ప్రకాశించే ఆ దివ్య సీయోనులో ఘనుడా ! నిన్ను దర్శింతును కలలోనైనా అనుకోలేదు. నాకింతభాగ్యము కలదని ఆరాధన..ఆరాధనా... ఆరాధన నీకే ఆరాధన... 1 నన్నుదాటిపోని సౌందర్యుడా నా తట్టు తిరిగిన సమరేయుడా నా తండ్రీ! నీ సముఖములో దీనుడనై నిన్ను ధర్శింతును " ఆరాధన" 2 వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని నా తండ్రీ ! నీ సన్నిధిలో... నిత్యము ఆరాధింతును.. " ఆరాధన" 3 మహిమతో నిండిన నీ రూపము నీ నీతితో నిను దర్శింతును నా తండ్రీ ! నీ రాజ్యములో .. నీ వలె ప్రకాశింతును.......... " ఆరాధన"