Тёмный

ముకుంద మాలా స్తోత్రం ( Part - 2) - శ్రీమాన్ ప్రణవానంద ప్రభు || HG Pranavananda Prabhu 

Pranavananda Das
Подписаться 423 тыс.
Просмотров 12 тыс.
50% 1

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 78   
@PranavanandaDas
@PranavanandaDas День назад
1. "వృష్నివంశ ప్రదీపః" అంటే ఏమిటి? 2. ⁠పృథ్వికి ఉన్న భారమేమిటి? 3. ⁠భగవంతుడు లేని భవనము దేనితో సమానము? 4. ⁠నరకాంతక అను నామమునకు అర్ధాలు ఏమిటి? 5. ⁠కృష్ణుడి యొక్క గురువు ఎవరు? 1. What is the meaning of “Vrishnivamsa Pradeepah”? 2. ⁠What is the burden on Prudhvi (Earth)? 3. ⁠What is the feeling of “non existence of God” equal to? 4. ⁠What are the meanings of the name “Narakantaka”? 5. ⁠Who is the teacher of Krishna?
@chilarigeetha4006
@chilarigeetha4006 6 часов назад
Hare Krishna prabhuji 🙏 1. Agnananni duram chesevaadu 2. Bagavanthuni marachipoye,seva cheyanapudu, adarmanni acharinche vaaru erigithe bharam avtundi 3. Vanamtho samanam Danilo kruramrugaalu untaye 4. Narakaasura samharam chesinavadu,narakanni tisesevaadu 5. Saandipani muni
@tulasivrajakumari412
@tulasivrajakumari412 День назад
Hare Krishna prabhuji 🙏🙇 1.mana lo vunna ajnanam ni andakarani tolaginchevaru vrishinivamsa Krishna. 2. Eppudu aithe bhagavanthudu ni marchipothamu, seva cheyamo, Dharma ani acharichamo appudu prudhvi ki bharam avuthamu. 3. Vanam tho samanam. 4. Narakasuradi ni samharinchevaru, narakani nundi teesevaru. 5. Sandipani muni. Thank you prabhuji 🙏🙏🙏
@venkatalakshmi2417
@venkatalakshmi2417 3 дня назад
Hare Krishna prabhuji 👏👏🙏🙏🙏🙏🍎
@manikyalakshmi4186
@manikyalakshmi4186 2 дня назад
2. ఈ ప్రపంచంలో ఈ భౌతిక ప్రపంచంలో పుట్టాము . ఎలా తెలుస్తుంది అంటే ఇన్ని జన్మలు ఉన్నాయి అని అంటే మనకి వచ్చే అక్కర్లేని కోరికలు అక్కర్లేని ఆలోచనలు కలలు. కలలలో ఎన్నో పెద్ద పెద్ద భవనాలు జంతువులు అలా ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటాము. ఇవన్నీ ఎక్కడ నుంచి వచ్చాయి మన మనసులో నుంచి ఎందుకంటే ఇవన్నీ చూసాము కాబట్టి అవి ఎక్కడో అక్కడ మన మనసులో నిలిచిపోయాయి. అందుకే అనాది మృత్యు జన్మ పరంపర అంటారు. కానీ ఏ క్షణం అయితే మనం కృష్ణుడిని మన జీవితంలోకి ఆహ్వానించామో ఏ క్షణంలో అయితే మనం కృష్ణుడి యొక్క భక్తి మార్గంలోకి వచ్చామో అంతే మన అంధకారం పోయినట్టే. మేఘశ్యామల కోమలాంగః భగవంతుడిని మేఘశ్యామ అని అంటారు. మేఘం అంటే నీరు ఉన్నది. నీరు నిండుగా నింపుకున్నది మేఘం. మరి కృష్ణుడికి ఎందుకు మేఘశ్యాముడు అని పేరు వచ్చింది అని అంటే ఆయన కూడా చాలా నిండుగా నింపుకున్నాడు ఏమి వస్తువుని నింపుకున్నాడు అంటే కరుణ అనే వస్తువుని నింపుకున్నాడుట. కరుణ అనే వస్తువుని సముద్రంలో నింపుకున్నవాడు అందుకే ఆయనను మేఘం తో పోల్చారు. నీలి మేఘశ్యాముడు నల్లనైన కృష్ణుడు. బృందావనంలో చాలా కారణాలు చెబుతారు కృష్ణుడు నల్లగా ఎందుకు ఉన్నాడు అని. ఆయనకి చాలా పేచీ ఉండేదిట. రాధ ఏమో అంత బంగారు వర్ణంలో మిలమిల మెరిసిపోతూ ఉంటే నేనేంటమ్మా ఇంత నల్లగా ఉన్నాను. నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా ఇంత నల్లగా ఉంటే. మీరందరూ ఏమో బాగానే ఉన్నారు నాకెందుకమ్మా ఈ నలుపు రంగు వచ్చింది అని అంటే యశోదమ్మ అనేది కంగారు పడకు రా నాన్నా నువ్వు పుట్టినప్పుడు చాలా తెల్లగా ఉన్నావు. కానీ గోపికలందరూ వచ్చి నీ చుట్టూ కూర్చుని వాళ్ళ యొక్క నల్లటి కళ్ళతో నిన్ను చూసి చూసి చూసి నువ్వు స్పటికం లా ఉండే వాడివి రా. ఎప్పుడు కూడా చుట్టూరా ఉండి అందరూ కూడా నిన్ను చూస్తూ ఉంటారు కదా వాళ్ళ నల్లటి రంగు నీ స్పటిక మైన శరీరంలో రిఫ్లెక్ట్ అవుతోంది అంతే కన్నయ్యా నువ్వు నల్లటి వాడివి కాదులే బంగారు కొండా నువ్వు బాధపడకు అని అనేదిట యశోదమ్మ. ఒకసారి ఏమో కృష్ణుడు అన్నాడుట అమ్మా నేను నల్లగా ఎందుకు ఉన్నానో అర్థం అయింది అమ్మా అంటే ఎందుకురా కన్నా పొద్దున్నే లేచి నల్లగా ఉన్నావు అని అంటున్నావు అంటే ఏమీ లేదమ్మా నువ్వు నన్ను ఉయ్యాలలో పడుకోపెట్టి వెళ్లి పోయావు. అప్పుడు చీకటి అయిపోయింది. ఎంత చీకటి కమ్ముకుంది అంటే ఆ చీకట్లో నేను భయమేసి అటు ఇటు పొర్లాను. ఆ చీకటికి ఉండే నల్ల రంగు అంతా నాకు అంటుకు పోయింది అని అన్నాడుట. యశోదమ్మ పాపం కృష్ణుడిని చూసి నవ్వుకునేదిట. సరే నాన్నా ఇవన్నీ పక్కన పెట్టు. నీకు బాగా స్నానం చేయిస్తాను తెల్లగా చేయిస్తాను రా అని యశోదమ్మ కృష్ణుడు కి అలా చెప్పేదిట స్నానం చేయిస్తాను అని. అందరూ గోపికలు నిన్ను చూసి నవ్వుతున్నారు. పొద్దున్న లేస్తే నువ్వు మట్టిలో ఆడి బురదలో దొర్లుతూ ఉంటావు చీ చీ ఇక్కడికి రా నీకు మంచిగా నలుగు పెట్టి స్నానం చేయిస్తాను. నిన్ను మిల మిల మెరిసే రంగు చేయిస్తాను. అప్పుడు గోపికలందరూ నిన్ను శభాష్ అంటారు రా నాన్నా కృష్ణా అని యశోదమ్మ ప్రేమతో పిలుస్తూ ఉండేదిట. భగవంతుడి యొక్క రూపం మేఘశ్యామల కోమలాంగః. ఎలా ఉంటాడు ఆ భగవంతుడు అసలు ముట్టుకున్నాము అంటే అయ్యో ఎక్కడ కంది పోతాడో అనిపిస్తుంది ట. అంత కోమలమైన స్వభావం కలిగిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. చిన్న పిల్లల్ని మనం పట్టుకుంటే ఎంతో కోమలంగా ఉంటారు కదా. ఎంతో మృదువుగా ఉంటారు కదా. అప్పుడే పుట్టిన పిల్లవాడి యొక్క మృదుత్వానికి లక్ష కోట్లు ఎక్కువ చేస్తే ఎంతో భగవంతుడి యొక్క మృదుత్వానికి ఏమాత్రం సరిపోదు అంత మృదువు భగవంతుడు. ఆయన అంత మృదువు అంత అందము అంత ఆకర్షణ ఎంత అంటే ఆయన బృందావనం లో నడుస్తూ వెళుతూ ఉంటే ఒక గోపిక పాలు పితుకుతూ ఉంటే కృష్ణుడు నడుస్తూ వెళ్ళడం చూసేసరికి అలానే ఉండిపోయేదిట. ఆ కృష్ణుడు అలా వెళ్ళిపోయేవాడుట. మనసంతా కూడా ఆయన యొక్క వైభవం లో మనసంతా ఆయన యొక్క స్వరూపంలో ఆకర్షితమై ఉండేదిట. కృష్ణుడి యొక్క దర్శనం ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి ఎవరైనా కృష్ణుడి యొక్క చెవికి పెట్టుకున్న చక్కటి తాటంకములను చూస్తే అక్కడే ఉండిపోయేవిట. ఎవరైనా కృష్ణుడి యొక్క నేత్రములు చూస్తే అక్కడే ఉండిపోయేవిట. ఎవరైనా కృష్ణుడి యొక్క కేశములు చూస్తే అక్కడే ఉండిపోయేవిట. ఎవరైనా కృష్ణుడి యొక్క అధరములు చూస్తే అక్కడే ఉండిపోయేవిట. కృష్ణుడి యొక్క భుజములు చూస్తే అక్కడే ఉండిపోయేవిట మళ్లీ వాళ్ళందరూ గ్రూపుగా ఏర్పడి గోపికలందరూ మాట్లాడుకునే వారుట. కృష్ణుడు నేత్రములు ఇలా ఉన్నాయి జుట్టు ఇలా ఉంది భుజములు ఇలా ఉన్నాయి అని అంటే అప్పుడు అందరూ ఊహించుకుని ఆహా కృష్ణుడు ఈరోజు ఇలా ఉన్నాడా అని అనుకునే వారుట.
