ఓ అద్భుత అపురూప దృశ్య కావ్యం ! మాటలకే అందని ఓ విరహ తాపం అసంకల్పిత భావమై, భవ్యమై, రమ్యమై , నిజ జీవితపు సజీవ సాక్ష్యమై గుండెను గొంతుకలో తెచ్చి శబ్దాన్ని నిశ్శబ్దం గా మార్చిన అనితర సాధ్యమా ? అన్నట్టుగ సాగిన ఓ సామాజిక యదార్థ సంఘటనకి వాస్తవిక దృక్పథం దృశ్యంగా తనను తాను పరిచయం చేసుకున్న ఓ మాటలకందని భావుకత దృశ్యమైన వేళ! ఇక నటన లోని వసివాడని పసివాడి తో సహా అందరూ అందరే ! అందలం ఎక్కగ సమభూమికలో అర్హులు! ఇక ఈ విరహ గీతానికి తన దేహ తపనని అభినయ విషాద సౌందర్యాన్ని సంగీతంగా చేకూర్చిన ఆ అసలైన పాత్రధారి ముమ్మాటికి కళాప్రపూర్ణ సంపూర్ణ స్వరూప శాస్త్రమే! వారి అందరి నటనా కౌశల్యం " ఓ అనితర సాధ్యమే! వారు అందరూ మరెన్నో సహజ నటనాద్భుతాలను సాధించాలని కోరుకుందాం.... అల్ కమర్