ఆట వెలది పద్యము: భార్య కీయ దగ్గ భరనమ్ము గూర్చియు చెప్పినారు మీరు గొప్ప గాను ఆడ న్యాయ వాది అయినట్టి మీకును వంద వందనాలు అందు కొనుడు, శభాష్ మహిళా శుభమ్ భూయాత్
Excellent explanation madam. If husband NEGLECTED his wife , then only he has to pay maintenance..... Wife doesn't have rights on her husband's ancestral property. Genuine reasons...My India is great...Madam explained in easy way to understand.. Thank u very much madam for creating awareness regarding Maintain acne.... Good work by NEWS channel
మీరు చెపింది వింటే నాకు ఒక్కటి అర్ధం అయింది ఏంటంటే అమ్మాయి లు పెళ్లి పేరుతో బిజినెస్ చేయాలి ఎలా అంటే పెళ్లి కి కట్నం ఈచి పాపా బాబు పుట్టాక లాబలు కోసం DVC 498A వేసి భరనం అడుగడం సక్కెస్స్ బిజినెస్ ఇందులో లాస్ అనేది ఉండదు పైగా ఎలాంటి టాక్స్ కూడ కటాల్సిన అవసరం లేదు కష్టం పడకుండా డబులు వస్తాయి
నమస్కారం మేడం..🙏 మాది నల్గొండ జిల్లా. మాది చాలా పేద కుటుంబం. మా చెల్లి కి 4 ఏళ్ల క్రితం పెళ్లి చేశాం. మా చెల్లి వాళ్ళ అత్తకి పోస్టల్ డిపార్ట్మెంట్ లో చిన్న జాబ్ ఉంది. ఆ జాబ్ ఆమె భర్త ది. ఆయన చనిపోయినాక ఆ జాబ్ ఆమె కి వచ్చింది. కానీ ఆ జాబ్ వాళ్ళబ్బాయి (అంటే మా చెల్లి భర్త) చేస్తాడు. గవర్నమెంట్ జాబ్ కదా అని వెనకముందు ఆలోచించకుండా లక్షన్నర కట్నం ఇచ్చి పెళ్లి చేసాము. వారికిప్పుడు ఇద్దరు ఆడపిల్లలు. ఇంతలో మా చెల్లి భర్త వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని, ఆ అమ్మాయితో ఇంట్లో నుండి పారిపోయాడు. పారిపోతూ ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్ కి వాట్సాప్ మెసేజ్ ద్వారా చెప్పి, సిమ్ తీసేసాడు. వెంటనే మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. సంవత్సరం అయింది. అతని జాడ తెలియలేదు. పోలీసుల వలన ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇదిలా ఉంటే ఇంట్లో అత్త ఆదరణ కరువైంది. అతను ఇంట్లో నుంచి పారిపోయిన దగ్గర్నుంచి ఆ జాబ్ అత్త చేస్తోంది. జీతం 15k వరకు వస్తుంది. ఆ జీతంతో పల్లెటూళ్ళో బాగానే బ్రతకొచ్చు. కానీ ఆ అత్త మా చెల్లికి ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. మా చెల్లి ఆ జాబ్ తాను చేస్తానని, తనకి సగం జీతం ఇవ్వండి అని బ్రతిమిలాడింది, కానీ అత్త పడనివ్వట్లేదు. మా చెల్లిని కూలి కి వెళ్ళమంటోంది. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నాకు సంబంధం లేదు అని అంటోంది. మా చెల్లి కూలి కి వెళ్తే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇద్దరూ చిన్నపిల్లలే. చిన్న పాప ఇంకా పాలు కూడా మానలేదు. అత్త తనకి వచ్చే జీతం ఏం చేస్తుందో తెలియట్లేదు. అయితే, అత్తకి తన కొడుకు ఎక్కడున్నాడో తెలుసునని, రహస్యంగా ప్రతి నెలా డబ్బులు పంపిస్తోందని ఆ ఊరి వాళ్ళు చెబుతున్నారు. అత్తపై #మైయింటెనెన్స్_కేసు వెయ్యండి అని కూడా సలహా ఇస్తున్నారు. ఏం చెయ్యమంటారో మీరు సలహా ఇవ్వండి మేడం..🙏
Woman should work like men and earn money after divorce. Then she will know what is husband hard work. Many women are doing jobs y can't divorced women can't do. Does wife doing any needs to husband after divorce.