Тёмный

Dairy Cows Maintenance - Profitable Methods || Alla Appala Naidu || Contact - 9550064322 

Raitu Nestham
Подписаться 1,3 млн
Просмотров 531 тыс.
50% 1

గంగిగోవుపాలు గరిటెడైనను చాలు.... కడివెడైననేమి ఖరముపాలు అంటూ ఏనాడో ఆవుపాల శ్రేష్ఠతను పద్యరూపంలో వేమన వర్ణించాడు. నేటికీ అది అక్షర సత్యం. అదే స్ఫూర్తితో ఆవుపాల డెయిరీ నిర్వహిస్తూ విజయానికి చిరునామాగా మారారు ఆళ్ల అప్పలనాయుడు. విశాఖపట్నంజిల్లా కసిమ్‌కోట గ్రామానికి చెందిన ఈ యువరైతు పాడిపరిశ్రమపై ఆసక్తితో సొంతూరులోనే డెయిరీ ఫాం ఏర్పాటుచేసుకున్నారు. పదేళ్లక్రితం రెండు ఆవులతో పాల వ్యాపారాన్ని ప్రారంభించిన అప్పలనాయుడు ఇప్పుడు 30కిపైగా ఆవులతో లాభాలబాటలో పయనిస్తున్నారు. అంతేకాదు విశాఖజిల్లా అభ్యుదయ పాడిరైతుల సంఘం అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తూ తోటి పాడిరైతులు సైతం లాభాలుపొందేలా ప్రోత్సహిస్తున్నారు. డెయిరీ నిర్వహణలో మేలుజాతి పశువుల ఎంపిక, పరిశుభ్రత, పశుగ్రాసం అత్యంత కీలకమని అప్పలనాయుడు చెబుతున్నారు. పాడి ఆవులకు పశుగ్రాసంతోపాటు అధిక పోషకవిలువలతోకూడిన దాణాకూడా ఇవ్వాలని వివరిస్తున్నారు. మార్కెట్లో దొరికే దాణాలకుబదులు సొంతంగా తయారుచేసుకుంటే ఖర్చు తగ్గుతుందని అంటున్నారు. చూలి పశువులకిచ్చే దాణా విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. డెయిరీ నిర్వహణలో సాంకేతిక అంశాలూ ఎంతో ముఖ్యమని అప్పలనాయుడు చెబుతున్నారు. గడ్డికోసే యంత్రం, గడ్డికత్తిరించే యంత్రం, పాలుపితికే యంత్రాలను వినియోగిస్తే సమయం, డబ్బు ఆదా అవుతుందని పేర్కొంటున్నారు. ప్రతి ఆవు ఆరోగ్యపరిస్థితి, యదకొచ్చే సమయం, ఇచ్చేపాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రికార్డులో నమోదుచేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. పాడిరైతులు పూర్తి సమయం డెయిరీ నిర్వాహణకు కేటాయిస్తే తప్పకుండా లాభాలు వస్తాయని చెబుతున్నారు.
------------------------------------------------------------------------------------------------------
Farmer Alla Appala Naidu who belongs to kasimkota village, Vishakhapatnam District of Andhra pradesh runnig Dairy farm. Since 10 years he is into this dairy farming. He started with two cows and now he maintains more than 30 cows in his farm. He also President of 'Abhyudaya padi rythula sangham' Vishakhapatnam District. 'Maintaining cleanliness, giving quality grass to cows is most important in dairy farming. Effective use of technology and machinery is also plays key role in cutting the investment. With dedication, hard-work, commitment any one can achieve success in dairy farming.' says Appala Naidu. He Explains Dairy Cows Maintenance - Profitable Methods.

Опубликовано:

 

17 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 368   
Далее
How to use Milking Machine
4:43
Просмотров 54 тыс.