తాను చేయబోయే పని "పాపం", అని అనుకోక పోవడం వల్లనే మనిషి పాపం చేస్తాడు. చేయబోయే పని సమంజసమని, దానికి తగిన సమర్థన చేసుకుని, ఆ తరువాతనే అటువంటి పనిని చేస్తాడు. అది ఇంకొకరి దృష్టిలో పాపపు పని కావచ్చు. లేదా ఆ మనిషికే పని చేసిన తరువాత ఎప్పటికో పాపం అనిపించవచ్చు. ఆ క్షణంలో తాను చేయబోయే పని చెడుపని అనిపిస్తే మాత్రం చేయలేడు. A human being is psychologically incapable of committing anything wrong. It is a different matter, after doing a job he may think post-facto it was a wrong thing. But, at that moment he can do it only because his mind is convinced that it was a right thing.