Тёмный

Chapter 3 - భగవద్గీత - కర్మ యోగము - Karma Yoga - BhagavadGita Telugu Translation - GayatriVantillu 

Gayatri Vantillu (YouTube Top Chef 2014)
Подписаться 238 тыс.
Просмотров 2,7 тыс.
50% 1

కర్మ యోగము - భగవద్గీత
Gist by Swami Mukundananda @ www.holy-bhaga...
================================================
ఈ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు, అన్ని ప్రాణులూ తమ తమ ప్రకృతి సిద్ధమైన స్వాభావిక లక్షణంచే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయనీ, మరియు ఎవరూ కూడా ఒక క్షణం కూడా కర్మలు చేయకుండా ఉండలేరనీ, వివరిస్తున్నాడు. ఏవో కాషాయి వస్త్రాలు ధరించి బాహ్యంగా సన్యాసం ప్రదర్శిస్తూ, లోలోన ఇంద్రియ వస్తువుల పై చింతనచేసే వారు కపటులు. బాహ్యంగా కర్మలు ఆచరిస్తూనే ఉన్నా, లోనుండి మమకార రాహిత్యంతో ఉండే, కర్మ యోగము ఆచరించే వారు, వారికన్నా ఉన్నతమైన వారు. భగవంతుని సృష్టి వ్యవస్థలో ప్రతి ప్రాణికి తన వంతుగా నిర్వర్తించే భాద్యతలు ఉంటాయని శ్రీ కృష్ణుడు వక్కాణిస్తున్నాడు. మనము చేయవలసిన ధర్మాన్ని భగవంతుడు ఇచ్చిన కర్తవ్యం గా చేసినప్పుడు ఆ పని 'యజ్ఞం' అవుతుంది. యజ్ఞం చేయటం సహజంగానే దేవతలకు ప్రీతి కలిగిస్తుంది, దాంతో వారు భౌతిక అభ్యుదయం ప్రసాదిస్తారు. అలాంటి యజ్ఞం వానలు కురిపిస్తుంది, వానలతో జీవనోపాధి కోసం అవసరమైన ధాన్యం వస్తుంది. ఈ చక్రంలో తమ భాద్యత ని స్వీకరించటానికి నిరాకరించిన వారు పాపిష్టులు; వారు తమ ఇంద్రియ లౌల్యం కోసమే జీవించేవారు మరియు వారి జీవితాలు వ్యర్ధమైనవి.
ఆత్మ యందే స్థితులై ఉండే జ్ఞానోదయమైనవారు, సామాన్య జనులలా కాకుండా, తమ శారీరిక భాధ్యతలను నిర్వర్తించే అవసరం లేదు, ఎందుకంటే వారు ఉన్నతమైన ఆత్మ స్థాయి విధులు నిర్వర్తిస్తారు. కానీ వారు తమ సామాజిక విధులను విస్మరిస్తే, అది వారి అడుగు జాడలలో నడిచే సామాన్య జనుల మనస్సులలో కలత కలిగిస్తుంది. కాబట్టి అందరూ అనుకరించటానికి, ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణ చూపటం కోసం జ్ఞానులు, ఎలాంటి స్వార్ధ ప్రయోజనం లేకుండా కర్మలు ఆచరిస్తూనే ఉండాలి. ఇది, పరిపక్వత లేకుండా అకాలంగా తమ విధులను త్యజించే వారిని నిరోధిస్తుంది. ఈ ప్రయోజనం కోసమే జ్ఞానోదయమైన జనక మహారాజు వంటి రాజులు, తమ విధులను నిర్వర్తించారు.
తమకు ఇష్టం లేకపోయినా, ఏదో బలవంతమైన ప్రభావం చేతనా అన్నట్టు, జనులు ఎందుకు పాపపు కర్మలను చేస్తారు అని తదుపరి అర్జునుడు ప్రశ్నిస్తాడు. ప్రపంచంలో అన్నిటినీ నాశనం చేసే పాపిష్టి శత్రువు కామమే అని, ఆ పరమాత్మ వివరిస్తాడు. నిప్పు పొగచే, అద్దం దుమ్ముచే కప్పి వేయబడ్డట్టుగా, కోరికలు జ్ఞానాన్ని కప్పివేసి, బుద్ధిని దూరంగా లాగేస్తాయి. తదుపరి, శ్రీ కృష్ణుడు, పాప స్వరూపమైన, కోరికలు అనే శత్రువుని సంహరించమని మరియు తన ఇంద్రియములు, మనస్సు, బుద్ధిని నియంత్రణ లోకి తెమ్మని, అర్జునుడికి శంఖారావ పిలుపునిస్తున్నాడు
=====================================================
Shree Krishna expounds on karm yog or the yog of action in this chapter. He explains to Arjun that nobody can remain without action, even for a moment. Bound by their inherent modes of nature, all beings are always engaged in some work. Superior are those who practice karm yog and continue to work diligently to fulfill their responsibilities externally, but internally they are unattached to them. However, the hypocrites display external renunciation but internally dwell upon the objects of their senses.
Shree Krishna says that all living beings are an integral part of God’s creation and have roles and responsibilities to fulfill. Vedas prescribe performing yajña to please the celestial gods, who in-return bestow material gains. These yajñas cause rains to fall, which aids in the production of food grains for the sustenance of life on earth. Those who live only for the delight of their senses and do not accept their responsibility in this cycle- are sinful and living in vain. However, Shree Krishna says that when works or prescribed duties are performed as an obligation to God, they are also considered yajña (sacrifice).
He then explains that unlike the rest of humankind, the enlightened souls are not obliged to fulfill their bodily responsibilities. They are situated in knowledge of the self and execute higher responsibilities of the soul. However, they do not abandon their social duties, as it may create disharmony in the minds of the common people who look up to them for inspiration. Therefore, the wise continue to work without any personal motive only to set good examples for others to follow, else, the ignorant may abandon their prescribed duties prematurely. Shree Krishna mentions one such example of the enlightened King Janak, who performed his earthly duties as an ideal king and father.
Arjun then asks Shree Krishna why people commit sin, even when unwilling, as if by some force. Lord Krishna explains that lust alone is the sinful all-devouring enemy. Similar to a fire that is covered by smoke or a mirror covered in dust, desire shrouds one’s knowledge and deludes the intellect. In the end, Shree Krishna advises Arjun that by controlling the senses, mind, and intellect-one can slay this enemy called desire, which is an embodiment of sin.

Опубликовано:

 

8 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4   
@sarojinidevichandupatla7659
@sarojinidevichandupatla7659 2 года назад
Jai shri krishna
@radha4315
@radha4315 2 года назад
Andariki ardham ayyelaga chala baaga meaning chepparu andi. Thank you 😊
@GayatriVantillu
@GayatriVantillu Год назад
Thanks andi
@sarojinidevichandupatla7659
@sarojinidevichandupatla7659 2 года назад
We wants cooking videos from you Gayathri gaaru
Далее
ПЛАН ПРОТИВОДЕЙСТВИЯ МЕДВЕДЮ.
00:28
Karma Yogam Part 1 - Swamy Vivekananda
23:16
Просмотров 1,5 тыс.