పల్లవి: జీవిత మెవ్వరికి, నీ జీవిత మెవ్వరికి? ఈ లోకములో జీవించు జీవితమంత జీవిత మెవ్వరికి, నీ జీవిత మెవ్వరికి? 1. శరీరేచ్ఛలకై ఆశలుండు - ఈ ధరణియందు సుఖభోగులుగా జీవింతురు - ఈ ధరణియందు వారి యూహలు దినమెల్ల చెడియున్నవి వారి పాప జీవిత మంత శాపమెగ 2. ధనాపేక్షకులెందరో గలరు - ఈ ధరణియందు ధనముపై మనస్సు నిల్పెదరు - ఈ ధరణియందు వారి కలవరమంత ధనము ధనమే వారు బ్రతికెడు బ్రతుకంత క్షీణతయే 3. స్వంత బోధలకై బ్రతికెదరు - ఈ ధరణియందు గర్వమునకు అమ్మబడి యుందురు - ఈ ధరణియందు వారి మనసులు సంకుచితములై యుండు వారి జీవిత ప్రయాసము - పతనమేగా 4. విరిగిన హృదయులు కలరెందరో - ఈ ధరణియందు కరిగెడు ఉప్పుగ నుండెదరు - ఈ ధరణియందు వారు ప్రభుకై దాగియే నిలచెదరు దైవ వాక్కుగ దినమెల్ల సేవింతురు