Тёмный

Funny Telugu Post "Address Telling" written by Actor Guru and read by his mother Brunda Murthy 

Подписаться
Просмотров 774
% 54

This is funny telugu post written by actor Gurucharan kodur which was read out loud by his mother BrundaMurthy.
the post's name is "Address Telling".. now enjoy the audio 🤣😂🤣😂 ..
If you want the reading experience of the same post .. here it is ..👇👇👇👇👇
ప్రపంచం లో పెళ్లి చేసుకొని happy గా ఉండటం తరువాత అంత కష్టమైన పని "అడ్రస్ చెప్పటం / చెప్పించుకోవటం "
"అక్కడకొచ్చి అడ్వకేట్ రవికాంత్ గారి ఇల్లు ఎక్కడా అని అడిగితే యెవ్వఁవరైనా చెబుతారు " అన్నాడు
మరుసటి రోజు ఆయన ఫోన్ చేసి ".. గంట క్రితమే బయల్దేరానన్నారు .. ఇంకా రాలేదే ? " అన్నాడు , అప్పటికి బాగా రగులుతున్నా
"సార్, "అక్కడకొచ్చి" అడిగితే ఎవరైనా చెబుతారు అన్నారు , first of all ఇక్కడెవ్వడూ లేడు ,అతి కష్టం మీద ఇద్దరిని అడిగితే రవికాంత్ ఎవరో తెలీదు పొమ్మాన్నారు ,ఒకడైతే అడ్వకేట్ రవా ? అని అసహ్యంగా చూసి పోయాడు ..ఎండ(నాకూ) మండిపోతోంది , మీరేమో ఫోన్ switch off చేశారు ..చిరాగ్గా ఉంది సార్ ,ఇంటికి వెళ్ళిపోనా ? " అన్నాను కోపం అర్థం అయ్యేలాగా ..
"హి హి హి ...ఈ మధ్య ఇక్కడుండట్లేదు కదండీ మరిచిపోయి ఉంటారు జనాలు ..ఇక cell అంటారా ? రాత్రి నుంచి 1% చూపిస్తోంది maximum ఎంత వరకు వస్తుందో చూద్దామని charging పెట్టకుండా వదిలేసా switch off అయినట్టుంది చూసుకోలా ..హి హి హి ...late అయివుంటే మీరు వెళ్లిపోవచ్చు" అని పెట్టేసాడు.
నాకు BP 180/180 కి రీచ్ అయింది . ఎంత కష్టమైన సరే ఆయనిల్లు వెతుక్కుంటూ వెళ్లి ఆయన మీద "దారి హింస" కేస్ పెట్టి ,ఆయన ద్వారా ఆయనకే నోటీసులు పంపుదాం అనుకున్నాను. అప్పుడు, అప్పుడు "అక్కడికొచ్చి" ఎవ్వరిని అడిగినా చెబుతారు ఈన గురించి . .
ఇందాకే ఒక ఒకతనితో ఫోన్లో మాట్లాడా, ఈసారి నేను అడ్రస్ చెప్పే వైపున్నా ..
"... సార్ ఎక్కడిదాకా ఒచ్చారు సార్ "
"ఇక్కడికి ఒచ్చేసా already "
"ఎక్కడికీ ?"
"అంటే ...అది ...ఆఁ !! ..ఇక్కడ ఒక పెద్ద చెట్టుంది సార్ "
"పెద్ద చెట్టా ?? ..సార్ చెట్టూ, ఆకులూ, పిందెలు లాంటివి కాకుండా ఏదైనా ల్యాండ్ మార్క్ చెప్పండి సార్ "
"అలా అంటారా ..హ్మ్మ్... ఆఁ సార్ ఇక్కడా సందు మొదట్లో ..రెండు చిన్న కుక్క పిల్లలు ఆడుకుంటున్నాయి సార్ .."
"కుక్క పిల్లలు ఆడుకుంటున్నాయా ?? మీరు కూడా ఆడకపోయారా ? వాటికి కూడా change గా ఉంటుందీ .."
"అలాక్కాదూ ..."
"లేకపోతే ఏంటి సార్ ? కుక్కలాడుకుంటున్నాయి , కాకులు బాధపడుతున్నాయ్ ఇలాంటి చెబుతారా ఎవరైనా ?? అసలు మీరు ఎక్కడిదాకా వచ్చారూ "
"వసంత్ నగర్ దాకా వచ్చా సార్ "
"ok . మీరు left తీసుకొని కొంపల్లి వైపు రాండి ...వస్తుంటే మద్య లో మీకూ ..."
"ఓహ్ ..కోoపల్లా ...అలా చెప్పండి ..పది నిముషాల్లో అక్కడుంటాను "
"అంత దూరం అవసరంలేదు ..మధ్యలోనే ..హలో హలో ?? ...... " పెట్టేసాడు ..
