ఆవుల్ని కాచినా ఆటల్లో తేలినా
అంతతోనే ఆగెనా ఆ బాలుడు ...
అవతార మూర్తిగా తన మహిమ చాటెగా
లోకాల పాలుడు గోపాలుడు
తీయని మత్తున ముంచిన మురళీ లోలుడు
మాయని దూరము చేసిన గీతాచార్యుడు
కనుకనే అతని కధా తరములు నిలిచె కదా
తలచిన వారి ఎద తరగని మధుర సుధ
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే 🪈🙏
Self composed.
28 сен 2024