సర్, ప్రతీదీ వ్యాపారంగా చూస్తున్న ఈ తరుణం లో ఎంతో విద్వత్తు ఉండీ, స్వలాభాపేక్ష లేకుండా శాస్త్రీయ సంగీతం లో అమూల్యమైన పాఠాలు, ఎన్నెన్నో మెళకువలు అందరికీ అదో పవిత్ర యజ్ఞం లా చక్కని, స్పష్టమైన, సరళమైన తెలుగు భాషలో నేర్పుతున్నారు. సంగీతం ఓ స్వప్నం అనుకున్న సామాన్యుడికి సంగీతాన్ని నేర్పి, వారిని సంగీత సరస్వతీ కటాక్షానికి పాత్రులనుగా చేస్తున్నారు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆ లక్ష్మీ, సరస్వతీ మాతలు చల్లగా చూడాలి.🙏🏻
చాలా సంతోషం మీకు నా ఆశీస్సులు. మీకు దగ్గరలో ఉన్న గురువు గారిని సంప్రదిస్తే వివరిస్తారు. భవిష్యత్తులో నేను వీడియో చేస్తే ఇక్కడ తెలుసుకోవచ్చు శుభం భూయాత్
శ్రీ గురుభ్యో నమః గురూజీ నేను 2 రోజుల క్రితం ఎడమ చేతితో ఎలా సాధన చేయాలో తెలుప గలరని మేసేజ్ పెట్టాను. బహుశా అది చూసి ఈ వీడియో మళ్ళీ పెట్టారనుకుంటున్నా. కానీ నాకు గల సందేహం నివృత్తి కాలేదు..దయచేసి మీ కాంటాక్ట్ నంబర్ తెలుప గలరు. ధన్యవాదములు...