అమ్మ జైలుకు పోయింది కదా అనే అడుగుతారు సారు లేకపోతే అమ్మ స్వర్గానికి పోయింది తిరిగి భూలోకానికి దేవతగా వస్తాది అని అడుగుతారా సారు తల్లిదండ్రులు చేసింది పిల్లలు అనుభవించాల్సిందే తప్పదు కదా సారూ అన్నిట్లే కన్నా మంచి ఉపాయమైనదంటే చక్కగా సింపుల్ గా మోడీలాగా బ్రతకడం ఒక్కటే మంచి ఉపాయం
జైల్లో ఉన్నప్పుడు క్రిస్టియన్స్ వల్ల మీకు కలిగిన ఇబ్బంది అలా ఉంటే బయట సమాజంలో ఉన్న చర్చలు వల్ల ఎంత ఇబ్బంది ఉందో మామూలుగా గవర్నమెంట్ గాని మీలాంటి పెద్దలు గాని గుర్తించలేకపోయారా భారతీయులంతా మనవాళ్లే ఈ బయట దేశం నుంచి వచ్చిన బైబిల్ రొచ్చు భారతదేశంలో అవసరమంటారా
కోన్నాళ్ల కిందట ఓ తెలుగు సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్‌కు దేవుడు ప్రత్యక్షమయి ఏం కావాలో కోరుకోమంటారు. ఎదుటి వారు మనసులో ఏమనుకున్నా తనకు వినిపించేలా వరమివ్వండి అని కోరుకుంటాడు బ్రహ్మానందం.మొదట్లో ఒకరిద్దరు అనుకున్నవి తెలుసుకుని బాగానే ఉందనుకుంటా డు.. కానీ రాను రాను తన గురించి తన కుటుంబసభ్యులు, మిత్రులు సహా అందరూ మనసులో అనుకుంటున్న మాటలు విని మానసికంగా కుంగి పోతాడు., తనకీ వరం వద్దు మహాప్రభో అని దేవుడికి దగ్గరకు పోతాడు. దర్శకుడు ఈ సీన్ ను కామెడీగా వాడుకుని ఉంటారేమో కానీ.. లోతైన అర్థం ఉంది. అందరి విషయాలు సీక్రెట్‌గా తెలుసుకుంటే.. ఆ తెలుసుకున్న వాడికే మనశ్శాంతి ఉండదు. ఆ తెలిసిన వివరాలతో తీసుకునే చర్యలతో సర్వం కోల్పోతారు. ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో జరుగుతోంది అచ్చంగా అదే. ఆ ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసమో.. ఎందుకోసం మో అందరికీ తెలుసు. కానీ అన్నీ తెలుసుకుని సర్వం కోల్పోయారు. ఇప్పుడు చింతించి నా ప్రయోజనం లేదు. ఎందుకంటే చేతులు కాలిపోయాయి. సర్వం కోల్పోయిన కేసీఆర్ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు సంచలనం. ఫోన్ ట్యాపింగ్ బాధితుడే ముఖ్యమంత్రి కావడంతో ఆ మూలాల్ని బయటకు తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తాడు. బాధ్యులని చట్ట ప్రకారం శిక్షిస్తరా లేదా అన్నది తర్వాత కానీ ప్రజల ముందు మాత్రం పెడతారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఏం జరిగిందో ప్రజలు చర్చించుకుంటారు. ఇదే పెద్ద శిక్ష అనుకోవచ్చు. కానీ ఫోన్ ట్యాపింగ్ చేసి.. అందరి మాటలు విని .. సర్వం పోగొట్టుకుంది మాత్రం కేసీఆర్ . బాధితులకు జరిగిన నష్టం ఏమీ లేదు. ఒకరు ఏకంగా సీఎం అయ్యారు.. మరెంతో మంది కొన్ని రోజులు బాధపడి సైలెంట్ అయి ఉంటారు.. పూర్తిగా నష్టపోయి దిగులు చెందుతోంది మాత్రం అన్నీ చేయించిన వారే. ఆయనే కేసీఆర్ అన్నీ తెలుసుకోవడం ప్రమాదకరం ! ఫోన్ ట్యాపింగ్ ఎవరి మీద చేశారు ? . రాజకీయ శత్రువుల మీద కాదు.. హితులు, సన్నిహితులు మీద కూడా చేశారు. ఆ వివరాలతో కేసీఆర్ అందర్నీ దూరం చేసుకున్నారు. రెండో సారి గెలిచిన తర్వాత హరీష్ రావును ఎందుకు దూరం పెట్టారు ?. ఈటల రాజేందర్ ను ఎందుకు దూరం పెట్టారు ?. చివరికి వారిపై ఏ మాత్రం నమ్మకం లేని పరిస్థితులకు ఎందుకు వచ్చారు ?. తప్పనిసరిగా హరీష్ రావును అంటి పెట్టుకున్నారు