నేటి సమాజానికి ఏది అత్యవసరమో దాన్ని చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు .........చాలామంది వృద్ధాప్యంలో మా పిల్లలు మమ్మల్ని సరిగ్గా చూడటం లేదని, పట్టించుకోవటం లేదని బాధపడుతుంటారు, కంప్లైంట్ చేస్తుంటారు ....ఒక్కసారి ఆలోచిద్దాం! తప్పు ఎవరిదో తెలుస్తుంది... మనం పిల్లల్ని ఎలా పెంచాం? ఒక్కసారి గుర్తుచేసుకుందాం .. పిల్లలిని చిన్నప్పటినుండి క్లాసులో అందరికంటే ఫస్ట్ రావాలన్నాము...ఎలాగైనా అందరికంటే ఎత్తుకి ఎదగాలని, విదేశాలు వెళ్లాలని ఉదరగొట్టం ....వాళ్ళ మనసుల్ని స్వార్థంతో నింపేసాం .....తీసుకోవటం, దోచుకోవటం, తొక్కుకుంటూ ఎదిగిపోవటం, విదేశాలకి ఎగిరిపోవటం, అదే సక్సెస్ అని ఇంట్లో, స్కూ లో నూరిపోసాము ... వాడు ఆదిశగా ఎదిగిపోయాడు, ఎగిరిపోయాడు... ఇప్పుడు మనల్ని చూడటం లేదని కుయ్యో మొర్రోమని మొత్తుకుంటున్నాం, మొరపెట్టుకుంటున్నాము. వినేవాడు లేడు ..ఎందుకంటే మన చుట్టూవున్న వాళ్ళందరూ కూడా ఎదో రకంగా ఇటువంటి బాధలే అనుభవిస్తూ చాలా బిజీగా వున్నారు .. లోపం ఎక్కడ జరిగింది???? ... ఎప్పుడైనా పిల్లలకి వాళ్లకి కావలిసినది తీసుకోవటంతో బాటు, తిరిగి పక్కవాడి అవసరాలకి ఇవ్వడం నేర్పామా ?. ప్రశ్నించుకుందాం ... .... పక్కవాళ్ళ కష్టాలికి స్పందించటం, సహాయం చేయటం నేర్పమా ? ...లేదు ....వాడికి తెలియని, నేర్పని వాటిని మనం వాడినుంచి ఆశించటం తప్పు కాదా!.. వాడు మన పెంపకంలో తీసుకోవటం, దోచుకోవటమే నేర్చుకున్నాడు ..... అదే పాటిస్తున్నాడు... పక్కవాడు ఎలాపోతే నాకెందుకు అనే ధోరణిలో పెరిగిన బిడ్డలు తమ తల్లి తండ్రులు గురుంచి ఎందుకు ఆలోచిస్తారు?... లోపం మన దగ్గర పెట్టుకుని తప్పు పిల్లలిది అనటం పెద్దల తప్పు...మనం పిల్లని ఎలా పెంచామో అలాగే ప్రవర్తిస్తారు. నోట్: దయుంచి మీ పిల్లల్ని మానసిక శారీరిక వికలాంగుల ఆశ్రమాలకు తీసుకెళ్లండి..చిన్న పిల్లల మనసుల్ని ప్రేమ, దయతో నింపండి.....పక్కవాడికి పెట్టడంలో ఉన్న ఆనందాన్ని లేతమనుసుల్లో నాటండి ...... సమాజంలో ఉన్న అసమానతలు, కష్టాలు , బాధలు తెలియజేయండి ...... మీ పిల్లల చేతులమీదుగా దాన ధర్మాలు చేయించండి. ........హక్కులతో బాటు సమాజంపట్ల బాధ్యతలు కూడా తెలియజేయండి ... ...... వీలైతే మీ పిల్లల పుట్టినరోజు వేడుకలు అనాధ , మానసిక ,శారీరిక వికలాంగుల ఆశ్రమాల్లో ఆ పిల్లల సమక్షంలో జరిపించండి. ************వృద్ధాశ్రమాలు తగ్గాలని వుద్యమించటం కంటే పసి మనస్సులో కాస్తంత ప్రేమ, దయ ,జాలి నింపండి. అదే మీ పిల్లలకి మీరిచ్చే నిజమైన ఆస్తి ...అదే మీ వృద్ధాప్యంలో మిమ్మల్ని కాపాడుతుంది ***************************************
తల్లితండ్రుల మాట విని చెడిపోయిన కొడుకులు కూడ ఉన్నారు పద్దతైన తల్లితండ్రులు దొరకడం పిల్లల అదృష్టం ముఖ్యంగా మగపిల్లల తల్లితండ్రులు డామినేషన్ వల్ల ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి వాళ్ళకి మీలాంటి మహానుభావులద్వారా మంచి సందేశాన్ని ఇవ్వాలి గురువుగారు
Dhanyavadalu guruvugaru. Elanti videos ne inka upload cheyandi. Garikapati guru should be given government recognition and his preaching should spread the whole country.
నేను అలానే పెరిగాను. మా అబ్బాయిని అలానే పెంచాను. చదువు కుంటూ కూడా any help అంటూ ఉంటాడు. అవసరానికి చెయ్యి చాలు అంటాను. అలానే చేస్తాడు.అంతకన్నా ఏమి కావాలి.