Тёмный

Kolanupaka someswara కొలనుపాక సోమేశ్వర ఆలయంలో రహస్య శివలింగం  

Journey with Balaraju
Подписаться 2,1 тыс.
Просмотров 17 тыс.
50% 1

కొలనుపాక శ్రీ చండీ సమేత సోమేశ్వర స్వామి
క్షేత్రం..
నల్గొండజిల్లా ఆలేరుమండలంలోని కొలనుపాక వీరశైవ సిద్ధ క్షేత్రం. శైవమతస్థాపకుడుగా పూజింపబడుచున్న శ్రీ రేణుకాచార్య ఇక్కడే లింగోద్భవం పొంది వేయి సంవత్సరాలు భూమండలం మీద శైవ మతప్రచారము చేసి, మళ్ళీ ఇక్కడే లింగైక్యంపొందినట్టు సిద్ధాంత శిఖామణి అనే గ్రంథంలో వ్రాయబడి వుందని స్థలపురాణం. దేవాలయ ఆవరణనిండా ఎన్నో శిథిలమైన శాసనాలు, ఛిద్రమైన విగ్రహాలు మనకు కన్పిస్తాయి. దేవాలయ ప్రాంగణాన్ని, ప్రాకార మండపాలనే మ్యూజియంగా ఏర్పాటుచేశారు పురావస్తుశాఖ వారు. ఈ ఆలయం క్రీ.శ 1070 - 1126 మధ్య నిర్మాణం జరిగినట్లు భావించబడుతోంది. పశ్చిమ చాళుక్యుల పాలనలో నిర్మించబడి ఉంటుందని చరిత్ర కారులు భావిస్తున్నారు.
పూర్వచరిత్ర
ఈ కొలనుపాకనే పూర్వం దక్షిణకాశి, బింబావతి పట్నం, పంచకోశ నగరంగా పిలిచేవారట. దీనినే కొలియపాక, కొల్లిపాక, కల్లియపాక, కుల్యపాక, కొల్లిపాకేయ మొదలైన పేర్లతో పిలిచే వారట. ఇప్పడు కొలనుపాక, కుల్పాక్ గా వ్యవహరిస్తున్నారు.
ఆలయ ప్రవేశ ద్వారం
ఇక్కడ సోమేశ్వర లింగాన్ని పుట్టులింగం, లేక స్వయంభూలింగంగా చెపుతున్నారు. ఈ లింగం నాలుగు యుగాలనాడే వెలసింది. కృతయుగంలో స్వర్ణలింగంగాను, త్రేతాయుగంలో రజితలింగంగాను, ద్వాపరయుగంలో, తామ్రలింగంగాను పూజలంది కలియుగంలో శిలాలింగంగా దర్శనమిస్తున్నట్లు స్థలపురాణం. ఈ లింగమే రెండుగా చీలి, దానిలో నుండి ఆది జగద్గురువు రేణుకాచార్య ఆవిర్భవించి,1000 సం.రాలు భూమిపై వీరశైవ మతప్రచారం చేసి, మరల తిరిగి ఇదే లింగం లో లీనమైనట్లు చెప్పబడుతోంది. ఈయనకే రేణుకుడు, రేవణ, నేవణ, నేవణ సిద్ధేశ్వరుడు అనే పేర్లు ఉన్నాయి.
శ్రీమత్ రేవణ సిద్దస్య కుల్యపాక పురోత్తమే !
సోమేశ లింగ జననం నివాసే కదళీ పురీ !!అని రేణుకాచార్య స్తుతి.
పంచపీఠాలు :
ఈ సోమేశ్వర లింగం పంచ పీఠాలలో మొదటిదిగా వీరశైవులు పూజిస్తారు.
1 సోమేశ్వరస్వామి - కొలనుపాక 2.సిద్దేశ్వర స్వామి - ఉజ్జయిని 3. భీమనాథస్వామి - కేదారనాథ్ 4. మల్లిఖార్జున స్వామి - శ్రీశైలమ్ 5.విశ్వేశ్వరస్వామి- కాశి
ప్రవేశ ద్వారంఎదురుగా వినాయకుడు
అతి పురాతనమైన ఈ ఆలయప్రాగణంలోకి ప్రవేశించిన భక్తులకు అనిర్వచ నీయమైన భక్తితో పాటు ఏదో ఒక ఆవేశంవంటిది కలుగుతుంది. దీనినే వీరశైవంలో భక్త్యావేశం అని పిలిచేవారేమో అనిపిస్తుంది. అక్కడ కన్పించే భక్తులు కూడ ఎక్కువగా కర్నాటకనుండి వచ్చినవారే ఎక్కువగా కన్పిస్తారు. తలస్నానాలు చేసి, జుట్టు ఆరబోసుకొని, ముఖంమీద బండారు, కుంకుమ, విభూతులను దట్టంగా అలంకరించుకున్న ఆడవారిలో అక్కడ చండీమాతే కన్పిస్తుంది. ఆలయప్రవేశం తోరణద్వారంతో చాలాఎత్తుగా కన్పిస్తుంది. తోరణ ద్వారానికి అటుఇటు ద్వారపాలకులు, ఎడమ వైపు నలుచదరపు కందకంలో నంది శివలింగాలు. ఆ పైన దూరంగా కొన్ని శాసనాలు దర్శనమిస్తాయి. తోరణ ద్వారానికి కుడి వైపు కొంచెం దూరంలో నేల లోపలికి నలభై, ఏభైమెట్లతో మెలికలు తిరిగిన నేలమాళిగ ఉంటుంది. ఆ మార్గాన్ని మూసివేయడం జరిగింది