@chshirisha1890
@chshirisha1890 10 часов назад
Hare Krishna prabhuji entha adhubthangha chepparu prabhuji please andharu sravanam cheyyandi. Aa anubhuthi ni meeru pondhandi Hare Krishna 🙏🙏
@lavanyakothapally8502
@lavanyakothapally8502 10 часов назад
Hare Krishna prabhuji 🙏🙏 Dandavat pranam🙇‍♀️ 1.manaloni ajnanani,andakarani duram chesevadu..vrishni vamsha sri krishnudu 2.manam bhagavanthuni marachi seva cheyakunda,dharmani patinchakunda unte bhumi ki bharam 3.vanam tho samanam 4.Narakasurudni samharinchinavadu Narakam nundi tisesevadu 5.Sandipani muni Hare Krishna 🙏 🙏
@chshirisha1890
@chshirisha1890 10 часов назад
Hare Krishna pranamalu prabhuji 🙏🙏 Vrushti vamshaniki velugunu thechhinavadu ani oka atham,pradheepa ante manaloni agyananni tholaginchadam ani 2. Eppudu aithe manam bhagavanthuni marachi pothamo, dharmanni vidichipetti adhamanni ashrayisthamo appudu pruthvi ki baram 3. Bhagavanthudu Leni bhavanam Vanam tho samanam 4. Narakasurudini samharinchinavadu ani , manalani narakam nunchi dhuram chese vadu ani artham 5. Sandheepa muni krushunidi yokka Guruvu 🙏🙏🙏
@G.Hemanthsai
@G.Hemanthsai Час назад
Hare Krishna prabhuji 🙏🏻
@ksrsudha7698
@ksrsudha7698 День назад
Hare Krishna pranamalu prabhuji garu 1a.agnananni tholaginchevadu 2a.eppudu manam bhagavanthuni gurinuchi vinadam,alochinchadam,seva cheyadam marchipothamo dharmanni acharinchamo appudu manam bhumiki bharam avutham 3a.vanam ante krura mrugali vuntai narakamutho samanam 4a.narakamunu thisevadu,narakasuridini champinavadu 5a.sandhipamuni
@ksrsudha7698
@ksrsudha7698 День назад
Hare Krishna pranamalu prabhuji garu
@garidepallisunitha7759
@garidepallisunitha7759 День назад
అజ్ఞాన న్ని తొలగించేది భక్తి లేకపోవడం ధర్మం పాటించక పోవడం వనం తో సమానం రౌరవధి నరకం కుభిపకం బాలరాముడు ఏమన్నా తప్పు లు ఉంటే మన్నించండి ప్రభుజీ 🙏🙏🙏🙏
@manikyalakshmi4186
@manikyalakshmi4186 2 дня назад
4. ముకుంద మాలా స్తోత్రం. 3. ముకుంద మూర్ద్నా ప్రాణి పత్యం యాచే భవంత మేకాంతమియంత మర్థంమ్ అవిస్మృతిస్త్వచ్చరణారవిందే భవే భవే మేస్తు భవత్ప్రసాదాత్. అద్భుతంగా కులశేఖర్ ఆళ్వార్లు ఈ శ్లోకంలో ఒక చక్కటి విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. ముకుంద అని ఎవరిని అంటున్నారు అంటే ముకుందమాల ఆ స్వామికి కీర్తన చేస్తున్నారు కదా. ఆయన ఏమంటున్నారు అంటే ముకుంద మూర్ద్నా అడిగే ముందు భగవంతుడికి ప్రణామం చేయాలి. మనకి మన సాంప్రదాయంలో అద్భుతమైన విషయం ఏమిటి అంటే భగవంతుడు సాధువులు భక్తులు గురువులు ఆచార్యులు మనకి ఎదురైనప్పుడు ప్రణామం చేయాలి అని అంటారు. ఎన్నో రకములైన ప్రణామాలు ఉన్నాయి స్త్రీలైతే పంచాంగ ప్రణామం. పురుషులైతే సాష్టాంగ ప్రణామం చేయాలి అని. మొదట మనం ఎవరినైనా అడగాలి అంటే ఆయన మెల్లమెల్లగా సిద్దం చేస్తున్నారు కృష్ణుడిని అడుగుతున్నారు అడుగుదామని దానికంటే ముందు ప్రణామం చేస్తున్నారు కృష్ణుడికి. అయ్యా నేను వంగి నీకు నమస్కారం చేస్తున్నాను. భవంతం మేకాంత ఇంత చిన్న కోరిక చిన్న కోరిక తండ్రి ఏమి పెద్దది కాదు తండ్రి నాకు ఇంకా ఏమీ వద్దు. నీకు నమస్కారం చేస్తున్నాను చిన్న విషయం అడుగుతున్నాను నిన్ను అయ్యా నీ యొక్క దివ్య శ్రీ చరణాలను మర్చిపోకుండా ఉండే ఒక అనుగ్రహం నాకు ఇవ్వు అని అంటారు. ఎంత ఎంత అని ఎంత పెద్ద విషయం అడిగారు కులశేఖర్ ఆళ్వార్లు. ఈ ప్రపంచంలో దేనినైనా మనం సాధించవచ్చు. కానీ భగవంతుడిని గుర్తుపెట్టుకోవడం అనేది అంత పెద్ద కష్టమైన విషయం. కానీ స్వామిని అలా కాకా పట్టేసి మెల్లమెల్లగా ఆయన దగ్గరకు వెళ్లి చిన్నది చిన్నది అని అనేసరికి పాపం పెరుమాళ్ళు అనుకున్నారు. ఏదో మామూలుగా ఉద్యోగం వివాహం అడుగుతారో లేదా పిల్లలు లేదా ఇల్లు అడుగుతాడు ఏం చేస్తాడు అనుకుంటే. కాదయ్యా ప్రసాదం ఇవ్వు తండ్రీ నీ యొక్క ప్రసాదాన్ని నాకు ఇవ్వు. ఏమిటి భగవంతుడు ఇచ్చే ప్రసాదం అంటే. మన జీవితంలో వచ్చిన సుఖము భగవత్ప్రసాదమే దుఃఖము భగవత్ ప్రసాదమే. ఎలా అయితే మన జీవితంలో వచ్చే సుఖాన్ని భగవత్ప్రసాదంగా మనం స్వీకరిస్తున్నామో అలానే జీవితంలో వచ్చే దుఃఖాన్ని కూడా భగవత్ప్రసాదంగా స్వీకరించాలి. ఎప్పుడు మనకి ఆ భావన కలుగుతుంది అని అంటే ఈ కోరిక మన దగ్గర ఉన్నప్పుడు. భవే భవే మేస్తు భగవత్ ప్రసాదాః తండ్రి జన్మ జన్మాంతరాలకు నీ యొక్క శ్రీపాదములు నా హృదయంలో ఉండగలిగితే ఎటువంటి పాదములు బ్రహ్మ కడిగిన పాదము. బ్రహ్మము తానెడి పాదము అటువంటి అద్భుతమైన భౌతికమైన ఇచ్చలూ లేకుండా మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క శ్రీపాద చిహ్నము లే మనకు కావాలి ఆ భగవంతుడి యొక్క నిర్హేతుకమైన భక్తి మనకి కావాలి అన్నప్పుడు మనకి ఆ మనసు ఆ శక్తి మనకి భగవంతుడు ప్రసాదాన్ని ఇస్తాడు. అక్కడ సుఖం వచ్చిన దుఃఖం వచ్చిన రెండింటినీ భగవత్ ప్రసాదంగా స్వీకరించే శక్తి మనకి లభిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందుకే కులశేఖర్ ఆళ్వార్లు ఎన్ని ప్రార్థనలు చేశారో. ఎప్పటికీ నీ యొక్క శ్రీ చరణాలను మర్చిపోకుండా ఉండే ఒక స్థితి నాకు ఇవ్వు. ఆ ప్రసాదాన్ని నాకు ఇవ్వు తండ్రి అని ఎంత పెద్ద కోరిక అడిగేశారో. ఇంకొక కోరిక కూడా అడుగుతున్నారు. అంటే మీనా కోరికలు అడుగుతున్నారు అంటే మనం అడిగే కోరికలకు కులశేఖర్ ఆళ్వార్లు అడిగే కోరికలకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అంటారు కదా అలా ఉంటాయి.
