Тёмный

Golkonda fort full tour 👌🥰/meeru vellara friends 

Shopping with Akka
Подписаться 18 тыс.
Просмотров 53
50% 1

Music credits goes to:- RU-vid Audio library
గోల్కొండకోట, ఒక పురాతన నగరం. హైదరాబాదుకు 10 కి.మీ. దూరములో ఉంది. గోల్కొండ నగరం, కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి కొండమీద కట్టారు. కోట రక్షణార్థం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. సా. శ. 1083 నుండి సా. శ. 1323 వరకు కాకతీయులు గోల్కొండను పాలించారు. సా. శ 1336 లో ముసునూరి కమ్మ నాయకులు మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. సా. శ. 1364 లో కమ్మ మహారాజు ముసునూరి కాపయ నాయకుడు గోల్కొండను సంధిలో భాగముగా బహమనీ సుల్తాను మహమ్మదు షా వశము చేశాడు. ఇది బహుమనీ సామ్రాజ్యములో రాజధానిగా (1365-1512) ఉంది. కానీ సా.శ. సా. శ 1512 తరువాత ముస్లిము సుల్తానుల రాజ్యములో రాజధాని అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, 2014 ఆగస్టు 15న గోల్కొండ కోటపై తొలిసారిగా భారత స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాడు.
History:-"మంగలవరమ్" నుండి"గొల్ల కొండ" నుండి గోల్కొండ కోటగా రూపాంతరం చెందిన ఈ ప్రాకారం వెనుక ఒక ఆసక్తికరమయిన కథనం ఉంది. అదేమిటంటే 1143లో మానుగల్లు!'' అనే రాళ్ళ గుట్ట పైన ఒక గొడ్లకాపరికి ఒక దేవతా విగ్రహము కనిపించింది. ఈ వార్త అప్పటి ఆ ప్రాంతమును పాలించే కాకతీయులకు చేరవేయ బడింది. వెంటనే ఆ పవిత్ర స్థలములో రాజుగారు ఒక మట్టి కట్టడమును నిర్మించారు. కాకతీయులకు, ముసునూరి కమ్మరాజులకు గోల్కొండ ఓరుగంటి సామ్రాజ్యములో ముఖ్యమైన కోట. గోల్కొండ కోట తొలుతగా 1323లో ఘియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఉలుఘ్ ఖాన్ వశమయ్యింది. పిదప ముసునూరి కమ్మరాజుల విప్లవముతో ఓరుగల్లుతో బాటు గోల్కొండ కూడా విముక్తము చేయబడింది. 1347లో గుల్బర్గా రాజధానిగా వెలసిన బహమనీ రాజ్యమునకు ముసునూరి కమ్మరాజులకి పెక్కు సంఘర్షణలు జరిగాయి 21. మహమ్మద్ షా కాలములో ముసునూరి కాపయ నాయకుడు కౌలాస్ కోటను తిరిగి సాధించుటకు తన కొడుకు వినాయక దేవ్ ని పంపాడు. కాని వినాయక దేవ్ ఈ ప్రయత్నములో విఫలుడయ్యాడు. 1361లో పారశీక అశ్వముల కొనుగోలు విషయములో వచ్చిన తగాదా ఫలితముగా మహమ్మద్ షా బేలం పట్టణంపై దాడి చేసి వినాయక దేవ్ ని బంధించి ఆతనిని ఘాతుకముగా వధించాడు 33. గుల్బర్గాకు తిరిగిపోవు దారిలో మహమ్మద్ షా సైనికులను ఓరుగంటి వీరులు మట్టుబెట్టారు. సుల్తాను కూడా తీవ్రముగా గాయపడ్డాడు. ప్రతీకారముతో రగిలిన సుల్తాను పెద్ద సైన్యమును కూడగట్టి కాపయ నాయకుడుపై యుద్ధమునకు తలపడ్డాడు. ఓరుగంటికి విజయనగర సహాయము అందలేదు. కాపయ నాయకుడు ఢిల్లీ సుల్తాను సహాయము కోరాడు. తోటి మహమ్మదీయునిపై యుద్ధము చేయుటకు ఢిల్లీ సుల్తాను నిరాకరించాడు. బలహీనపడిన కాపయ నాయకుడు మహమ్మద్ షాతో సంధిచేసుకున్నాడు. 300ఏనుగులు, 200 గుర్రాలు, 33 లక్షల రూప్యములతో బాటు గోల్కొండ శాశ్వతముగా వదులుకున్నాడు. గోల్కొండ కోటకు అజీమ్ హుమయూన్ అధిపతిగా చేసి షా గుల్బర్గాకు మరలాడు. ఈ విధముగా 1364లో గోల్కొండ కోట హిందువులనుండి చేజారి పోయింది. తరువాత నవాబులు పాలించారు.
