శీతాకాలం వేకువజాము పొగ మంచు అడుగుతోంది ఎక్కడ నీ ప్రియుడు అని?? పొగ మంచు కి ఎలా చెప్పగలను నా హృదయం లో నే కొలువై వున్న సంగతి!! పెరట్లో విరబూసిన మందారం నవ్వుతూ అంటోంది నాలా అయినా పలకరించాడా నీ చెలికాడు అని?? ఎలా తెలుపగలను పెదవుల పై ఉన్న నవ్వు తనదే అని!! అమావాస్య రాత్రి మినుకుమంటున్న తార అడుగుతోంది నీ ప్రియుడి జాడ ఎటు వైపు అని?? తార కి ఎలా చూపగలను తలపులు వెన్నెలలా నన్ను ఎలా తడుపుతున్నాయో!! నేనే తను, తనే నేను అయినపుడు ఉంటేనేం నాతో వున్నట్టు కాదా?? ఏ రోజాయితేనేం రోజూ ప్రేమికుల రోజు కాదా???