చిత్రం: Doctor చక్రవర్తి (1964) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు రచన: ఆత్రేయ గాయని: సుశీల నీవు లేక వీణా పలుకలేనన్నది నీవు రాక రాధా నిలువలేనన్నది జాజిపూలు నీకై రోజు రోజు పూచె చూసి చూసి పాపం సొమ్మసిల్లిపోయె చందమామ నీకై తొంగి తొంగి చూసి సరసను లేవని అలుకలుబోయె కలలనైన నిన్ను కనుల చూతమన్నా నిదుర రాని నాకు కలలు కూడ రావె కదలలేని కాలం విరహ గీతి రీతి పరువము వృధగా బరువుగ సాగె తలుపులన్ని నీకై తెరచి వుంచినాను తలపులెన్నొ మదిలో దాచి వేచినాను తాపమింక నేను ఓపలెను స్వామి తరుణిని కరుణను ఏలగ రావా? కలలనైన నిన్ను కనుల చూతమన్న నిదుర రాని నాకు కలలు గూడ రావే కరుణ లేని కాలం కసరి కాటు వేసే బ్రతుకే రగిలి చితియై పోయే ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-c7B2iCvaD0I.html
Thanks a lot SAREGAMA you are great in uploading such a beautiful.songs. This was my favourite cinema in those days always stays in heart. Also my appreciation to sri ghantasala garu suseelamma Garu and great Rajeswara rao garu. For best music.