Тёмный

Kannayye Puttadu (కన్నయ్యే పుట్టాడు) | Lyrical Song-105 | Sri Krishnashtami Spl | Krishna Devotional 

Gnanavaahini channel
Подписаться 21 тыс.
Просмотров 81 тыс.
50% 1

శ్రీ కృష్ణ భగవానుని గొప్పతనమును ఎంతో మంది ఎన్నో విధములుగా పూర్వము నుండి వివరించుకున్నారు. "భాగవతము" అను పురాణమును చెప్పుకొనువారు, అందులోని శ్రీ కృష్ణలీలను అసామాన్యములుగా చెప్పుకొని మహదానంద పడుతుంటారు. కానీ వారికెవరికి తెలియని ఒక రహస్యమేమనగా శ్రీ కృష్ణుడు పురాణ పురుషుడు కాదు, సాక్షాత్తు చరిత్ర కల్గిన మహాభారతము అను ఇతిహాసములో ముఖ్య భాగమైన "భగవంతుడు" అని తెలియాలి.
భాగవతము అనగా "భగవత్ తత్త్వము" అని తెలియనివారు శ్రీ కృష్ణుని లీలలను అసామాన్యమైనవిగా, దేవుని సృష్టియైన ప్రకృతికి అతీతముగా చేసిన లీలలని భ్రమించుచున్నారు. కానీ భగవంతుడు భగవద్గీతలో ఏమన్నాడనగా శ్రేష్ఠులు ఏది ఆచరించునో దానినే ఇతరులు ఆచరిస్తారు అని చెప్పియున్న రీతిగా, భగవంతుడు అన్ని పనులను సాధారణ మనుషులవలెనే చేయును, కానీ ఆయన చేయు పద్దతి మాత్రము యోగాచారణకు ఉపయోగపడునదై, సర్వ జీవులకు జ్ఞానోపదేశమై ఉండును.
{కర్మయోగము శ్లో 21}
సాధారణ మనుషులు చేసే కార్యములు "కల" వంటివి కాగా, భగవంతుడు చేసి చూపు కార్యములు "లీల" అని అనవలెను. అందరూ కృష్ణ లీలలను "రాసలీలలు" అని భ్రమిస్తున్నారు. ఆ లీలల యొక్క అంతరార్ధము ఎరిగినయెడల అది "రాజలీల" అని తెలియును. రాజలీల అనగా పెద్ద ఆట అర్థము. భగవంతునియొక్క నిగూఢమైన జ్ఞాన విషయాలతో కూడినదే భగవంతుని లీల. కాబట్టి ఈ "కృష్ణలీల" అను పాటలో భాగముగా ఎన్నో అద్భుతమైన శ్రీకృష్ణుని పేరుమీద గల లీలలలోని అంతరార్థమును, ఆధ్యాత్మికతను, భగవత్ తత్వమును వివరించడము జరిగినది.
భగవంతుడిని సాక్షాత్తు దేవుడు అనుకోక, సామాన్య మనిషిగా భావించి, ఆయన చేసిన పనులను అజ్ఞాన పనులుగా తీసుకోవడము ఎంతతప్పో, అదేవిధముగా భగవంతుని లీలలోని ఆధ్యాత్మిక భావమును తెలియకుండానే కేవలము బాహ్య దృష్టితో ఆయన లీలలను పొగడుట కూడా అంతే తప్పు. కాబట్టి శ్రీకృష్ణలీలలలోని అంతర్ జ్ఞానమును తెలిసి వాటి ప్రకారము ఆయన గొప్పతనమును తెలిసి, భగవంతుడు ఆధ్యాత్మిక జ్ఞానములో ఏవిధముగా తన శిష్యులను ఆదరించగలడో, ఆ భావమును తన లీలలలో చూపిన విధానమును అందరూ గుర్తిస్తారని ఆశిస్తూ ఈ పాటను మీ ముందుకు ప్రవేశ పెడుతున్నాము.
సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణ మస్తు!!! కృష్ణం వందే జగద్గురుమ్!!!
TEAM:
-----
Lyricist - Siva Krishna Kogili
Singer - Nandhini & Group
Music - N R Chaitanya Kumar
Titles Animation - Saleem
Video Composition - Subbu
Production - Gnanavaahini Team
Presented By - Gnanavaahini Channel
సాకీ:
అరయ ఆదిలోని ఆకాశవాణిగా
తెరయు చాటుగానె జపర చాటి
ద్వాపరాన దప్పి దీర్చావు దూతగా
క్రిష్ణ గీత తీర్చె నాదు జ్ఞాన త్రుష్ణ !!!
లీలాకృష్ణా లీలాకృష్ణా అందరి కృష్ణ
రారాకృష్ణా రారాకృష్ణా సుందర కృష్ణ
అష్టమినాడే పుట్టాడంట అందరి కృష్ణ
సృష్టికెజ్ఞానం పంచాడంట సుందర కృష్ణ
పల్లవి:
కన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలే నిజంగా
కృష్ణయ్యే వచ్చాడు వరంగా తృష్ణంతా తీర్చే ఇరంగా
నీ రెప్పల చాటున చీకటి రాత్రిని తోలేస్తాడే
ఆ దుప్పటి కప్పే వెన్నెల రాత్రికి వచ్చేస్తాడే
నీ ఊహల మాటున జ్ఞానపు ఊయల ఊపేస్తాడే