@IndrajaamarReddy
@IndrajaamarReddy 12 часов назад
Hare Krishna prabhuji 🙏🙏🙏 1.manalo agnananni nirmulinche krushnudu. 2.darmanni vidichi adarmamga undatam. 3.janthuvulu thirige vanam tho samanam. 4.narakasurunni samharinchina varu,narakanni thesese varu. 5.samdipani muni.
@MangadeviBoyidi
@MangadeviBoyidi 3 дня назад
హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏
@KrishnaveniY-lw1gv
@KrishnaveniY-lw1gv 4 дня назад
Class chala bagundi prabhu ji
@padmapriyapratapam8397
@padmapriyapratapam8397 День назад
1.agnanani,andhakarani tolaginche swarupamu bagavantudu 2.bagavantuni seva cheyakunda,adharma margum lo unapudu prudviki baramu avutaru 3.vanamu tho samanamu 4.narakasuruduni samharamu chesina varu, narakani tesesevaru 5.sandipamuni Hare Krishna prabhuji 🙏 🙏
@chintanirmala1344
@chintanirmala1344 День назад
1.మన లోని అజ్ఞానమనే అంధకారాన్ని నిర్ములించే రూపం శ్రీ కృష్ణుడి ది. 2.మనం ఎప్పుడైతే భగవంతుడిని మరచి పోయినప్పుడు, ఎప్పుడైతే భగవంతుడి సేవ చేయమో, ఎప్పుడైతే మనం ధర్మాన్ని విడిచి, అధర్మంగా ఉంటామో అప్పుడు మనం పృథ్వి కి భారమవుతాము. 3.భగవంతుడి లేని భవనం, వనం లాగా జంతువులు, మృగాలు తిరుగాడు వనం లాగా ఉంటుంది. 4.నరకాసురుడిని సంహారం చేసిన వాడు., నరకాన్ని తీసేసే వాడు. 5. సాంధీపని మహర్షి.🙏🙏. Hare krishna Prabhuji 🙏🙏🌹
@manikyalakshmi4186
@manikyalakshmi4186 День назад
కులశేఖర్ ఆళ్వార్లు ముకుందుడికి స్తోత్రాలతో ముకుంద మాల చేసి వేస్తే మీరు ఆ మాలను మరలా వికశించేలా చేస్తున్నారు ప్రభుజీ. అసలు ఒక శ్లోకాన్ని మించి ఇంకొక శ్లోకం చాలా అద్భుతంగా వున్నాయి ప్రభుజీ. మీరు వాటిని ఎంతో అత్యద్భుతంగా చెబుతున్నారు. ధన్యవాదాలు ప్రభుజీ. హరేకృష్ణ ప్రభుజీ.
@JavvajiLeela
@JavvajiLeela День назад
Adiyan dhosam prabu gi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arrolanarendhar1995
@arrolanarendhar1995 12 часов назад
Hare krishna Hare Ram Guruvugaru 🚩🙏
@laxmigopal3560
@laxmigopal3560 2 дня назад
Hare krishna prabuji🌹
@surapaneniramarao-q6d
@surapaneniramarao-q6d 3 дня назад
Hare krishna prabhuji namskaram
@MangadeviBoyidi
@MangadeviBoyidi День назад
హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏 1, అజ్ఞానాన్ని దూరం చేసేవాడు, శ్రీ కృష్ణ భగవానుడు 2, కృష్ణుణ్ణి మర్చిపోయినప్పుడు, భగవంతుడి సేవ చెయ్యనప్పుడు, ధర్మాన్ని విడిచిపెట్టినప్పుడు 3,వనంతోసమానం 4,నరకాసురుణ్ణి సంహరించిన వాడు, నరకాన్ని తీసివేసే వాడు 5,సాధిపముని హరే కృష్ణ ప్రభూజీ నాకు యాత్రలకు రావాలి అని మనసు నిండా కోరిక ఉంది కానీ మాఅమ్మ కి కళ్ళు కనిపించవు ఆవిడ బాధ్యత నాదే నేను రాలేక పోతున్నాను అనే బాధ నాకు కలుగుతుంది పోయిన సారి యాత్రకు మీ సాగత్యభాగ్యం కోసం వచ్చాను కానీ ఇంటి దగ్గర వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఏమి చెయ్యాలో నాకు అర్ధం కావట్లేదు హరే కృష్ణ
@ramadevi2004
@ramadevi2004 3 дня назад
Hare krishna prabhuji dandavat pranamalu miku jivitamlo eppudaina kastam dukham kaligaya ala eduraite stiramga vundagalara stiramga
@sitaramayyanamburi8849
@sitaramayyanamburi8849 3 дня назад
Hare krishna pranhuji
@Bhumika.274
@Bhumika.274 3 дня назад
Harekrishna pradhuji
@SURITEJA-u1f
@SURITEJA-u1f 3 дня назад
Hare Krishna
@VajaAravind-qe8xv
@VajaAravind-qe8xv 3 дня назад
Hare Rama hare Krishna hare krishna hare Krishna 🙏
@Youagain-bo3dr
@Youagain-bo3dr День назад
1.Andhakaaraani tolaginchedi 2. Bhagavantuniki sevalu cheyaleka povuta,pujalu cheyakapovuta 3.vanamuto samaanamu 4.Narakaasuruduni samharinchinavaadu & Narakam nunchi kaapadevaadu 5 Hare Krishna
@satyagnaneswari5611
@satyagnaneswari5611 2 дня назад
హరే కృష్ణ హరే కృష్ణ
@manjushamaddula6755
@manjushamaddula6755 3 дня назад
Jai Sri Krishna 🙏💐🙏🙏🙏
@Krishnkumari1767
@Krishnkumari1767 2 дня назад
హరే కృష్ణ హరే రామ 🙏🦚
@syamsyam8126
@syamsyam8126 День назад
హరే కృష్ణ ప్రభు జి బాగా చెప్పారు
@manikyalakshmi4186
@manikyalakshmi4186 4 дня назад
హరేకృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు
@shobhan9311
@shobhan9311 3 дня назад
ಹರೇ ಕೃಷ್ಣ 🙏
@syamsyam8126
@syamsyam8126 День назад
కృష్ణం వందే జగద్గురు
@mukkashivalini9306
@mukkashivalini9306 День назад
1.Mana lini andhakarani, agnanani tolaginchedhi pradipaa 2.Bhaghvanthuni marchipovadam, Dharmani acharichkapovadam, Bhaghavathini seva cgyakapovadam pruthivi bharam 3.vanam tho samanam Bhagavanthudu lekute bhavanam 4.Narakaasrudini anthamodichinavadu, Narakani thiloginchedhi 5.Sandhipa muni
@kadajaganmohanachari
@kadajaganmohanachari 4 дня назад
Prabhuji mi channel everyday follow avutunnamu students ki best time enti study ki cheppandi
@renukajanardan5727
@renukajanardan5727 День назад
1. అజ్ఞానాన్ని తొలగించేది
@Veeraveniveni-p1d
@Veeraveniveni-p1d 3 дня назад
🕉🌺🙏🌺🙏🌺🙏
@KumariMedisetti-e9g
@KumariMedisetti-e9g 4 дня назад
Harekrishna prabuji 🙏🙏🙏🙌🙌chala Baga chepparu krishna Prema kosam 🙏💕🌺💕❤️💞❤️💕💕💕
@manikyalakshmi4186
@manikyalakshmi4186 День назад
