలి సందేశాలు విని, మేలు పొందగలరు. ఇంకా ఇతరులకు కూడా పరిచయం చేసి, వారి ఆత్మీయ ఎదుగుదలకు కూడా తోడ్పడగలరు.
దేవుని సేవకులు Samuel John గారికి వందనాలు. మీ వర్తమానాల ద్వారా నేను మేలు పొందుకుంటున్నాను. ఒకసారి మీతో మాట్లాడాలనుకుంటున్నాను Uncle.. మీ Contact number పెడతారా?