Тёмный
No video :(

Caste Groups try to own great emperor Krishnadevaraya |శ్రీకృష్ణదేవరాయల కులమేది?| Shaili & Shaili TV 

Shaili & Shaili TV
Подписаться 20 тыс.
Просмотров 320 тыс.
50% 1

#srikrishnadevaraya #krishnadevaraya #hampihistory #vijayanagarahistory #bhageeradhag
The controversy over the caste of Sri Krishnadevaraya of Vijayanagar emperor began again. Krishnadevaraya was a great emperor, who fought with the Muslim sultans entire his life. Who considered the entire Hindus were his family. Krishnadevaraya married Thirumala Devi, Chinnadevi, Annapurnadevi and Jaganmohini from different castes and regions. Caste groups should know Srikrishnadevaraya never ruled from the caste point of view.. ! Watch @Shaili&ShailiTV
కృష్ణదేవరాయల మీద కులం ముద్రా ?
శ్రీకృష్ణదేవరాయల కులం గురించి మళ్ళీ వివాదం మొదలైంది
రాయలు మహా రాజులకు కూడా కుల ముద్ర వేస్తున్నారు .
రాయలు తమ కులం వాడేనని ఆయన్ని స్వంతం చేసుకుంటున్నారు .
శ్రీకృష్ణదేవరాయలు తెలుగు జాతికి, భాషకు, సంస్కృతికి గట్టి పునాది వేసిన మహనీయుడ, మహోన్నతమైన మహారాజు. 1509 నుంచి 1530 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన మహా చక్రవర్తి కృష్ణదేవరాయలు. రాయలు కాపు కులానికి చెందివావాడని కొందరు, కాదు యాదవ కులానికి చెందిన వాడని మరికొందరు అక్కున చేర్చుకోవాలనుకుంటున్నారు. తమ కులంలో కలుపు కోవాలనుకుంటున్నారు ఈ వివాదం చాల సంవత్సరాల నుంచి వుంది . నిజానికి కృష్ణదేవరాయలు తెలుగువాడు కూడా కాదు
ఆయన ముత్తాత తిమ్మ నాయక కర్ణాటక ప్రాంతానికి చెందినవాడు . అతను తెలుగు మహిళ దేవకిని వివాహం చేసుకున్నాడు వీరి కుమారుడు ఈశ్వర నాయక చంద్ర గిరి కి వచ్చి తెలుగు అమ్మాయి బుక్కమాంబను పెళ్లి చేసుకున్నాడు వీరికి జన్మించినవాడు . నరసా నాయకుడు. ఇతనికి ముగ్గురు భార్యలు. తిప్పాంబ , నాగాంబ , ఓబాంబ. తిప్పాంబ కు వీరనారసింహ రాయలు , నాగాంబకు శ్రీకృష్ణదేవరాయలు, ఓబాంబకు రంగ రాయలు, అచ్యుతదేవరాయలు జన్మించారు .
అయితే నాగాంబ తెలుగు మహిళ అంటారు . ఈమెకు జన్మించినవాడే కృష్ణదేవరాయలు .
రాయలు వికృతి నామ సంవత్సర పుష్య బహుళ ద్వాదశి శుక్రవారం నాడు అంటే 17 జనవరి 1471 నాడు జన్మించాడు .శ్రీ కృష్ణుని అంశతో జన్మించాడు కాబట్టి కృష్ణదేవరాయలు అనే పేరు పెట్టారని తెలుస్తుంది . ఈ విషయాన్నీ ఆయన పెద్ద కుమార్తె తిరుమలాంబ తాను రాసిన మరీచి పరిణయం అనే గ్రంథంలో పేర్కొన్నది
కృష్ణదేవరాయలుకు నలుగురు భార్యలు, తమిళనాడుకు చెందిన తిరుమలదేవి , ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన నాగలాదేవి , ఒరిస్సాకు చెందిన జగన్ మోహినని. మరో భార్య అన్నపూర్ణాదేవి . వీరిని అధికారికంగా వివాహం చేసుకున్నాడు . అయితే కృష్ణదేవరాయలు తల్లి నాగాంబిక వేశ్య అని కొంతమంది చరిత్ర కారులు, సాహితీవేత్తలు చెబుతున్నారు
ఇది నిజం కాదు . కృష్ణదేవరాయలకు నలుగురు భార్యలు , తిరుమలాదేవి , చిన్నాదేవి, జగన్మోహిని , అన్నపూర్ణాదేవి . అయితే రాయలు వివాహం చేసుకున్న చిన్నాదేవే నాగలాదేవి. ఆమె వేశ్య కుటుంబంలో జన్మించింది. ఈమె అద్భుతమైన నర్తకీ మణి , గాయకురాలు .
కృష్ణదేవరాయలు చంద్రగిరిలో వున్నప్పుడు నాగలాదేవి అందం, నృత్యం చూసి అమితంగా ఇష్టపడ్డాడు అంతఃపురం ఏకమై అభ్యంతరం చెప్పినా , అప్పాజీ వారించినా, రాయలు 1510లో పట్టాభిషేకం సందర్భంగా ఆమెను వివాహం చేసుకుని తన వాగ్దానం నిలుపుకున్నాడు .
నాగలాదేవి పుట్టిన ఊరుకు నాగలాపురం అనే పేరు పెట్టాడు . ఇది చిత్తూరు జిల్లాలో వుంది .
కృష్ణదేవరాయలు నాగలాదేవి మీద వున్నఆరాధనతో విజయనగర రాజధాని హంపీ శివారుల్లో కొత్త పట్టణాన్ని కట్టించాడు . దానికి నాగలాపురం అన్న నామకరణం చేశాడు . . ఇప్పటి హోస్పెట్ అప్పటి నాగలాపురం. "ఏ ఫర్గాటెన్ ఎంపైర్" అనే పుస్తకంలో రాబర్ట్ సెవెల్ చాలా స్పష్టంగా పేర్కొన్నాడు.
ఇక కృష్ణదేవరాయల పూర్వీకులది కర్ణాటక లోని తుళునాడు . తాత హయాంలో చంద్రగిరి వచ్చి స్థిరపడ్డారు .
తెలుగు భాష నేర్చుకొని తెలుగువారితో మమేకమై పోయారు .
పూర్వాశ్రమంలో కురుబ కులం అంటారు. ఆ తరువాత ఎక్కడా కుల ప్రస్తావన లేదు . తాము చంద్ర వంశం వారమని చెప్పుకొనేవారు .
అయినా కృష్ణదేవరాయలు. యావత్ దక్షిణ భారత దేశంలోని హిందువుల అభ్యున్నతికి పాటుపడ్డారు . హిందూ జాతికోసం నిరంతరం యుద్దాలు చేశాడు . తెలుగు సాహిత్యం కోసం కృషి చేశాడు . అలాంటి మహా చంక్రవర్తి హిందూ జాతికి ప్రాతః కాల స్మరణీయుడు .
ఆయన మీద కులముద్రవేసి ఆ మహనీయ చక్రవర్తిని కొందరికీ పరిమితం చెయ్యడం సబబు కాదేమో !
Please Like Share and Subscribe Our Channel:
Shaili & Shaili TV.
/ @shailiandshaili / bhageeradha.g .
Instagram : bhageeradha.g
Twitter : @ bhageeradha_g
bhageeradhag.b....

Опубликовано:

 

16 июн 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
How to get Spongebob El Primo FOR FREE!
01:36
Просмотров 13 млн
لدي بط عالق في أذني😰🐤👂
00:17
Просмотров 3,1 млн
How to get Spongebob El Primo FOR FREE!
01:36
Просмотров 13 млн