నజరేయుడగు ఏసుక్రీస్తు నామమున మీకు వందనములు. కెరుబు కి నాలుగు ముఖములు అనగా ఎద్దు సింహము మనిషి గ్రద్ద ముఖములు పెట్టాడు దేవుడు ఈ నాలుగు ముఖములు పెట్టడానికి గల మర్మము ఏమిటి
[ఆదికాండము 2:3] కాబట్టి దేవుడు ఆ **యేడవ దినమును** ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించి నట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను. [మార్కు సువార్త 2:28] అందువలన మనుష్యకుమారుడు **విశ్రాంతిదినమునకును** ప్రభువై యున్నాడని వారితో చెప్పెను. [అపొస్తలుల కార్యములు 17:3] నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయియున్నాడనియు లేఖన ములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు, వారితో **మూడువిశ్రాంతి దినములు** తర్కించుచుండెను. [అపొస్తలుల కార్యములు 18:4] అతడు ప్రతి **విశ్రాంతిదినమున** సమాజమందిరములో తర్కించుచు, యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను.
విశ్రాంతి దినమును యేసుప్రభువు తీసివేసినట్టు ఏ వచనం లో చెప్పారో ...కొంచెం రిఫరెన్స్ పెట్టండి. మరి మత్తయి 5: 17 -19 వరకు చెప్పినది మార్క్ 2:28 లో ఆయనే స్వయంగా చెప్పిన మాట....అబద్దమా ?
[రోమీయులకు 2:29] అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధ మైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగు నది కాదు. అట్టివానికి మెప్పు మన [మార్కు సువార్త 2:28] అందువలన మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును ప్రభువై యున్నాడని వారితో చెప్పెను. [మత్తయి సువార్త 5:17] ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు. [మత్తయి సువార్త 5:18] ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. [అపొస్తలుల కార్యములు 16:13] విశ్రాంతి దినమున గవిని దాటి నదీతీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి, కూడివచ్చిన స్త్రీలతో మాటలాడు చుంటిమి. [అపొస్తలుల కార్యములు 16:14] అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయంద [అపొస్తలుల కార్యములు 16:15] ఆమెయు ఆమె యింటివారును బాప్తిస్మము పొందినప్పుడు, ఆమె--నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు యెంచితే, నా యింటికి వచ్చియుండు డని వేడుకొని మమ్మును బలవంతము చేసెను.