Vibgyor Infotainment is about for the educational purpose ! Explaining the concepts of English Methodology for DSC Students. Also which will cover about the various aspects of the Anantapuramu District like Temples and Architecture, Historical Monument places, Travel guide, Photography classes.
Hii sir, nenu 2018-19 10th class batch student ni, చాలా చాలా happy ga ఉంది సార్ మన స్కూల్ videos చూడడం, వాళ్ళకి కూడా మెమోరీస్ లా ఉండిపోతాయి మీరు videos తియ్యడం వల్ల. Thank so much sir ma uri పిల్లలని ఇలా support and encouragement చేస్తున్నందుకు, ఇలాగే encourage చెయ్యాలని కోరుకొంటున్నాను.
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం....విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయంరా... ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేనురా పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా గుటకపడని అగ్గి ఉండ సాగరాన నిదుకుంటు తూరుపింట తేలుతుందిరా నిశావిలాసమెంతసేపురా.... ఉషోదయాన్ని ఎవ్వడాపురా.. రగులుతున్న గుండె కూడ సూర్యగోళమంటిదేనురా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున నీరసించి నిలిచిపోతె నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటె నిత్య ఘర్షణ దేహముంది.. ప్రాణముంది.. నెత్తురుంది ..సత్తువుంది... ఇంతకన్న సైన్యముండునా ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ఆశయమ్ము సారెదెవరురా నిరంతరం ప్రయత్నమున్నదా... నిరాశకే నిరాశ పుట్టదా.... ఆయువంటూ ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవంపైనే గెలుపుచాటురా … ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి