"Aha Anandame" by Heavenly Grace Indian Church
పల్లవి : ఆహా ఆనందమే పరమానందమే - ప్రియ యేసు నొసగె నాకు
కొలతలేనిది బుద్దికందనిది - ప్రేమన్ వివరింప వీలగునా
1. నీచ ధ్రోహినైన నన్ - ప్రేమతో చేర్చుకొని
పాప ఊబి నుండి నన్ - పైకి లేవనెత్తెను
2. నిత్యనాశన పురముకు - నే పరుగిడి వెళ్ళుచుండ
నిత్య జీవమార్గములో - నన్నునడిపితివి
3. నీ ప్రేమ స్వరమున్ విని - నేను మేలుకొంటిని
ప్రియుని రొమ్మును చేరను - నాలో వాంచ్ఛ ఉప్పొంగుచుండె
4. మధ్యకాశమునందున - ప్రభుని చేరెడు వేళలో
ఆనందమానందమే - ఎల్లప్పుడానందమే
#AhaAnandame #ఆహాఆనందమే #HeavenlyGraceChurch
24 сен 2024