హైదరాబాద్,కాచీగూడ రైల్వేస్టేషన్ పరిసరా ప్రాంతంలో మతిస్థిమితం సరిగ్గాలేక మాసినబట్టలతో, పెరిగిన జుట్టు,గడ్డంతో ఏదో ఆలోచిస్తూ దిగలుగా కూర్చున్న వృద్ధుడు కొండారెడ్డి కనిపించడంతో మాతృదేవోభవ అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో అతనిని చేరదీసి ఆశ్రమంలో ఆశ్రయం కల్పించడం జరిగింది.నా కూతురు లోహిత కొండారెడ్డిని సొంత తాతయ్యల అతని బాగోగులు తెలుసుకొని అతనికి ప్రేమతో అన్నం తినిపించి.. సరాదగా ఆడుకునేది.కొన్ని రోజుల తర్వాత అతని గురించి వివరాలు కనుగొనగా తన పేరు కొండారెడ్డి అని తనది నెల్లూరు.. భార్య చనిపోయిందని..ఇద్దరు కూతుర్లు అని చెప్పడం జరిగింది. ఈయొక్క వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తన కూతుర్లు చూసి వారి కూతురు,కుటుంబ సభ్యులు ఆశ్రమానికి వచ్చి కొండారెడ్డి ని చూసి బోరున ఏడ్చారు.సంవత్సరం నుండి తమ తండ్రి ఆచూకీ కోసం చేయని ప్రయత్నం లేదని తమ తండ్రిని మళ్ళీ చూస్తామనుకోలేదని అన్నారు.మా కూతురు లోహిత ను ఆశీర్వదించారు. మీ అందరి ఆదరణతో ఆ యొక్క వీడియో ను సోషల్ మీడియా లో పోస్ట్ చెయ్యడంతో ఆ వీడియో ను చూసి కొండారెడ్డి కి సంబందించిన వీడియో ను షేర్ చేసి వారి కుటుంబసభ్యుల చెంతకు చేరేలా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు..
మాతృదేవోభవ అనాధ ఆశ్రమం, డిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర, నాదర్గుల్ గ్రామం, బాలాపూర్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ - 501510. సెల్ నెం : 9347513830
9 окт 2024