కానీ.. ఆయనపై కేసీఆర్ కు ఇసుమంతైనా నమ్మకం లేకుండా ఎందుకు పోయింది ?. చివరికి తన వెన్నంటి ఉండే.. జోగినిపల్లి సంతోష్ కుమార్ ని కూడా దూరం పెట్టాల్సి వచ్చింది. ఆయన భార్య పైనా ట్యాపింగ్ ప్రయోగం చేశారు. ఇవన్నీ కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా పోయింది. మనశ్శాంతి కరువపోయింది. ప్రతి ఒక్కరి జీవితంలోకి తొంగి చూడటం వల్లనే ఇదంతా జరిగిందని ఎవరైనా కాదనగలరా ? తెలియకూడదని విషయాలు కూడా తెలుస్తాయి.. తట్టుకునే శక్తి ఉంటుందా ? నేటి సమాజంలో భార్య భర్తల ఫోన్లు కూడా ఒకరికొకరు చూసేందుకు అంగీకరించరు. థంబ్ ప్రొటెక్షన్ పెట్టేసుకుంటారు. నిజానికి అలా పెట్టుకున్న వారంతా తప్పు చేస్తున్నట్లు కాదు. కానీ ఫోన్ లో ఉన్న వాటిని చూస్తే అపార్థాలు, అపోహాలకు గురవుతారు.. తర్వాత ఎన్ని చెప్పినా తాము అనుకున్నదే నిజం అనుకుంటారన్న భయం. అందుకే సీక్రెట్ ఈజ్ సీక్రెట్. అలా ఉంచుకోవడం వల్లే కాస్తంత బంధాలు నిలబడున్నాయని అనుకోవచ్చు. ఇది భార్యభర్తల మధ్యనే కాదు.. ఓ కుటుబం…సమూహం.. పార్టీ సభ్యులు.. లేదా స్నేహితులు..దేనికైనా అన్వయించుకోవచ్చు. అలాంటిది ఫోన్ ట్యాపింగ్ చేసి మొత్తం రహస్యాలు తెలుసుకున్న వారు ఎవరైనా ప్రశాంతంగా ఉండగలరా ?. వాటి ద్వారా తీసుకునే చర్యలతో తనను తాను నష్టం చేసుకోరా.. ఇప్పుడు అదే జరిగింది. ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నది నిజమా కాదా అన్న సంగతి తర్వాత కానీ.. దాని వల్ల తెలుసుకున్న వారు తమ చర్యలను నియంత్రించుకోలేరు. ఫలితంగా నష్టపోతారు. జరిగింది అదే. దిద్దుకోలేని తప్పు ! రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టారు. వారితో సొంత వారు టచ్ లో ఉన్నారని తెలుసుకున్నారు. సొంత వారిపై నిఘా పెట్టారు. ఇంకా ఎన్నో తెలుసుకున్నారు. ఇప్పుడు ఎవర్నీ నమ్మలేని పరిస్థితి. అధికారం పోయింది.. నమ్మిన లీడర్లు పోయారు. ఉన్న వారిని నమ్మలేరు. ఇక ఏం మిగిలి ఉంటుంది.. మానసిక అంశాంతి తప్ప.
రోజులు రాను రాను బహు కఠినంగా తయారవుతున్నియి! ఇంకా పది సం.లు గడి చినతర్వాత ఇలాఉం టుంది అని ఊహింలేని పరిస్ధితులు! రేపు ఏమీ జరుగబోతున్నదో అని ఊహించలేని పరిస్థితి.
అర్ధరాత్రి నిద్రలేక, మందు లేక కేకలు పెడుతుంది అని తీహార్ సిబ్బంది చెప్పారు. బ్రాండ్ serve చేయమని డిమాండ్ చేసిన ఖైదీ. బట్టలు ఉతకడానికి దళిత బంధు మిత్రులతో షేర్ చేసుకోవడం, సబ్బులు క్రీములు లోషన్లు అక్కర్లేదని...... తెలుస్తుంది. అదృష్వశాత్తూ మంచి కంపెనీ దొరికింది.
ఎందుకూ బాస్ చూసే వారికి చెవిలో పువ్వులు పెడతారు (అంటే మిమ్మల్ని , మీడియా నీ తిహార్ జైల్లోకి ఎలా లోనికి రానిచారు ఈ ఇన్ఫర్మేషన్ తీస్కోవటానికి, కొంచెంగా ఆ రహస్యం తెలుపుతారా)
మీరు వెళ్లి చూశారా జైల్లోకి ఎంటర్ చేస్తారు మిమ్మల్ని సొంతం తల్లిదండ్ర తల్లిదండ్రులలో బంధువులను జైల్లోకి పంపించారు కదా ఆ జైల్లో ఉండే విషయాలు మీకు ఎలా తెలుస్తుంది
మరింక డబ్బులిచ్చి అన్ని మేనేజ్ చేసుకునే కాడికి, కవితకు డబ్బులకెం తక్కువ. ఎన్ని వేల, లక్షలైనా వెదచల్లి సౌకరాలు పొందుతుంది. ఇక బయట జీవితానికి, జైల్ జీవితానికి తేడా ఏముంది.