1. ప్రదీప అంటే దీపము. దీపము ఒక గదిలో ఉండే అంధకారాన్ని తీర్చేస్తుంది. అంటే కొద్దిగా తన శక్తి ఉన్నంతవరకు దూరంగా కాంతి ఇస్తుంది. ప్రదీపః అజ్ఞానాన్ని తీసేసేవాడు. మన లోపల ఉండే అజ్ఞానాన్ని తీసేసేవాడు. ప్రదీప అంటే లోపల ఉండే అజ్ఞానాన్ని అంధకారాన్ని నిర్మూలించే స్వరూపం శ్రీకృష్ణ భగవానుడుది. 2. ఎప్పుడైతే మనం భగవంతుడిని మరిచిపోతాను అప్పుడు పృథ్వి కి భారం. ఎప్పుడైతే మనం భగవంతుడికి సేవ చేయమో అప్పుడు పృథ్వికి భారం అవుతాము. ఎప్పుడైతే మనం ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మ మార్గంలోకి వెళతామో అప్పుడు పృథ్వికి భారం. అటువంటి పృద్వి యొక్క భారాన్ని దూరం చేయడానికి కృష్ణుడు ఆవిర్భవించాడు. 3. వనం తో సమానం. 4. నరకాసురుని సంహరించినవాడు. నరకమును లేకుండా చేసేవాడు. 5. సాంధీపని మహర్షి
@BRAINVITA2023
@BRAINVITA2023 4 дня назад
హరే కృష్ణ ప్రభూజీ..🙏🙏🙏
@lakshmisaladi3071
@lakshmisaladi3071 4 дня назад
💞🍀🙏 Hare Krishna 🙏🍀💞
@manikyalakshmi4186
@manikyalakshmi4186 2 дня назад
1. గుహ్యతే యస్య నగరే రంగయాత్రా దినేదినే తమహం శిరసాం వందే రాజానాం కులశేఖరం. ముకుందమాలా స్తోత్రం.-2 జయతు జయతు దేవో దేవకీ నన్దనోయం జయతు జయతు కృష్ణ వృష్ణ వంశ ప్రదీపః జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకున్దః. స్వామి నీకు జయము కలుగు గాక అని ప్రార్థన చేస్తున్నారు. ఎటువంటి స్వామికి జయము కలుగు గాక. దేవకీదేవికి పిల్లవాడిలా అవతరించారు. బ్రహ్మకి తండ్రి అట దేవకికి కుమారుడు అట. బ్రహ్మగారికి తండ్రియైన వాడు దేవకికి కుమారుడుగా పుట్టాడుట. ఎంత విచిత్రం. అజాయమానో బహుదా విజాయతే. పుట్టుకే లేనివాడు ఈ ప్రపంచంలో అవతరించారు కృష్ణుడిగా రాముడిగా వామనుడిగా. ఎందుకు ఇన్ని అవతారాలు అంటే స్వామివి స్వామికి మన పైన ఉండే ప్రేమని చూపిస్తుంది. తన భక్తుల యొక్క ప్రార్థన పట్ల భగవంతుడికి ఉండే ఒక కర్తవ్య నిష్ఠ ని చూపిస్తుంది. వృష్ణి సుతపః నీలాంటి కుమారుడు కావాలి. అంటే అలాంటిదే కావాలి అంటే భగవంతుడి లా మిగతాది ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఎలాగో అలాగా తీసుకుని రావచ్చు. ఇది అలానే ఉంది అని భ్రమతో ఉండవచ్చు. కానీ భగవంతుడి లా ఎవరు ఉంటారు. నీలాంటి కొడుకు కావాలి అని అంటే స్వామి ఆలోచించి నాలాంటి వాడు అంటే ఇసుమంత లక్షణాలు ఉన్న వాడైనా రావాలి కదా ఎవరో ఒకరు కోణ్వస్విన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చవీర్యవాన్ ధర్మధస్య కృతజ్ఞస్య సత్యవాక్కో దృఢవ్రతః చారిత్రేనచ కోయుక్తః సర్వ భూతేషు కోవిధః విద్వాంకః కశ్చమర్ధస్య కస్యైక ప్రియధర్శనః ఆత్మవాన్కో జితక్రోధః బుధ్ధిమాన్కో తరోగతః. ఎన్ని లక్షణాలు భగవంతుడికి. అటువంటి భగవంతుడి యొక్క లక్షణాలు జీవుడికి ఎప్పుడైనా రా గలుగుతాయా. అమ్మా నువ్వు ఇంత కష్టపడి తపస్సు చేశావు కదా నాలాంటి వాడు దొరకడేమో కానీ నేనే వచ్చేస్తాను అని స్వామి దేవకీదేవి గర్భములో ఆవిర్భవించారు. ఎంత అద్భుతం స్వామి వారిలా ఇంకొకరు లేరు. ఆయనలా మనం ఇంకెవరిని భావించలేము. భగవంతుడు భగవంతుడే అటువంటి స్వామి దేవకీదేవి గర్భమున ఆవిర్భవించారు స్వామి నీకు జయము కలుగు గాక. మనం మనకి జయం కలగాలి అని స్వామిని అడగడం తెలుసు కానీ స్వామి నీకు జయము కలగాలి అని అడగటం భక్తి కదా. అందుకే ముకుంద మాల భక్తి స్తోత్రం. అంటే భగవంతుడి దగ్గరకు వెళ్లి ఏమి అడగాలి అసలు. భగవంతుడిని చదవకుండా పాస్ చేయించాలి అంటే ఒకసారి నువ్వు చదివినా నేను పాస్ చేయించే వాడిని అంటారు. మనకి అలవాటు ఏమిటి అంటే మనం భగవంతుడి దగ్గరకి వెళ్లి మనకి జయం కలగాలి అని అడగటమే కానీ ఇక్కడ ఆళ్వార్లు స్వామి నీకు జయము కలుగు గాక అని స్వామిని ప్రార్థన చేస్తున్నారు. ఎటువంటి భగవంతుడిని దేవకీ నన్దనోయం. జయతు జయతు కృష్ణా అనే నామాన్ని ఇక్కడ ఆళ్వార్లు ఉపయోగిస్తున్నారు. ఎంత అద్భుతం కృష్ణా కృష్ణా కృష్ణా అని ఎన్నిసార్లు అన్నా సరే ఇంకా ఇంకా అనాలి అనిపించే మధురమైన నామం కృష్ణ నామం. ప్రేమతో కృష్ణా అని పిలిస్తే మొత్తం రుణపడి ఉన్నాను నేను ఆ వ్యక్తికి అని అన్నట్టుగా భావిస్తాడు ట కృష్ణుడు. కృష్ణా అని రాసినప్పుడు కింద రూ కింద ణ ఉంటుంది ఆ రెండింటిని కలిపితే రుణం అని ఉంటుంది కదా కృష్ణుడికి. చమత్కారంగా చెబుతారు ఇలా రుణం ఉంది కృష్ణుడు కింద అని. ఎవరైనా కృష్ణా అని అనగానే వాళ్లకి రుణపడి పోతారు కృష్ణుడు. అందుకే ఆయన పేరులో కూడా రుణాన్ని పెట్టుకున్నారు. అందుకే ద్రౌపతీ దేవి ఒకసారి స్వామికి ఒక చిన్న వస్త్రం ఇస్తే అయ్యో నాకు వస్త్రం ఇచ్చింది ద్రౌపది అని ద్రౌపదికి నేను ఏమి చేయలేకపోయాను అని బాధపడ్డాడు ట శ్రీకృష్ణ పరమాత్మ. ఎంత రుణపడి పోతాడు భగవంతుడు మనకి. కానీ మనం భగవంతుడి దగ్గరికి వెళ్లి ఆయన దగ్గర నుంచి తీసుకున్నా మనం ఎప్పుడు ఆయనకి చెయ్యాలి అని మనకి అనిపించదు కానీ ఒక్కసారి కృష్ణ నామం చెప్పగానే అయ్యో ఎంత చెప్పాడు కృష్ణా మాధవ ముకుంద గోవిందా అన్నాడు ఏం చేయాలి ఏం చేయాలి అని ఆయన తపన పడుతూ ఉంటారుట. ఎంత అద్భుతమైన తత్వమో. అటువంటి కృష్ణుడికి జయము కలుగు గాక. ఎటువంటి కృష్ణుడు వృష్ణి వంశ ప్రదీపః దీపము ఒక గది లో ఉండే అంధకారాన్ని తీర్చేస్తుంది. ప్రదీప అంటే అజ్ఞానాన్ని దూరం చేసేవాడు. దీపము అంటే కొద్దిగా తన శక్తి ఉన్నంతవరకు దూరంగా కాంతి ఇస్తుంది. ప్రదీప అంటే లోపల ఉండే అజ్ఞానాన్ని అంధకారాన్ని నిర్మూలించే స్వరూపం శ్రీకృష్ణ భగవానుడుది. వెయ్యి సంవత్సరాలు ఒకసారి కూడా తీయని గదిలో మనం దీపం తీసుకు వెళితే వెయ్యి సంవత్సరాల నుంచి చీకటిగా ఉంది కదా అని మెల్లమెల్లగా చీకటి పోయి వెలుగు వస్తుందా లేదు. ఒక్కసారి దీపం పెట్టగానే వెలుగు వచ్చేస్తుంది. అలా మనం లెక్కలేనన్ని జన్మలు.