1507 నుండి మొదలుకొని ఒక 62 సంవత్సరముల కాలములో గోల్కొండ కోటను కుతుబ్ షాహీ వంశస్థులు నల్లరాతి కోటగా తయారు చేశారు. కోట బురుజులతో సహా ఇది 5 కి.మీ. చుట్టుకొలత కలిగి ఉంది. గోల్కొండలో కుతుబ్ షాహీ వంశస్తుల పాలన 1687లో ఔరంగజేబు విజయముతో అంతమయినది. ఆసమయములో ఔరంగజేబు కోటను నాశనంచేశాడు. గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ఖ్యాతి సంపాదించింది. ప్రపంచప్రసిద్దమైన కోహినూరు వజ్రము, పిట్ వజ్రము, హోప్ వజ్రము, ఓర్లాఫ్ వజ్రము ఈ రాజ్యములోని పరిటాల-కొల్లూరు గనుల నుండి వచ్చాయి. గోల్కొండ గనుల నుండి వచ్చిన ధనము, వజ్రాలు నిజాము చక్రవర్తులను సుసంపన్నం చేశాయి. నిజాములు మొగలు చక్రవర్తులనుండి స్వాతంత్ర్యము పొందిన తరువాత హైదరాబాదును 1724 నుండి 1948లో భారత్లో విలీనమయ్యేంతవరకు పరిపాలించారు. నిజాం నవాబుల పరిపాలన కాలంలో 1830 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య అప్పటి గోల్కొండ స్థితిగతుల గురించి వ్రాసుకున్నారు. వాటి ప్రకారం 1830 నాటికి గోల్కొండలో నిజాం అంత:పుర స్త్రీలు, నైజాం మూలధనం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండేవారు. కోటలో విస్తరించి ప్రజలు ఇళ్ళు కట్టుకుని జీవించేవారు. 141 ఐతే రాజధాని తరలిపోయివుండడంతో అక్కడ రాజ్యతంత్రానికి సంబంధించిన, వర్తకవాణిజ్యాలకు సంబంధించిన వ్యవహారాలు జరిగేవి కాదు.
గోల్కొండ నాలుగు వేర్వేరు కోటల సముదాయం, ఒకదానిని చుట్టి మరొకటి నిర్మించబడ్డాయి. కోటను పెంచుటలో, పటిష్ఠపరుచటలో కుతుబ్‌షాహిలదే ప్రధాన పాత్ర. మొదటి నిజాం వశమైన కాలంలో కోట వెలుపలి భాగాన తూర్పు దిక్కున ఒక గుట్ట ఉండేది. దానిని శత్రువు ఆక్రమిస్తే తరలించుట కష్టమని భావించిన నిజాం గుట్టను కోటలోపలికి కలుపుతూ చుట్టూ గోడను నిర్మించాడు. దుర్గం చుట్టూ గుట్టలు పెట్టని కోటలవలె ఉన్నాయి. ఈ కోట 87 అర్ధ చంద్రాకారపు బురుజులతోకూడిన 10 కి.మీ. పొడవు గోడను కలిగి ఉంది; కొన్ని బురుజులలో ఇంకా ఫిరంగులను నిలిపిఉంచారు. ఇంకా 8 సింహద్వారములు, 4 ఎత్తగలిగే వంతెనలు (draw bridge), బోలెడన్ని రాచమందిరాలు, మసీదులు, గుళ్ళు, అశ్వశాలలు మొదలగునవి చాలా ఉండేవి. సింహద్వారములలో అన్నిటికంటే కిందది, అన్నిటికంటే బయట ఉండే ఫతే దర్వాజా (విజయ ద్వారము) నుండే మనము గోల్కొండ కోటను చూడటానికి వెళ్తాము. ఔరంగజేబు విజయము తరువాత ఈ ద్వారము గుండానే తన సైన్యమును నడిపించాడు. ఏనుగుల రాకను ఆడ్డుకోవటానికి ఆగ్నేయము వైపున పెద్ద పెద్ద ఇనుప సువ్వలు ఏర్పాటు చేసారు. ఫతే దర్వాజా నిర్మించటానికి ధ్వనిశాస్త్రమును ఔపోసన పట్టినట్లున్నారు. గుమ్మటం కింద ఒక నిర్ణీత ప్రదేశమునందు చప్పట్లు కొడితే కిలోమీటరు ఆవల గోల్కొండలో అతి ఎత్తయిన ప్రదేశములో ఉన్న "బాలా హిస్సారు" వద్ద చాలా స్పస్టముగా వినిపిస్తుంది. ఈ విశేషమును ఒకప్పుడు ఇక్కడి నిర్వాసితులు ప్రమాదసంకేతములు తెలుపుటకు ఉపయోగించేవారు. ఇప్పుడు మాత్రం సందర్శకులకు వినోదం పంచేదిగా మిగిలిపోయింది.

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6   
@malathiramana6281
@malathiramana6281 26 дней назад
Simply super vlog...
@VizagAmmaYiVlogs
@VizagAmmaYiVlogs 26 дней назад
Thank you so much dear 🥰🥰🥰
@Kaveri913
@Kaveri913 27 дней назад
Super aka
@VizagAmmaYiVlogs
@VizagAmmaYiVlogs 27 дней назад
Thank you dear 🥰🥰
@Kaveri913
@Kaveri913 27 дней назад
Hi akka..
@VizagAmmaYiVlogs
@VizagAmmaYiVlogs 27 дней назад
Hi
Далее
Medical tourism in india
23:00
Просмотров 528 тыс.
Пришёл к другу на ночёвку 😂
01:00
To mahh too🫰🍅 #abirzkitchen #tomato
01:00
Просмотров 1,5 млн
Пришёл к другу на ночёвку 😂
01:00