వెళ్ళిపోయాడు కొంపల్లి వెళ్ళిపోయాడు ,మళ్లీ ఏదో ఒక time కి ఫోన్ చేసి "సార్ ఇక్కడ street pole ఉందీ, man hole ఉందీ " అంటాడు
అరె అలా తెలుసూ అని వెళ్ళిపోతే ఎలా ? .. ఇంకా నయం నేను విజయవాడ వైపు రండి అనలేదు.
ఇంకోసారి నేను spot reach అయ్యి call చేసా ..ఆయన లిఫ్ట్ చేసి
"ఏంటి dead end కి వచ్చేసారా ?? ..హా ..అదిగో అదిగో ..మీరు నాకు కనపడుతున్నారు ... ఇటూ , ఇటు చుడండి ...అరెరే ..అటు కాదు ఇటూ ..అబ్బా ..ఇటు సార్ ..భగవంతుడా !!..ఇటు సామీ ..మీరు రౌండ్ గా తిరిగారు కానీ ఇటు మాత్రం చూడలేదు ..ఇటు చుడండీ .. " అంటున్నాడు
నేను మెదడువాపు వ్యాధి వచ్చి మతి స్థిమితం తప్పిన వాడిలాగ చుట్టూరా పిచ్చి చూపులు చూస్తున్నా ...అలా ఎటో చెప్పకుండా ఇటు ఇటు ఇటు అంటే నాకు బీపీ 180/360 కి వెళ్ళిపోతుంది ఈనని గనక విమానాలకు దారి చెప్పమంటే ,ఇటు ఇటు ఇటూ అనుకుంటూ Amsterdam లో దిగాల్సిన విమానాన్ని పెనకచర్ల dam లో దింపేస్తాడు, అని అనుకుంటూ ఉండగా నవ్వుతూ కనిపించాడు ..నేను కోపాన్ని ఆపుకుంటూ "బాగున్నారా? " అని తిట్టీ , shake hand ఇచ్చాను
ఒక uncle పిలుపులకి మా ఇంటికి వచ్చారు , వెళ్ళబోతూ "దేనా bank పక్కనే అండీ మా ఇల్లు ,కొబ్బరి చెట్లు కూడా ఉంటాయి ,తప్పకుండా రావాలి " అని అన్నారు
మేము వెళ్తూ ఉన్నాం, ఆల్రెడీ late అయింది , ఎవరో local అతను కనపడితే అడిగాం .."ఇక్కడ దేనా bank ఎక్కడండీ " అని
"దేనా bank ఆ?? ..ఆ కొబ్బరి చెట్లు ఉండే ఇల్లు తెలుసు కదా? మన station master ఇల్లూ ..దాని పక్కనే దేనా bank !! ..easyలే పోండి " అని వెళ్ళిపోయాడు
".. ఆ ఇల్లే తెలిస్తే మేము దేనా bank ఎందుకు దేవులాడతాం సామి" అనుకున్నా
ఆ అడ్వకేట్ ఏమో లేని పాపులారిటీని పులుముకొని ఇబ్బంది పెట్టాడు ,ఈ స్టేషన్ మాస్టర్ గారేమో ఉన్న పాపులార్టీని వాడకుండా ఇబ్బంది పెట్టారు .. అదేదో సామెత చెప్పినట్టుంది నా పరిస్థితి..
ఇంకొకసారి చాలా రోజుల తరువాత ఒక పాత ఫ్రెండ్ ని కలవటానికి కార్ లో వెళ్తున్నా ...సగం దారికి వెళ్ళాక కాల్ చేశా ...
"ఎక్కడున్నావ్ " అన్నాడు
"మెట్రో దాటాను "అన్నాను
"ఇంకా అక్కడే ఉన్నావా ..సరే more దాటాక call చెయ్యి, నేను బట్టలేసుకుని కిందికి వస్తాను " అని పెట్టేసాడు
అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, నాకు అడ్రస్ కనుక్కునే శ్రేమలేకుండా వాడే కిందికి వస్తున్నందుకు మురిసిపోవాలా ? , బట్టలేసుకుని మరీ వస్తున్నందుకు ఆనందపడాలా ? , వాడు ఇప్పుడు ఇంట్లో ఎలా ఉండి ఉంటాడో ఉహించుకొని జడుసుకోవాలా ?? అడ్రస్ తెలీనిపాపానికి ఇన్ని భావోద్వేగాలు నాకవసరమా ?? నా ద్వారా మీకవసరమా ?.. " .. ad'dress' లేకుండా పోతావురరేయ్ !! " అనే తిట్టు వీడికి కరెక్ట్ అనిపించింది.
**** description is too long అని వచ్చింది మరి !!
మిగతా పోస్టు ఇక్కడ చదవండి 👇👇👇👇
2742195492463783/posts/2794919287191403/
and you can follow me here 👇👇👇
ActorGuruOfficial/