ఆ మోహపు మాయను మాన్పగ వేణువునూదేస్తాడే
కన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలే నిజంగా
కృష్ణయ్యే వచ్చాడు వరంగా తృష్ణంతా తీర్చే ఇరంగా
అరె పింఛములోపల పంచకమోలే దాగున్నాడే
అదే కుంచము చేసి అంచులు నీలో చూపిస్తాడే
అరె అందముచందము అక్కరలేని ఆనందుడే
ఇలా గ్రంథమునిచ్చే గ్రంథిగా మారి గురువైనాడే
//లీలాకృష్ణా లీలాకృష్ణా అల్లరి కృష్ణ
రాధాకృష్ణా రాధాకృష్ణా నల్లని కృష్ణ
నందాపురం చేరాడంట అల్లరి కృష్ణ
బృందావనాన్నేలాడంట నల్లని కృష్ణ
చ1:
వేడుకలో కృష్ణ .. వేదనలో కృష్ణ
వేదము దాటేవేళా వేణువులోని రాగము కృష్ణ
భావములో కృష్ణ బాసటగా కృష్ణ
బంధములన్నీ తెంచే త్యాగమె కృష్ణా
మోదములో కృష్ణ... ఖేదములో కృష్ణ
సాధన చేసేవేళా స్థాణువులోని యోగము కృష్ణ
హృదయములో కృష్ణ పదిలముగా కృష్ణ
భగవద్గీతను చెప్పే భాగమె కృష్ణా
దేహంలోని ప్రతీకణం విభాజనం చేసే అగ్నికి ఆజ్యమె కృష్ణ
మోహందాటే ప్రతీరణం ప్రభంజనం చేసే వాణికి వ్యాజ్యమె కృష్ణ
లోకంలోని ప్రతీగుణం పరాజయం పొందే వేళల పూజ్యమె కృష్ణ
ఏకంఐతే అనుక్షణం శివాలయం చేర్చే దేవుని రాజ్యమే ఈ శ్రీ కృష్ణ
నీ బుద్ధికి అందని భావాలన్నీ అందిస్తాడే
తన శుద్ధిని నీలో ద్వంద్వాలపై సంధిస్తాడే
నీ చపల చిత్తమునంతము చేసే వలవేస్తాడే
ఆ ముప్పుల మాయను త్రైతముతోనే వదిలిస్తాడే
కన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలే నిజంగా
కృష్ణయ్యే వచ్చాడు వరంగా తృష్ణంతా తీర్చే ఇరంగా
లీలాకృష్ణా లీలాకృష్ణా మురళీ కృష్ణ
రారాకృష్ణా రారాకృష్ణా గురువై కృష్ణ
గీతాగానం మ్రోగించాడు మురళీ కృష్ణ
త్రైతజ్ఞానం బోధించాడు గురువై కృష్ణ
చ2:
దొన్నెలలో కృష్ణ ... వెన్నలనే కృష్ణ
దొంగల దోచీ అందే జ్ఞానము దాచే లీలా కృష్ణ
వెన్నులలో కృష్ణ ... మిన్నులనే కృష్ణ
దాటితే అందే దేవుని చిహ్నమే కృష్ణా
ద్వాపరలో కృష్ణ ... ఆ జపరై కృష్ణ
ద్వారకనంతా దాచే సముద్రుడే లీలా కృష్ణ
త్రైతములో కృష్ణ ... అంతిమమై కృష్ణ
అంతము చూపే దేవుని ముద్రయే కృష్ణా
పాముని పోలిన నీ వెనుపాముపై గుణముల త్రొక్కే నాట్యమే కృష్ణ
రధమును పోలిన నీ మనోరధమును రణముకు తోలే నాదమే కృష్ణ
ధరపై ధర్మము స్థాపన చేయగ దేహము దాల్చిన దైవమె కృష్ణ
క్షరఅక్షర పురుషోత్తమ గీతను గీచే గురుని త్రైతమే ఈ శ్రీ కృష్ణ
రొమ్ము పాలను బట్టి మాయల విషము పీల్చేస్తాడే
రోలు నడుముకు చుట్టి జన్మల శాపము గూల్చేస్తాడే
కొండ గొడుగుని ఎత్తి కర్మల పిడుగుని ఆపేస్తాడే
బండిని కాలితో తన్నీ మోక్షములోకే పంపేస్తాడే
కన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలే నిజంగా
కృష్ణయ్యే వచ్చాడు వరంగా తృష్ణంతా తీర్చే ఇరంగా
ఎదురన్నది లేని ఆచార్యుడై వచ్ఛేసాడే
నిదురన్నది మాని ప్రచారమే చేసేసాడే
కుదురన్నదిలేని కులలానే కూల్చేస్తాడే
అదురన్నదిలేని అలోకమే చేర్చేస్తాడే
కన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలే నిజంగా
కృష్ణయ్యే వచ్చాడు వరంగా తృష్ణంతా తీర్చే ఇరంగా
అరె పింఛములోపల పంచకమోలే దాగున్నాడే
అదే కుంచము చేసి అంచులు నీలో చూపిస్తాడే
అరె అందముచందము అక్కరలేని ఆనందుడే
ఇలా గ్రంథమునిచ్చే గ్రంథిగా మారి గురువైనాడే /౩

Опубликовано:

 

14 авг 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
МАЛОЙ ГАИШНИК
00:35
Просмотров 553 тыс.
Учёные из Тринидад и Тобаго
00:23
МАЛОЙ ГАИШНИК
00:35
Просмотров 553 тыс.