Hiii Andi maa husband maku istam vundandi yeppudu e aakarakaya tisukoni raru....e roju tisukoni vacheru telagana style lo e recipe cheyyanante nenu you tube lo chuste mi recipe first vachindi nenu chesenu chala bagaa vachindi...tq so much...
కాకరకాయలో విత్తనాలు తీసివేసి , అందులో రసం కూడా తీసేసి, దాని చెక్కును కూడా తీసి అలా బోడుగుండు చేసారు ఇంకా ఏం మిగిలింది కాకరకాయలో? మీరు వాడిన మసాలా దినుసులు కూడ సరిగ్గా లేవు....కారానికి బదులుగా ఎండు మిరపకాయలు, కాస్తంత వేరుశనగలు లేదా వేయించిన శనగపప్పు, కాస్తంత దోరగా వేయించిన నువ్వులు, నాలుగు కరివేపాకు ఆకులను దోరగా వేయించి ,వీటికి తోడు మీరు చెప్పిన విధంగా ధనియాలు కూడా అవసరం లేదు (ఎందుకంటే కాకరకాయ మొత్తం అదే ఘాటు స్పష్టంగా నోటికి తెలుస్తుంది) జీలకర్ర, వెల్లుల్లి రేకులు వేసి మెత్తగా పొడి చేసి వాడవచ్చు....ఇకపోతే ఈ చేదు ఏదైతే వుందో అది పూర్తిగా కాకపోయినా కనీసం కొంత అయిన వుంటేనే ఆరోగ్యానికి మంచిది...దీనికి పైన తొక్క తీయకుండా కాయలకు ఉప్పు వేసి ఒక నిముషం పాటు పిసికి రసం పిండి వేయించవచ్చు. దీని వలన చేదు మొత్తం పోకుండా తినడానికి సరిపడా వుంటుంది...లేదా ఇతర పద్ధతి కూడా ఉంది అదేమిటి అంటే పులిసిన మజ్జిగలో కాస్తంత ఉప్పు వేసి ఈ కాయలు అందులో ఉడికించి వేపుడు చేసుకోవచ్చు..దీనివల్ల పోషక విలువలు కొంత వరకు మనకు అందే అవకాశం ఉంటుంది....తప్పులు ఉంటే మన్నించగలరు...