Тёмный
KALAGNANI TV
KALAGNANI TV
KALAGNANI TV
Подписаться
భవిష్యత్తును తెలుసుకోవడమంటే వినాశనాన్ని తెలుసుకోవడం కాదు. వినాశనం కలగకుండా జాగ్రత్తగా ఉండటానికి మనమెలాంటి కృషి చేయాలో తెలియచేయడానికే ఆ మహనీయులు భవిష్యత్తును కాలజ్ఞానం రూపంలో మనకు అందించారు,
చెడు చేసినవారికి కూడా మంచిని చేయడం సత్ పురుషుల నైజం. కనుక మంచిని పెంచి, మానవ సేవలో ముందుకి నడచినప్పుడే, ఆ మహనీయుల మనోభావాలకు ఓ అర్థము, పరమార్థము లభిస్తాయి. కనుక శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి భవిష్యత్ సంఘటనలతోపాటు శ్రీ స్వాములవారి ఆలోచన విధానాన్ని, వారు ఆచరించిన మార్గాన్ని తెలిపేదే ఈ మా “కాలజ్ఞాని టివి”.
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారు భవిష్యత్ కోసం ఏం చెప్పారో తెలియచేయడానికే ఈ ప్రయత్నం.
శ్రీ స్వాములవారి భక్తుల కోసం, భక్తులచే నిస్వార్థముతో శ్రీ స్వామివారి ఆలోచన విధానాన్ని, భోధనలను, చరిత్రలను, ఆశయాలను అందరికి తెలియజేయాలనే సంకల్పముతో ఈ “కాలజ్ఞాని టివి”ని ప్రారంబించినాము. మీ సహాయ సహకారాలతోపాటు, సలహాలు, సూచనలు, మార్పులు మరియు చేర్పులు తదితరములకు సదా కృతజ్ఞులమని తెలియజేస్తున్నాము. అలాగే కందిమల్లాయపల్లెలోని మఠం యాజమాన్యమునకు ఈ 'కాలజ్ఞాని టివి'కి ఏ విధమైన సంబంధం లేదు.

Комментарии