ఆ యుగ పురుషుడు గురించి మీ మాటలలో వింటుంటే మా ఒళ్ళు పులకరించింది,,,, ఆ మహానుభావుడు గొప్పదనం గురించి మీ మాటలలో విని మేమంతా మీ అభిమానులుగా మారాము..చాలామంది NTR అభిమానులు ఈ ప్రసంగం తో మీకు కూడా ఆత్మీయులు గా మారిపోయారు..ఇది 100 శాతం నిజం,,,, జోహార్ నటరత్న NTR.
తెలుగు భాష మీద ప్రేమాభిమానాలు ఉన్న గొప్పవ్యక్తి, మహా నటుడు ఎన్టీఆర్. ఆయన నటన కన్నా మించింది గంభీరమైన ఆయన వ్యక్తిత్వం🙏💐🙏 గరికపాటిగారూ..మీరు కూడా మాలాగే ఎన్టీఆర్ వీరాభిమాని అని విని చాలా సంతోషమైంది.🫡🤗🙏
ఎన్టీఆర్ అంటే తెలుగు భాష తెలుగు భాష అంటే ఎన్టీఆర్ అన్నంత అభిమానం ఆయనకి తెలుగు భాష మీద.. ఎంతో గౌరవం ఇచ్చారు మన తెలుగు భాష కి ఈ రోజు తెలుగు భాష విశ్వ విఖ్యాతము అవ్వడానికి ప్రధమ ఆద్యుడు ఎన్టీఆర్ గారు.. అంత సంస్కృతి ఉన్న వ్యక్తీ NTR గారు..మన తెలుగు భాష నీ కాపాడ డానికి కృషించేసిన మహ రాజు కృష్ణ దేవరాయలు తరువాత NTR గారు మాత్రమె
NTR గత జన్మలో,, శతచండీ యాగం చేసిన శక్తి కృప వల్ల,,, కోట్ల జనాలను ఆకర్షించే ముఖం,, నటుడై హీరో నిర్మాత దర్శకుడు,,,, ముఖ్య మంత్రి గా విశ్వ విఖ్యాత నట సార్వభౌముడయ్యాడు
ఓహ్"""" తాడేపల్లిగూడెం కృష్ణభాలజీ టాకీస్ ప్రభాత టాకీస్ విజయ టాకీస్ వెంకంట్రామ టాకీస్ ,,, అబ్బా వింటుంటేనే నా చిన్నతనం గుర్తుకువచ్చి మనసు పులకరించి పోతుంది. నా పద్నాలుగవ ఏట తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ మెట్ల మార్గం మీద N,T, రామారావు గారికి కరచాలనం చేసే మహా భాగ్యం నాకు దక్కింది
ఓ విశ్వ విఖ్యాత నట సార్వభౌమా ! ఓ విశ్వ విఖ్యాత నట సార్వభౌమా..! నీ అనంత అభినయ విశ్వరూపముల్ గాంచి విశ్వమంతయు విస్మయ మొందగా.. నీ దివ్య మంగళ రూపము.. నీ సహస్ర భాను తేజము.. తెలుగు జాతి ఎద ఎదలో పదిలంగా నిలిచిపోవ.. చరితార్థుడవైతివయ్యా.. ఘన చరితగ నిలిచితివయ్యా..!! తెలుగింటి ఆడపడుచులకు అన్నగా...రైతన్నలకు అండగా...కార్మికసోదరులకు వెన్నుదన్నుగా...పేదల పాలిట పెన్నిధిలా...శత్రువుల గుండెల్లో సింహ స్వప్నంలా...తరాలు మారినా, యుగాలు మారినా...సరిలేరు మీకెవ్వరూ,సాటిరారు ఇంకెవ్వరూ🙏 మా ఖ్యాతి మీరే, మా కీర్తి మీరే.. ఓ విశ్వవిఖ్యాత, అందుకో మా జ్యోత 🙏🙏