@vakkalankamani9219
@vakkalankamani9219 4 дня назад
Miru kuda Baga thelivi thetalu prabuji miru krishna tatvam Baga cheputunaru
@vakkalankamani9219
@vakkalankamani9219 4 дня назад
Yentha Baga cheputunnaru prabhuji
@PravinKotagiri
@PravinKotagiri День назад
కృష్ణ అర్పణం
@sitaarasitaara2930
@sitaarasitaara2930 4 дня назад
Hare Krishna prabhuji 🙏🙏🙏, sorry prabhuji , vere uriki vellalsi vaachindi live miss ninna , e roju .
@manikyalakshmi4186
@manikyalakshmi4186 2 дня назад
5. ముకుంద మాలా స్తోత్రం-4 నాహం వందే తవచరణయోఃర్ద్వన్ద్వ మద్వన్ద్వ హేతో కుమ్భీపాకం గురుమపి హరే నారకం నాపనేతుమ్ రమ్యారామామృదుతనులతా నన్దనే నాపి రంతుం-భావే భావే హృదయభవనే భావయేయం భవన్తమ్. నాహం వందే తవ చరణయోః అయ్యా నేను నీ పాదాలకు మ్రొక్కడం లేదు. అయ్యో ఇది ఏమిటి ఇందాక పాదాలు కావాలి పాదాలు కావాలి అన్నాడు ఇప్పుడేమిటి ఇలా అంటున్నాడు పాదాలకు మొక్కడం లేదు అంటాడు ఏమిటి ఈ విచిత్రం. నీ పాదాలకు నేను మొక్కడం లేదు ఎందుకు మ్రొక్కడం లేదు. ఈ ప్రపంచంలో నాకు ద్వంద్వాలు వద్దు అని అడుగుతూ నీ పాదాలకు మొక్కడం లేదు. దేనికోసం మ్రొక్కడం లేదు. మ్రొక్కితే ఏది నాకు రాకూడదని ప్రార్థన చేస్తున్నాను. ద్వంద్వములు ఈ ప్రపంచంలో మంచి చెడు సుఖం దుఃఖం జయ అపజయ మానం అవమానం ఇవి ఎలానో ఉంటాయి.
@manikyalakshmi4186
@manikyalakshmi4186 2 дня назад
6. ఈ ద్వంద్వాలు వాటి కోసం నేను ఏమి మ్రొక్కడం లేదు అనుకోకు తండ్రీ దానికోసం నిన్ను మ్రొక్కాలి అనుకోకు. తండ్రి జనాలు నీ పాదాలకు ఎందుకు మొక్కుతారు అంటే నరకం నుండి మమ్మల్ని బయటపడేసేయి. నరకం అంటే చాలా భయంకరమైన ప్రదేశం రౌరవము అంటే రూరూ అనే పక్షులు. ఇవి పాము లాగా పక్షిలాగా ఉంటాయిట. అవి ఏం చేస్తాయి అంటే జీవుడిని రౌరవం లో ప్రవేశింప చేస్తారో అప్పుడు శరీరంలో ఉండే ఒక్కొక్క అవయవాలను మొత్తం కూడా పొడిచి పీకేసి బయట పెట్టేస్తాయిట శరీరం నుంచి. అలా శరీరంలో ఉండే అవయవాలు అన్నింటిని కూడా పక్కకి పీకేసి పెట్టేస్తాయి రురు పక్షులు. పీకేస్తే మళ్లీ మామూలుగా శరీరంలా అయిపోతుందిట. దీని తర్వాత ఇంకొక నరకంలో పడేస్తారుట. అది కుంభీపాకం. ఒక కుండ ఉంటుంది బాండీ లాంటిది దాని పైన మూత చాలా చిన్నగా ఉంటుందిట. అందులోకి జీవుడిని ప్రవేశింప చేసి సల సలా కాగే నూనెలో పోసి బాగా వేపుతారుట. జీవుడు కనీసం ఊపిరి పీల్చుకోవాలి అంటే బయటికి ఎలా వస్తాడు అంత చిన్న మూత. అందులోంచి బయటికి ఎలా వస్తాడు. దాని పేరే కుంభీపాకం. ఎవరైతే ఈ ప్రపంచంలో అలా చేస్తున్నారో వాళ్లకి అక్కడ అలా జరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది. భక్తి మార్గం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే శుచి శుభ్రత ఆహార నియమం ఇవన్నీ కూడా పాటించడం ప్రారంభం చేస్తాం కాబట్టి. అయితే ఎందుకు నేను నీ యొక్క శ్రీ పాదాలను మ్రొక్క లేదు అంటే ఈ కోరిక అని మొక్కుతారు జనాలు నరకం నుంచి బయటపడేసేయి అని. ఆహా ద్వంద్వాలు వద్దంటున్నావు నరకం నుంచి బయటపడేయి అంటున్నావు. నీకు స్వర్గంలో ఉండే రంభ ఊర్వశి మేనక అనే అప్సరసల యొక్క కాంక్ష ఉందా నీకు అందుకోసం ఏమన్నా నాకు ప్రార్ధనలు చేస్తున్నావా అని అంటే అయ్యా స్వర్గంలో ఉండే చాలా కోమలమైన మృదువైన లతల లాంటి అప్సరసల కోసం నేను దండం పెడుతున్నాను అని అనుకోకు. నాకు అసలు ఆ స్వర్గమే వద్దు. ఈ ప్రపంచంలోని కష్టాలను అనుభవించకుండా మనం స్వర్గాది లోకములకు వెళ్లలేం అని అంటారు. కాబట్టి అటువంటి స్వర్గలోకం మీద కాంక్ష కూడా నాకు లేదు. భావే భావే హృదయభవనే నాకున్న ఏకైక కోరిక ఏమిటి అంటే ఎందుకు నీ శ్రీచరణాలను నేను ఆశ్రయిస్తున్నాను అంటే భావే భావే హృదయభవనే ఎప్పటికీ కూడా నీ యొక్క హృదయపూర్వకమైన నీ యొక్క శ్రీ చరణ పద్మములను నా యొక్క హృదయ భవనంలో ఉంచు. ఇక్కడ కులశేఖర్ ఆళ్వార్లు హృదయాన్ని భవనం అని అంటున్నారు. భవనము అంటే ఒక అద్భుతమైన అర్థం ఏమిటి అంటే ఏ భవనంలో అయితే భగవంతుడు ఉండడో భ తీసేస్తే వనం అవుతుంది. వనం అంటే వనంలో ఏం ఉంటాయి పశువులు క్రూర మృగములు ఉంటాయి. కానీ మనుషులు ఉండరు. మనం ఒక ఇల్లు కట్టుకున్నాము అంటే ఇల్లుకి అందం ఏమిటి అంటే మన భగవధారాధన. అలానే ఈ శరీరం ఒక భవనంగా భావిస్తే హృదయం ఒక భవనంగా భావిస్తే ఆ హృదయం లోపల ఉండే భవనం లోపల ఉండే అంతర్యామి ఏదైతే భగవంతుడు ఉన్నాడో ఆయన యొక్క శ్రీ చరణాలను నిలుపుకోవడం వల్ల ఈ శరీరం ఒక భవనం అవుతుంది. మన హృదయం ఒక భవనం అవుతుంది కానీ అది లేకపోతే వనంలా అవుతుంది. మనం కూడా ఒక మృగంలా మారిపోతాము. ఎవరికైతే ఈ భగవత్స్పృహ ఉంటుందో ఎవరికైతే ఈ భగవంతుడి యొక్క చక్కటి అవగాహన ఉంటుందో ఎవరైతే భగవంతుడికి ఈ విధంగా ప్రార్థన చేస్తారో వాళ్లు మాత్రమే తేజోవంతులై సాత్వికులై ధర్మ నిష్టులై భగవంతుడికి అత్యంత దగ్గరగా వాళ్ళు ఉంటారు. ఈ ప్రార్థన చేస్తున్నారు కులశేఖర్ ఆళ్వార్లు. ఈ యొక్క కోరిక ఆళ్వార్లు కి. అయ్యా నా హృదయాన్ని భవనం చెయ్యి. ఎలా నీ శ్రీ పాదపద్మములను నా హృదయంలో ఎల్లప్పుడూ ఉంచు. ఎప్పటికీ కూడా నీ శ్రీ పాదాలు నా హృదయం లో ఉంచు తండ్రి అని ఎంతో చక్కటి ప్రార్థనలు చేస్తున్నారు కులశేఖర్ ఆళ్వార్లు.
