Тёмный

కోనేరులో బయటపడ్డ 400ఏళ్ల నాటి ఆలయం || A 400-year-old temple found in Koneru 

Vasutv telugu
Подписаться 9 тыс.
Просмотров 6 тыс.
50% 1

గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలో వెలసిన శ్రీ లక్ష్మీ నృశింహుని సన్నిధికి చెందిన పెద్ద కోనేరు మరమ్మత్తుల పనులు శరవేగంగా జరగుతున్నాయి. ఇందులో భాగంగా రేయింబవళ్లు దేవాలయ సిబ్బంది మోటార్ల సహాయంతో కోనేరులో ఉన్న నీటిని వెలుపలకు తోడుతున్నారు. ఈ క్రమంలో నీటిలో మునిగి పోయిన 400 ఏళ్ళనాటి దాసాంజనేయ స్వామి ఆలయం భక్తులకు దర్శనమిచ్చింది. ఈ కోనేరును కీ₹.శ 1558లో త్రవిన్నట్లు చారిత్రక ఆధారాలు వలన తెలుస్తుంది. ఈ కోనేరు ఎంతో లోతు కలిగి నాలుగువైపులా రాతిమెట్లు, ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఈ కోనేరు అడుగున రెండు భావులు ఉన్నాయని ప్రతీతి. కోనేటి గర్భాన ఒక బంగారు ఆలయం ఉందని ప్రజలు చెప్పకుంటున్నట్లు 1883 సంవత్సరంలో గార్డన్ మెకంజీ కృష్ణాజిల్లా మాన్యువల్ లో వ్రాశారు. 1832 సంవత్సరపు కరువు కాలంలో ఈ కోనేరు పూర్తిగా ఎండిపోయి దానిలో 9,840 కర్ణాటక తుపాకులు, 44 ఇనుపగుండ్లు లభ్యమైనట్లు తెలుస్తుంది. ఎన్నో శతాభ్ధాల పాటు లక్ష్మీ నృశింహుని ఉత్సవాలకు ఈ కోనేరులోని నీటిని స్వామివారి అభిషేకం నిమిత్తం వాడేవారు. 25 సంవత్సరాల క్రితం ఓఎన్ జీసీ, ఇండియన్ న్యావీ వారి సహకారంతో నీటిని మొత్తంతోడి లోపల ఉన్న భావులను శుభ్రం చేసినట్లు పలువురు స్థానికులు చెబుతున్నారు. మరలా తిరిగి 2022 లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోనేరుకు పూర్వవైభవం తెచ్చేందుకు సంకల్పించారు. ఇందుకు దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ని కలిసి కోనేరు అభివృద్ధి కోసం కోటి నిధులు మంజూరు చేయించారు.
#mangalagiri #srilakshminarasimhaswamy #koneru #pushkarini #ttd #ttddarshan #temple #vasutvtelugu ‪@vasutvtelugu‬ #hostory #historical #historicalplaces

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5   
@k.s.ramesh9731
@k.s.ramesh9731 Год назад
Jai Hanuman
@Navyandramedia
@Navyandramedia Год назад
Good article
@allakatatarao5376
@allakatatarao5376 Год назад
మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ పుష్కరిణి పునరుద్దరణ కార్యక్రమం చేపట్టిన పెద్దలందరికీ అభివందనములు
@jhrajismartworld7606
@jhrajismartworld7606 Год назад
ఒకప్పుడు కోనేరు చుట్టూ చెత్త ఉండేది. ఇపుడు మంచి పని చేసారు.
Далее
Mini bag sealer
00:58
Просмотров 7 млн
ВЛАД А4 СКАТИЛСЯ
09:34
Просмотров 509 тыс.