ఆత్మప్రణామాలు గురూజీ...., 🙏 "తత్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్త్వదర్శినః..." "బ్రహ్మ-జ్ఞానా"న్ని తెలుసుకోవాలనుకొనే సాధకులు, సద్గురువులతో ప్రవర్తించాల్సిన, తీరును చెప్పే ఈ శ్లోకానికి., మీ వివరణ అద్భుతం,గురూజీ. ఈ శ్లోకం విన్నప్పుడు.,సద్గురు శ్రీ శిరిడీసాయికి,ఆయన శిష్యుడైన నానాచందోర్కర్ కి మధ్య జరిగిన సంభాషణ గుర్తుకొస్తుంది,గురూజీ. బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనుకొనే శిష్యులు.,తమ గురువుని పరీక్షించాలనో లేక వినయాన్ని నటిస్తూనో ప్రశ్నించక, వారికి సర్వశ్య-శరణాగతులై, సంపూర్ణ సేవాభావంతో ఆశ్రయించినపుడే శిష్యుడి జన్మ తరిస్తుందనే.,సద్గురు శ్రీ శిరిడీసాయి వివరణతో ఆ శిష్యుడు తరించినట్లుగా,నేటి మీ వివరణతో మేము కూడా తరించాం,గురూజీ. 🙏🙏