@manikyalakshmi4186
@manikyalakshmi4186 День назад
7. ముకుంద మాలా స్తోత్రం-5. నాస్దా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే యద్బావ్యం తద్బవతు భగవన్పూర్వ కర్మానురూపమ్ ఏతత్ప్రర్ద్యం మమ బహు మతం జన్మజన్మాంతరే పి త్వత్పాదామ్బోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు. ఆస్తా అంటే నమ్మకం లేదా ప్రయత్నం. ఇక్కడ కులశేఖర్ ఆళ్వార్లు చెబుతున్నారు నాకు ఈ ధర్మం పుణ్యం సంపాదించు కోవడంలో ఎటువంటి ఆశక్తి లేదు. డబ్బుల పట్ల కూడా నాకు ఆసక్తి లేదు. పరమాత్మ అనుకుంటూ ఉంటాడు కులశేఖర ఏమిటి నువ్వు నన్ను పారలౌకిక విషయములు వద్దు అని ప్రార్ధన చేస్తున్నావు. కావాలంటే నీకు ఏమైనా ఇహ లౌకిక విషయం లు ఏమైనా కావాలా. అంటే ఇహలోకంలో కూడా నాకు ఏమి వద్దు తండ్రి అని స్పష్టంగా చెబుతున్నారు. భగవంతుడికి భక్తుడికి ఇటువంటి మాటలు నడుస్తూ ఉంటాయి కానీ కేవలం భక్తుడు మాత్రమే ఊహించుకుంటాడు. ఏ భక్తుడి కైతే భగవంతుడి పట్ల అచంచలమైన ప్రేమ ఉన్నదో అటువంటి భక్తుల యొక్క ప్రార్థనలు విన్నప్పుడు మనం కూడా ఆ రుచిని అనుభవించవచ్చు కులశేఖరా నువ్వు పారలౌకిక విషయాలు వద్దు అంటున్నావు కదా ఈ సంసారం సంసారిక విషయాలు ఏమన్నా కావాలా అంటే అమ్మ వద్దు తండ్రి వద్దు నాకు ఈ ధర్మం పట్ల ఎటువంటి ఆసక్తి లేదు. ఈ ప్రపంచంలో ఉండే భోగముల పట్ల కూడా నాకు ఎటువంటి ఆసక్తి లేదు. మనకి చతుర్విధ పురుషార్ధములు అంటే ధర్మము అర్థము కామము మోక్షములు. మొదటిది ఆఖరిది మంచిదే మధ్యలో ఉన్నవే ప్రమాదకరమైనవి. మోక్షము మంచిదే అనుకుందాము అనుకుంటే ధర్మము మంచిదే. మధ్యలో ఉండే అర్థము అంటే డబ్బులు దాని పక్కన ఉండే కామము ఉంది కదా ఈ రెండూ చాలా ప్రమాదకరమైనవి. మరి ఇవి చతుర్విధ పురుషార్ధములు అని ఎందుకు పెట్టారు అంటే ఈ మధ్యలో ఈ రెండింటిని ఎందుకు పెట్టారు అంటే ద్వివిధ పురుషార్థములు అని ధర్మము మోక్షము చెప్పవచ్చు కదా. మనం ఎప్పుడు చతుర్విధ పురుషార్థములు అని విన్నా ధర్మ అర్థ కామ మోక్షములు అని వింటాము. మనం రెండింటిని విడదీయాలి. అర్థము సంపాదించడం ధర్మం కోసం సంపాదించాలి. డబ్బులు సంపాదించిన అప్పుడు ధార్మికమైన కార్యక్రమముల కోసం సంపాదించాలి. అర్థము ధర్మము ఒక జోడు అయ్యాయి. కామము మోక్షము మనకుండే కోరిక కేవలం మోక్షం కై ఉండాలి మనకి ఉండవలసిన కోరిక ఏ కోరిక ఉండాలి మనకి అంటే భగవంతుడిని చేరుకోవాలి అనే కోరిక ఉండాలి. అందుకే ఈ రెండింటిని కలిపారు. డబ్బులు సంపాదించాలి సంపాదించకుండా ఉండకూడదు. సోమరితనం వద్దు డబ్బు సంపాదించాలి. ఏం చేయాలి ఆ డబ్బులతో ధర్మం కోసం కష్టపడాలి. ధర్మం కోసం వాటిని ఖర్చు పెట్టాలి. ధార్మికంగా సంపాదన చేయాలి. మన వ్యవస్థ సాగాలి అంటే డబ్బు ఉండాలి. వ్యవస్థ సమాజ సేవ దేశ సేవ వాటి కోసం పాటుపడుతున్న వాళ్ళకి సహాయం చేయాలి. ధర్మము అర్థాన్ని కలపాలి. కామము మోక్షం తో కలపాలి. కామం అంటే కోరిక ఏ కోరిక కలగాలి తీవ్ర ఇచ్చ కలగాలి అంటే మోక్షం పొందటానికి. ఎటువంటి మోక్షం పొందడానికి మనకి 5 విధములైన మోక్షములు ఉంటాయి. సాయుధ్య సామీప్య సారూప్య సాలోక్య సారీష్టి. సాలోక్య అంటే భగవంతుని యొక్క లోకానికి చేరుకోవడం. సారూప్య అంటే భగవంతుని యొక్క రూపమే మన యొక్క రూపంగా, మనం కూడా స్వామి యొక్క రూపం పొందితే మరి స్వామికి ఎటువంటి తారతమ్యం తెలియదా అని అంటే, ఒకటే ఒక తేడా ఏమిటి అంటే వైకుంఠ పార్షధులకు భగవంతుడికి ఒకటే ఒక తేడా ఏమిటి అంటే శ్రీవత్స చిహ్నము. శ్రీవత్స చిహ్నం కేవలం భగవంతుడి యొక్క వక్షస్థలం పైనే ఉంటుంది. మిగతా వైకుంఠ పార్షదులు అందరూ భగవంతుడి లాగే కనిపిస్తారు. శంఖ చక్ర గదా పద్మములు పట్టుకుని. కానీ శ్రీవత్స చిహ్నం మాత్రమే తేడా. సామెత అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం. సారిస్టి భగవంతుడికి ఉండవలసిన ఐశ్వర్యములు మనకి కూడా అంటే భగవంతుడు దగ్గరికి వెళితే ఆయన ఐశ్వర్యములు మనకి వస్తాయి. సాయుద్య అంటే భగవంతుడిలో కలిసిపోవడం. అది భక్తులు ఎప్పుడు కూడా కోరుకోరు. ఇవన్నీ పూర్వకర్మాను రూపం తండ్రి. మనకు వచ్చే ధర్మం మనకు వచ్చే సదుపాయాలు సుఖాలు దుఃఖాలు అన్ని కూడా పూర్వ కర్మాను రూపం. మనం ఇంతకుముందు చేసుకున్న కర్మ ఫలితం. దీనిని అనుభవించవలసినదే. ఈ కర్మను ఎలా మనం దాటాలి అంటే అనుభవించి మాత్రమే దాటాలి. వేటి పైన వెంపర్లాట వద్దు మనకి. మరి దేని పైన మన యొక్క భావన ఉండాలి అంటే దేనిపైన మన విలువైన మానవజన్మ దృష్టి పెట్టాలి దేనిపైన మనం కష్టపడాలి అంటే భగవంతుడి యొక్క శ్రీ చరణముల పైన జన్మ జన్మాంతరాల కి మన మనసులో ఉండేటట్టుగా కోరుకోవాలి. ఏం చేస్తే మన మనసులో ఉండేటట్టుగా మనం మానవ జన్మలో పుట్టినప్పుడు అధా తో బ్రహ్మ జిజ్ఞాస శరీర మాద్యం కలు ధర్మ సాధనం.
