జ్యోతిర్మయుడా - నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే ..... నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయము నీవే నా ఆనందము నీవే - నా ఆరాధన నీవే..... - 2 " జ్యోతి" నా పరలోకపు తండ్రీ - వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షావల్లితో - నను అంటుకట్టి స్థిరపరిచావా నా పరలోకపు తండ్రీ - నా మంచి కుమ్మరి నీ కిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా నా తండ్రి కుమార - పరిశుద్ధాత్ముడా త్రీయేక దేవా - ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెద
మన పరలోకపు తండ్రి వ్యవసాయకుడు,మన పరలోకపు తండ్రి మంచి కుమ్మరి, గనుక ఆయన తోటలోని ఉత్తమ ద్రాక్షావల్లిగాను, ఆయన చేతిలోని ఆయనకు ఇష్టమైన పాత్రాగ నీవు నేను మలచబడి, జ్యోతిర్మయుడైన యేసయ్య ను నిత్యము ఆరాధిస్తూ ఆయన మహిమకు పాత్రులముగా మార్చబడుదుము గాక.......