Кино

Опубликовано:

 

19 июл 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 28   
@chethanakotla2380
@chethanakotla2380 4 года назад
సూపర్ చరణ్ జీ నవ్వుల విందు వడ్డించారు మీరు ఇంకా మీ అమ్మగారు... థాంక్సండీ, కడుపారా నవ్వుకున్నాం.
@yoursGuruofficial
@yoursGuruofficial 4 года назад
thanq so much andi . subscribe for more.
@sreemanivalluri
@sreemanivalluri 4 года назад
అక్కా...బృందాక్కా.. సూపర్.. ఫోన్ లో మనం మాటాడుకుంటామే....అచ్చం అట్టానే ఫోన్ లో మాతో చెపుతున్నట్టుగానే ఉంది.. తెగ నవ్వేసుకున్నా.. సూపర్ అడ్రస్ టెల్లింగ్.. గురు... 👌👌👏👏👏
@gopichandputtagunta8072
@gopichandputtagunta8072 4 года назад
రోజూ వినాలి అనిపించేలా ఉంది ..కధ... ఇట్లు మకరంద్ S/o.. గోపిచంద్. 🏵️🌱🥀🌹🌷💐🎶
@SureshKumar-ue4kh
@SureshKumar-ue4kh 4 года назад
చాలా బాగుంది . నిజంగా అడ్రస్ వెతకడం అంత సులభం కాదు. చాలా బాగా రాసావు చరణ్ అమ్మ అంతకంటే బాగా చదివింది జోవియల్గా
@yoursGuruofficial
@yoursGuruofficial 4 года назад
you are super sir .. u will be among top 3 followers of my work !!👌👌💐💐
@janakipaturi646
@janakipaturi646 4 года назад
సూపర్ గా చదివారు బృంద నేను నవ్వేసుకున్నా తెగ. రచన బావుంటేనే కదా చదవడం సంగతి చెప్పాలి... చరణ్ రచన సూపర్
@yoursGuruofficial
@yoursGuruofficial 4 года назад
thanq so much జానకి గారు 🙏🙏
@lathareddy6695
@lathareddy6695 4 года назад
మస్తు ఫన్ వుంది...సూపర్..ప్రతి ఒక్కరూ ఇది ఎప్పుడో ఒకసారి ఎక్స్పీరియ న్స్ అయ్యే వింటం కదా
@svmaheshbabu1307
@svmaheshbabu1307 4 года назад
🤣😂😆😄Amsterdam.... Penakacherla dam Joke suuuuuuperrrrrrr..... Niceee hilarious script by Guru Bhayya బృందక్కా..... 👏👏👏👏👌👌👌👌👌👍👍 సూపర్ ఫన్నీ ఆడియో ❤️❤️❤️❤️❤️😆😆😆😆😆😂😂😂😂😂😂👏👏👏👏👏👌👌👌👌👌
@yoursGuruofficial
@yoursGuruofficial 4 года назад
thanq so much !!
@gopichandputtagunta8072
@gopichandputtagunta8072 4 года назад
బృందా పిన్నీ నవ్వు సూపర్.🤗
@yoursGuruofficial
@yoursGuruofficial 4 года назад
am very glad that mom is being appreciated .. she is very happy
@leitheshadityagnk2447
@leitheshadityagnk2447 3 года назад
Undoubtedly your story tickled us , you play so well with words it amazes us icing on the cake is the way amma read the story She took it to the peaks Great combo like Kamal and Balachander :)
@yoursGuruofficial
@yoursGuruofficial 3 года назад
heey , aditya .. thanks alot .. ur feedback is spl. but very late entry .. next time intha late chesthe fine veyabadunu. thanks alot mate.🤗
@ssss1570
@ssss1570 4 года назад
Beautiful.... Sir
@sundarsurya6335
@sundarsurya6335 10 дней назад
Full Josh ❤
@sravanikodur1691
@sravanikodur1691 4 года назад
Hilarious.. both of u enjoyed it.. 🤩 u have great talent bro
@padmalathabendhi1953
@padmalathabendhi1953 4 года назад
సూపర్...గురూ.. బృంద..👌👌
@nalinikishan
@nalinikishan 4 года назад
Lovely...
@valayyapantulukakarlamudi6419
@valayyapantulukakarlamudi6419 4 года назад
Nice very funny story
@yoursGuruofficial
@yoursGuruofficial 4 года назад
thanq so much sir .. plz subscribe for more updates !!
@sreelathapendyala4622
@sreelathapendyala4622 4 года назад
Wow nice 😆
@yoursGuruofficial
@yoursGuruofficial 4 года назад
thanq so much andi
@Godaarallapalli12
@Godaarallapalli12 4 года назад
ఆంస్టార్దాం లో దింపాల్సిన విమానాన్ని పెనకచెర్ల డాం లో దింపుతావా?? ఒక సారి మీ అడ్రస్ చెప్పు సరాసరి వచ్చేస్తా
@yoursGuruofficial
@yoursGuruofficial 4 года назад
నేను కాదన్న .. అతనెవరో .. 🤣😂
@rangannathkochervu4121
@rangannathkochervu4121 4 года назад
Charan gaaru, maa Intiki Randi sir, Ramnagar vachi Teja coaching center ekkada ani adagandi. Tharvatha Naaku phone cheyyandi. Nenu tharvaatha ela raavaalo cheptha. OK thank you.
@yoursGuruofficial
@yoursGuruofficial 4 года назад
మీరైన కాస్త అర్థం అయ్యేలా చెప్పండి సర్ , నా వల్ల కావట్లేదు !! 🙏😂