@manikyalakshmi4186
@manikyalakshmi4186 День назад
8. ఈ శరీరం మనకి వచ్చింది ఈ ధర్మం ఏమిటో తెలుసుకుని భగవద్భక్తి ఏమిటో తెలుసుకుని దానిని ఆచరించడానికి కానీ, ఈ కష్టం పోవాలి ఆ కష్టం పోవాలి అది కావాలి ఇది కావాలి అని కోరుకోవడానికి కాదు. ఎంత అద్భుతమైన ప్రార్థన. ఇది నిజమైన ఆధ్యాత్మికత అంటే ఇది కులశేఖర ఆళ్వార్లు మన పైన చూపించిన ఒక గొప్ప కృప. ముకుంద మాలా స్తోత్రం-6 ది వివా భువి వా మనస్తు వాసో నరకే వా నరకాన్తక ప్రకామమ్ అవధీరితశారదారవిందౌ చరనౌ తే మరణే-పి చిన్తయామి భగవంతుడిని ఇక్కడ ముకుందా అని పిలిచిన కులశేఖర్ ఆళ్వార్లు నరకాంతకా అని పిలుస్తున్నారు ఈ శ్లోకంలో. నరకాంతక అంటే నరకాసుర సంహారం చేసిన వాడు అని అర్థం. నరకాసురుడు చాలా దుష్ట ప్రవృత్తి కలిగిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుడిని సంహరించేసి నరకాసురుడి యొక్క చెరలో ఉన్న సాత్వికమైన రాజ కన్యలను వివాహం చేసుకున్నాడు. భగవంతుడిని ఆశ్రయిస్తే భగవంతుడు ఏం చేస్తాడు అని అంటే మన దగ్గర ఉండే చెడు లక్షణములను దూరం చేసి మన దగ్గర ఉండే మంచి లక్షణములను ఆయన యొక్క సేవలో వినియోగించుకుంటారు. ఎలా మనం ఇది చేసేది అని అంటే భగవన్నామం. ఎప్పుడైతే మనం భగవాన్నామం చేస్తామో హరే కృష్ణ మంత్రాన్ని అంటామో మనం భగవంతుడిని మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాము. ఎప్పుడైతే మనం భగవంతుడిని మన జీవితంలోకి ఆహ్వానించామో అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు అంటే మన దగ్గర ఉండే చెడు లక్షణాలను తీసేస్తాడు. మంచి లక్షణాలను ఆయన స్వీకరిస్తారు. ఇదే కదా స్వామి చేసేది. ఇదే కదా భగవన్నామం యొక్క వైభవం. ఎంత భగవన్నామం అంటే ద్రౌపది దేవిని కాపాడటానికి కృష్ణుడు బయలుదేరినా పాపం కొద్దిగా సమయం పట్టేది కానీ ఆయన నామం మాత్రం మొదటే ఉద్ధరించేసింది. ద్వారక నుంచి రావాలంటే కొద్దిగా కష్టం కదా. భగవంతుని యొక్క నామం అందరి కంటే అందుబాటులో ఉంటుంది. ఎక్కడైనా సరే మనం ఏ పరిస్థితిలోనైనా సరే సాకేత్యం పరిహాసంస్త స్తోహం హేళనమేమివ వైకుంఠ నామ గ్రహణం అశేషాకహరం విదుః. అటువంటి శ్రీకృష్ణ నామాన్ని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో ఎప్పుడైతే శ్రీకృష్ణ భక్తిలో మనం ఉంటామో అప్పుడు మన దగ్గర ఉండే చెడు అలవాట్లు చెడు లక్షణములు అన్నీ కూడా తొలగిపోతాయి. నరకాంతక అంటే ఒక అర్థం నరకాసురుడిని సంహరించిన వాడు. రెండవ అర్థం ఏమిటి అంటే నరకాన్ని తీసేసే వాడు. ఎవరైతే భగవంతుడి యొక్క సేవలో ఎవరైతే భగవంతుని నామం చెబుతారో ఎవరైతే భగవధ్భక్తిలో ఉంటారో వాళ్లు ఎన్నటికీ కూడా నరకాన్ని చూడలేరు. చూడవలసిన అవసరం రాదు. శంకరాచార్యుల వారు చెప్పినట్టు భగవద్గీత కించిద ధీత ఎవరైతే భగవద్గీతను అధ్యయన చేస్తారో ఎవరైతే భగవద్గీతలో ఉండే విషయములను అర్థం చేసుకుంటారో గంగాజలలపి కలికా పీత గంగా జలాన్ని ఎవరైతే సేవిస్తారో ఎవరైతే ఆరాధన చేస్తారో అంటే పుణ్య నదుల్ని గంగా తత్వము విష్ణు పాదోధ్భవి గంగా. బ్రహ్మ కడిగిన పాదము. ఎప్పుడైతే ఆ బ్రహ్మ గారి యొక్క కమండలంలో నుంచి వచ్చిన జలం మందాకిని గంగగా ప్రవహిస్తూ ఉన్నాయి. అటువంటి గంగానదిని సేవించిన సకృతపి యేన మురారి సమర్చా ఎవరైతే మనస్ఫూర్తిగా శ్రీకృష్ణ భగవానుని అర్చన చేస్తారో క్రియతే తస్యతి మేళన చర్చా అటువంటి వాళ్లు ఎప్పుడూ యముడి గురించి మాట్లాడరు. అటువంటి వాళ్ళు ఎప్పుడు యముడిని చూడరు. శ్రీకృష్ణ భగవానుడు యమపురికి వెళ్లి గురువుగారు అయిన సాంధీపని మహర్షి యొక్క కుమారుడిని వెనక్కి తీసుకువస్తారు. ముధ్గలో పాఖ్యానం లో ముద్గలుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనిని నరకానికి తీసుకువెళ్ళేటప్పుడు చాలా మర్యాదగా తీసుకువెళ్తారు. ఎంత మర్యాదలు చేస్తారు అంటే వాళ్ళు తిట్టే తిట్లకు కళ్ళు తిరిగి కింద పడిపోతారుట. కొట్టడం కాదు ఉట్టి తిట్టడమే. అంత మర్యాదలు చేసి తీసుకు వెళితే నరకానికి. అయితే వీళ్ళు నరకానికి తీసుకువెళ్లారు ట అక్కడేమో యమధర్మరాజు చూసేసరికి స్వాగతం అండీ రండి అని కూర్చోండి అని అంటున్నారు ట. ముధ్గలుడి కి కొద్దిగా ప్రశ్న వచ్చిందిట. ఇదేమిటి అబ్బా వీళ్ళ బటులు ఏమో అన్ని మర్యాదలు చేశారు. ఇక ఈయన ఇంతగా గౌరవంగా మాట్లాడుతున్నాడు ఏమిటి దీంట్లో రహస్యం అని అంటే యమధర్మరాజు చెప్పారుట. నువ్వు తెలిసో తెలియకో సాకేత్యంపారిహాసంస్థ స్తోహం హేళన మేమివ ఒకసారి దానం ఇచ్చే స్వభావం కలిగిన వాడు కాదు కానీ ఎవరో నీ దగ్గరకు వచ్చి దానం అడిగేసరికి నువ్వు కృష్ణార్పణం అంటూ దానం ఇచ్చావు ఒకసారి నువ్వు కృష్ణా అన్నందుకు నీకు ఇంత వైభవం కలిగిందయ్యా. నువ్వు కృష్ణా అన్న విషయం పాపం వీళ్లు గుర్తు తెచ్చుకోలేదు.
@manikyalakshmi4186
@manikyalakshmi4186 День назад
9. అందుకే నిన్ను అలాగా మిస్ ట్రీట్ చేశారు అని యమ ధర్మరాజు ఆయనని కూర్చోబెట్టి చక్కగా సేవలు చేశారుట. అంత గొప్పదా కృష్ణ నామం అని ముద్గలుడు అడిగితే అయ్యో కృష్ణ నామం యొక్క వైభవం నీకు తెలియదా అని యమధర్మరాజు కృష్ణుడి గురించి కృష్ణ నామం గురించి యమపురి లో వర్ణిస్తూ ఉంటే ఒక్క నిమిషం ఆయన వర్ణిస్తున్న క్షణం నరకం మారిపోయి స్వర్గంలా అయిపోయింది అని చెబుతారు ముధ్గలో పాఖ్యానం లో. అంత వైభవమైన విషయం కృష్ణుడి యొక్క నామం. కులశేఖర ఆళ్వార్లు అంటున్నారు. స్వర్గంలో ఉన్నా ఎక్కడైనా నరకంలో ఎక్కడున్నా పరవాలేదు తండ్రి నాకు. కానీ నీ యొక్క శారదారవిందములు అవి మాత్రం నా హృదయంలో ఉండాలి అవి నాకు ముఖ్యం ఎప్పటికీ కూడా తండ్రి. నీ యొక్క శ్రీపాద చిహ్నములు నా యొక్క మనసులో ఉంచు. మనం నరకానికి వెళ్లినా స్వర్గానికి వెళ్ళినా బ్రహ్మ లోకానికి వెళ్లినా ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తి నో అర్జునా మాముపేత్యతి కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఇవన్నీ కూడా నాశనం అయ్యేవే ఇవన్నీ కూడా పోయేవే ఏది శాశ్వతమైనది అని అంటే మనం చేసిన భక్తి మాత్రమే. అందుకే ఈయన ప్రార్థన చేస్తున్నారు. అయ్యా నీ యొక్క శారదారవిందములు నీ యొక్క చరణారవిందములు నీయొక్క అభయ చరణారవిందములు నా యొక్క హృదయంలో మరణేపి చింతయామి. ఎప్పటికీ మరణ పర్యంతము కూడా నా మనసులో ఉండేటట్టుగా అనుగ్రహించు. ఎందుకు అంటే మరణ కాలంలో భగవంతుడిని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. బ్రతికి ఉన్నన్నిన్నాళ్ళు నీ నామస్మరణ మరువను కానీ మరణ కాలమునందు మరతునేమో. అని ఒక భక్తుడు అంటున్నాడు. ఎంత నమ్మకమో. కానీ ఎందుకు మరిచిపోతాను అనుకుంటున్నావు ఆ మాత్రం నమ్మకం లేదా. తలతునో అంటానో లేదో తెలియదు నేటికి ఇప్పుడే నీ నామస్మరణ చేతు చెవి నిడవయ్యా. ఆ కోటా కూడా నేను ఇప్పుడే పూర్తి చేసేస్తున్నాను. ఆవేళ యమదూతలాగ్రహముగా వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టినప్పుడు ప్రాణములు పట్టి ఈ జీవుడిని లాగినప్పుడు కఫ వాత పిత్తముల్ కప్పగా కఫ ముధ్భవించి కష్టపడుచు కఫ వాత పిత్తములన్నీ కొన్ని వేల తేళ్లు కుట్టిన నొప్పి అనుభవిస్తున్న జీవుడు నారాయణ అనుచు తలుతునో తలపనో ఇప్పుడే నారాయణ అనుచు తలతునిప్పడే శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర. నరసింహ నరసింహ లక్ష్మీ దానవాంతక కోటి భానుతేజ గోవింద గోవింద గోవింద సర్వేశ పన్నగ సాయి పద్మనాభ చెవు నిడవయ్య భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర. ఇప్పుడే నేను మంచిగా అన్ని ఉపయోగించుకుంటాను అనే భావన చాలా మంచిది. ఇక్కడ కులశేఖర్ ఆళ్వార్లు మనకి మంచిగా అమ్మ మందు వేసుకోవడం లేదు అని చిన్న తీపి ముక్క బెల్లం ఏదో ఒకటి పెట్టి దాని లోపల చక్కగా మందుని ఇస్తుంది. అలా ఇంత అద్భుతమైన శ్లోక మాధ్యమంలో మనకి కులశేఖర ఆళ్వార్లు అద్భుతమైన భక్తి తత్వాన్ని అనుగ్రహిస్తున్నారు. అటువంటి ముకుందమాల మనం అందరం భగవంతుడికి ఒక మాల వేస్తున్నాము. ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేరుస్తున్నాము. మనం పూర్తిగా మాల చేసి ఆయన ముందుకి సమర్పణ చేసి వెళ్ళాలి.
