ఆలోచనకర్తవైన నా దేవా Song Lyrics : ఆలోచనకర్తవైన నా దేవా నడిపించుచున్నావు నీదు ఆలోచనలతో ఆవరించియున్నావు నీ ఆత్మ శక్తితో బలపరుచుచున్నావు నిత్యము నీ కృపతో ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము చరణం :- 1 ఇదియే త్రోవని - నా వెంట నుండి ఆ త్రోవలన్నియు - సరాళను చేయుచు నా ముందు నడుచుచు - ద్వారములు తెరుచుచు నడిపించుచున్నావు - సీయోను చెంతకు ( ఆశ్చర్యకరుడా ) చరణం :- 2 నా కలవరములన్ని - కనుమరుగు చేయుచు నా కన్నీరంతా - నీ కవిలెలో దాయుచు ఉపదేశ క్రమముతో - ఉత్తములను చేయుచు మా ఊహలన్నింటిని - పరిశుద్ధపరచావు ( ఆశ్చర్యకరుడా ) చరణం :- 3 ఆశ్చర్యకరమైన ఆలోచన నాకిచ్చి నీ బుద్ధి జ్ఞానముల సమృద్ధి నా కోసగి కరుణించుచు నీవు - కృపలను జూపుచు ఎక్కించుచున్నావు - ఉన్నత స్థలములకు ( ఆశ్చర్యకరుడా )