Abraham anna LIve singing at Hanuman Junction Alla's wedding Original Music by Kamalakhar anna Live Music Credits Keys - Sandy Rhythms - Noel Indian Percussions - Prasangi
అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి //అతి పరిశుద్ధుడా // సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా // అతి పరిశుద్ధుడా // సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి //అతి పరిశుద్ధుడా//