Тёмный

ప్రకృతి ఔషధాలయం .. ఎక్కడో తెలుసుకోవాలంటే ..రండి | Dr.KhaderVali 

Raitu Nestham
Подписаться 1,3 млн
Просмотров 4 тыс.
50% 1

#raitunestham #millets #kadharvalli
బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్ట్రిక్.. తదితర జీవనశైలి ఆరోగ్య సమస్యలు ఇటీవల ఎందుకు ఎక్కువయ్యాయి ?
చిన్న వయసులోనే క్యాన్సర్, కిడ్నీ - హార్ట్ ఫెయిల్యూర్ బారిన పడుతున్న వారు ఎందుకు పెరుగుతున్నారు ?
ఆరోగ్యం పట్ల అనేక జాగ్రత్తలు తీసుకునే వారికి సైతం ఇలాంటి అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి ?
కారణం మనం తీసుకునే ఆహారమా ? జీవన విధానమా ?
ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ?
ఏ ఆహారం తీసుకోవాలి ? ఎలాంటి జీవన పద్ధతులు పాటించాలి ?
ఆహారం - ఆరోగ్యంపై ఇలాంటి ఎన్నో సందేహాలకు సమగ్ర సమాధానాలు... పూర్తి సమాచారం కావాలా ? పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఆహార ఆరోగ్య నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి గారి ద్వారా .. సంపూర్ణ ఆరోగ్య సాధన సూత్రాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా ?
అయితే.. రండి.. ఏప్రిల్ 17న సోమవారం రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో... వరంగల్ జిల్లా హన్మకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ లో జరగనున్న చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సదస్సుకి హాజరుకండి.
సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు జరిగే ఈ సదస్సులో
పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఆహార ఆరోగ్య నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి పాల్గొంటారు..
చిరుధాన్యాలు, సహజ ఆహార విధానాలు, కషాయాలతో... బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ తదితర ఆధునిక రోగాల నియంత్రణ, నిర్మూలనపై అవగాహన కల్పిస్తారు. హార్ట్ అటాక్ లు, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలు రాకుండా పాటించాల్సిన ఆహార - జీవన పద్ధతులను తెలియజేస్తారు. అండుకొర్రలు, కొర్రలు, ఆరికెలు, ఊదలు, సామెలు తదితర ధాన్యాలను ఆహారంగా ఎలా తీసుకోవాలో వివరిస్తారు. ఏ అనారోగ్య సమస్యకు ఏ ఆహార విధానాలు పాటించాలో సమగ్రంగా తెలియజేస్తారు.
ఆరోగ్య సమాజ నిర్మాణమే లక్ష్యంగా నిర్వహిస్తోన్న కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. కార్యక్రమం జరిగే వేదికల వద్ద చిరుధాన్యాలు.. చిరుధాన్యాలతో తయారైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి.
మరిన్ని వివరాలకు 70939 73999, 95538 25532 ఫోన్ నంబర్ లలో సంప్రదించగలరు ..
----------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • విజ్ఞానం పేరుతో ఆహారంప...
☛ For latest updates on Agriculture -www.rythunestha....
☛ Follow us on - / rytunestham​. .
☛ Follow us on - / rytunestham​​​​​​

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4   
@badugumamgasrihari6367
@badugumamgasrihari6367 Год назад
Good message
@ramalingamdara6262
@ramalingamdara6262 Год назад
Ila ti sadassu gurinchi city 15 days mundu telpandi.
@nishanthzly
@nishanthzly Год назад
One request to the channel management. In the background female voice, it was still using the word chirudhanya for siridhyana. Padmashri Dr. Khader sir already changed the name chirudhanya as siridhyana we as a followers of dr.khader want to hear positive grain as siridhyana only
@sudhakarsudha3487
@sudhakarsudha3487 Год назад
Vizag lo appudu
Далее