@satyavathivakkalanka9818
@satyavathivakkalanka9818 3 дня назад
Harekrishnaprabuji naperu satyavthi nenu meprogramus livelo chudadam velukavadamuledu nenu yóutobulo chustanu nenu brudavanam ravadaneki avakasamestsara
@KrishnaveniY-lw1gv
@KrishnaveniY-lw1gv 4 дня назад
Lord Krishna pooja demo video pedthara prabhuji
@arjunmalik8565
@arjunmalik8565 4 дня назад
Radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe🙏
@manikyalakshmi4186
@manikyalakshmi4186 2 дня назад
3. అయ్యా ముకుందా మోక్షాన్నిచ్చే తండ్రి నువ్వు ఎందుకు ఈ ప్రపంచంలో వచ్చావు దేవకి గర్భంలో ఎందుకు ఆవిర్భవించావు అని అంటే ఈ పృథ్వి కి ఉండే భారాన్ని తీర్చడానికి ఆవిర్భవించారుట శ్రీకృష్ణ పరమాత్మ. ఏమిటి భారం అంటే ఏమి చేసినా పృథ్వికి భారం అవ్వదు. ఎప్పుడైతే మనం భగవంతుడిని మర్చిపోతామో అప్పుడు పృథ్వి కి భారం. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క సేవ చేయమో అప్పుడు పృథ్వి కి భారం అవుతాము. ఎప్పుడైతే మనం ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మ మార్గంలోకి వెళతామో అప్పుడు పృథ్వి కి భారం. అటువంటి పృద్వి యొక్క భారాన్ని దూరం చేయడానికి కృష్ణుడు ఆవిర్భవించాడు. కులశేఖరాల్వార్ అంటారూ ఎవరైతే కృష్ణుడిని పూజిస్తారో వాళ్ళకి చాలా తెలివితేటలు ఉంటాయి. అపరిమితమైన తెలివితేటలు సొంతమవుతాయి కృష్ణుడిని ఆరాధిస్తే. ఇక్కడ కులశేఖర్ ఆళ్వార్లు అంటున్నారు. పృద్వి యొక్క భారాన్ని దూరం చేయడానికి వచ్చిన నువ్వు నా భారాన్ని తీయలేవా అని కృష్ణుడికి ఒక హింట్ ఇచ్చారు. కులశేఖర్ ఆళ్వార్లు అయ్యా నువ్వు పృద్వి యొక్క భారాన్ని తీసేయడానికి వచ్చిన స్వామివి అని అంటే కృష్ణుడు అవును కదా నేను పృద్వి యొక్క భారాన్ని తీసేయడానికి వచ్చాను కదా అంటే, మరి నా యొక్క భారాన్ని తీయలేవా అని అంటే ఏమిటి నీ దగ్గర ఉండే భారం అసలు ఎందుకోసమని కృష్ణుడిని ఇలా గాలిలోకి లేపుతున్నారు కులశేఖరాల్వార్ అనేది తర్వాతి శ్లోకంలో చూద్దాం అసలు ఆయన ఆంతరంగిక ఏమిటి.
@rondakarthik
@rondakarthik 3 дня назад
Hare krishna prabhuji panchga pranamalu Naku oka prashna emiti ante kulashekara Alwarlu varu elapudu Bhagavantuni charanalu ne kavali ani aduguthunaru, Bhagawanuni sri mukham ni ,ayana yokka tribhanga swarupam ni adagavachu kada prabhuji.Dayachesi na prashanaku reply ivandi prabhuji Hare Krishna prabhuji 🙏
@vijayalaxmimadap8137
@vijayalaxmimadap8137 3 дня назад
వడ్డి ప్రబూజీ
@snehalatha8552
@snehalatha8552 День назад
Panthulu garu baghavathgeetha naku chadavalani undi telugulo untundha unte book name cheppandi
@KondreddySusmitha
@KondreddySusmitha День назад
🙏 prabhuji naku oka doubt prabhuji konni Krishna temples lo only Krishna matarme unnaru radha matha ldhu endhuku ani prabhuji
@annapurnabhamidipati9056
@annapurnabhamidipati9056 4 дня назад
Ela join avali you tube lo na sri krishna kadha murtham lo
@saikrupa8651
@saikrupa8651 4 дня назад
Naku balakrishnudu kalalo vachadu enti meaning
@manikyalakshmi4186
@manikyalakshmi4186 2 дня назад
మంచిదేగా అదృష్టవంతురాలివి.
@saikrupa8651
@saikrupa8651 2 дня назад
@@manikyalakshmi4186 meaning enti aunty
@manikyalakshmi4186
@manikyalakshmi4186 2 дня назад
@@saikrupa8651 మనం కృష్ణుడి గురించి భక్తి గా వింటూ ఉంటే ఆయనే మనకి కలలోకి వస్తారు. అంటే నువ్వు చదువుకుంటూ ఉంటే నీకు అంతా మంచిగా ఉంటుంది. నీకు కృష్ణుడు కలలోకి రావడం వల్ల నీకు ఆనందంగా ఉంది కదా. అదే అర్ధం. నిన్ను సంతోషపెట్టడానికి వచ్చారు మాట. అర్ధం అయిందా. ఏం చదువుతున్నావు బంగారం
@Saffron-lm8fj
@Saffron-lm8fj День назад
Hare Krishna prabhuji 🙏
@ramakrishnas5504
@ramakrishnas5504 11 часов назад
Hare krishna prabhuji ❤❤❤❤❤
@saradasalla2990
@saradasalla2990 4 дня назад
Hare Krishna
@manakondapi7419
@manakondapi7419 День назад
Harekrishna prabhuji 🎉🙏🙏🙏🙏🙏
@KondreddySusmitha
@KondreddySusmitha День назад
Hare Krishna prabhuji
@AnushaAnusha-xq9ig
@AnushaAnusha-xq9ig 2 дня назад
Hare Krishna prabhuji 🙏
@simhachalambonthu4801
@simhachalambonthu4801 3 дня назад
Hare Krishna Prabhu ji
@challaraoy8982
@challaraoy8982 4 дня назад
Hare Krishna prabhuji
@KusumaKotamreddy
@KusumaKotamreddy 3 дня назад
Harekrishna prabhuji 🙏🙏
@annapurnabhamidipati9056
@annapurnabhamidipati9056 4 дня назад
Hare krishna prabhuji 🙏
Далее
For my passenger princess ❤️ #tiktok #elsarca
00:24
For my passenger princess ❤️ #tiktok #elsarca
00:24