మీరు చెప్పినవి అక్షర సత్యాలు. రెండు తెలుగు రాష్ట్రాలు ఆయన్ని విష్మరించాయి. హైదారాబాద్ కు తెలుగు చిత్ర పరిశ్రమ ను తరలించి ఎంతో మందికి ఉపాధి కల్పించిన అక్కినేని గారి శతజయంతి ఉత్సవాలు ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలి. నాగార్జున గారు మీ సూచనలు గమనించి సెప్టెంబర్ 20 న అభిమానులను పిలిచి గౌరవించాలి.
ఎందరో అక్కినేని అభిమానులు. అందరూ అందరే. మీరు చెప్పినది బాగానే వుంది. నా అభిప్రాయము కూడా వ్రాస్తున్నాను. 100 మంది కే ఎందుకు ఆగాలి.లాటరీ ఎందుకు తీయాలి. ఈ సందర్భం మరల మరల రాదు. వచ్చిన వారు నిరాశ తో వెళ్ళడం కూడా బాగు అనిపించదు. పోయిన సంవత్సరం వచ్చిన వారి సంఖ్య వారికి తెలిసి వుంటుంది. లేదా ఇంకా ఒక నెల టైం వుంది. వివరాలు సేకరించి ఆ విధంగా ఫాలో అవవచ్చును. అందరూ అక్కినేని వంశాభిమానులే వస్తారు. ఇలాంటి సందర్భం మరల వస్తుందా. వయసు మీరిన వారు మరల మరల రాగలరా ఈ ఒక్కసారి మాత్రం రావచ్చునేమో. ఏయన్ఆర్ గారు లివ్స్ ఆన్..