Mint cultivation provides good economic results to the farmers
Small and Marginal farmers getting good income through Mint / Pudina farming in the Kunchana Palli Village, Tadepalli Mandal, Guntur District of Andhra Pradesh.
Mint is an aromatic perennial herb, popularly known as Pudina in India. Kunchanapalli farmers cultivating mint throughout the year. and getting 7- 10 Cutting / year. On demand of Market Farmers are earning Net profit Rs. 1 to 2 Lakhs / acre.
పుదీనా సాగుతో సత్ఫలితాలు సాధిస్తున్న కుంచనపల్లి గ్రామ రైతులు
ఆకుకూరల సాగుకు పేరుగాంచిన కుంచనపల్లి గ్రామంలో పుదీనా సాగుది ప్రత్యేక స్థానం. గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలో వున్న ఈ గ్రామం కృష్ణానది తీర ప్రాంతానికి సమీపంలో వుండటంతో పుష్కలమైన నీటి వనరుల మధ్య వ్యవసాయం సుభిక్షంగా వర్థిల్లుతోంది. సంప్రదాయ పంటల వైపు కాకుండా నిత్యం ఆదాయం అందించే ఆకుకూరల సాగుకు అధిక శాతం మంది రైతులు మొగ్గుచూపుతున్నారు. దీనీలో పుదీనాను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. మే నెలలో నాటితే సంవత్సరం పొడవునా దిగుబడినిచ్చే ఈ పంటలో రైతులు 7 నుండి 10 కోతల్లో దిగుబడి తీస్తున్నారు. సాగు ఖర్చులు పోను ఎకరాకు లక్ష నుండి 2 లక్షల రూపాయల నికర లాభం అందించే ఈ పంట, నిత్యం కాయకష్టం చేసకునే చిన్న సన్నకారు రైతులకు అత్యంత వెసులుబాటుగా వుంది. పుదీనా సాగుపై కర్షక మిత్ర అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీకోసం
Facebook : mtouch. maganti.v...
#Karshakamitra #Pudinafarming #Mintcultivation
2 авг 2020