మ్యూజియంలోని గజలక్ష్మి
ప్రథానాలయం
మ్యూజియాన్ని, వీరభద్ర మండపాన్ని దాటి వెళితే ప్రథానాలయాన్ని చేరుకుంటాం.ఈ నడుమ ప్రమాణ మండపంలో నందీశ్వరుడు మనల్ని పలకరిస్తున్నట్లు గా కన్పిస్తున్నాడు. ప్రథానాలయం ప్రాకార మండపాలనుండి వేరుగా నిర్మించబడింది. ముఖమండపంలో మనకు పంచముఖేశ్వరుడు దర్శనమిస్తాడు.
వీరభద్ర మండపం
చంద్రుడు ఈయన అనుగ్రహాన్ని పొంది తరించినట్లు, అందువలన ఈ స్వామి సోమేశ్వరుడుగా పిలువబడబతున్నట్లు స్థలపురాణం
స్వయంభువు డైన సోమేశ్వరుడు ,వెనుక ఆదిజగద్గురు రేణుకాచార్య ఆవిర్భావ దృశ్యం.చండీమాత.ఎడమవైపు ఉపాలయంలో మల్లిఖార్జునుడు ఆ ప్రక్కన నాలుగుమెట్లు ఎక్కి కుడువైపుకు తిరిగితే ఉపాలయంలో చండీమాత కొలువు తీరి ఉంది.శ్రీ చండీమాత.ఆ ఆలయానికి ఎడమవైపు కుందమాంబ దివ్యమంగళవిగ్రహం కన్పిస్తుంది. చండీమాత భక్తులు ముడుపులు కట్టి, కోరికలు తీరిన తరువాత మొక్కులు చెల్లించుకుంటారు. అందుకే చండీమాత ముఖమండపం పైకప్పంతా ఈ ముడుపుల మూటలతో నిండివుంటుంది ముడుపుల మూటలు.చండీమాత ఆలయ ద్వారం వద్ద ఉన్న వినాయకుడు.కోటిలింగేశ్వరాలయం:- ఎడమవైపు ద్వారం నుండి వెలుపలికి వస్తే నైరుతి లో కన్పిస్తుంది కోటిలింగేశ్వరాలయం. పంచకోసు నగరంగా పిలువబడే ఈక్షేత్రంలో కోటిలింగాలను ప్రతిష్ఠించే సమయంలో వెయ్యిలింగాలు తక్కువ అవడంతో ఒకే రాయిపై వేయిలింగాలను చెక్కి ప్రతిష్టించారట. అదే ఈ కోటిలింగేశ్వరాలయంగా.ప్రసిద్ధి కెక్కింది.వెయ్యిలింగాలు.సూర్యగంగ :-ప్రథానాలయ ముఖమండపము యొక్క కుడివైపు ద్వారం నుండి వెలుపలికి వస్తే కన్పించేది సూర్యగంగగా పిలువబడే అత్యంత లోతైన కోనేరు.ఏకాదశ రుద్రులు :-అటునుంచి తిరిగి పడమరకు తిరిగి నాలుగు మెట్లెక్కితే ఏకాదశరుద్రుల సాక్షాత్కారం లభిస్తుంది. ప్రక్కనే కొంచెందూరంలో ఉత్తరాభిముఖుడై విఘ్నరాజు కొలువు తీరి ఉన్నాడు.ఉత్తర ద్వారం గుండా వెలుపలికి వస్తే కాకతీయ కళాసంప్రదాయంతో నిర్మితమైన మరో శిథిలశివాలయం మన కంటపడుతుంది. సోమేశ్వర ఆలయమంతా చాళుక్య, హోయసల నిర్మాణ సంప్రదాయం కన్పిస్తే, ఈ ఆలయం నిర్మాణంలో కాకతీయశైలి ప్రతిబింబిస్తోంది. దీనిలో శివలింగం, ముఖమండపంలో నంది మిగిలున్నాయి, ఆ ప్రక్కనే కేతేశ్వర స్వామి ఆలయం నూతన నిర్మాణంగా కన్పిస్తోంది. అలాగే కనుచూపుమేర వరకు శిథిలమైన ఒరిగిపోయిన ఆలయ సముదాయాలే ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఉపాలయాల్లో కాలభైరవుడు, వీరభద్రుడు, కుమారస్వామి రూపాలతో పాటు, ఒక మండపంలో ఆంజనేయుడు కూడ కొలువు తీరి ఉన్నాడు.
శిథిలశివాలయం.వీరశైవ క్షేత్రాల్లో ఆంజనేయుడు కనపడటం ఆంజనేయుడు శివాంశ సంభూతుడుగా పూజించబడటమే కారణమై ఉండవచ్చు. ఇంకా ఎక్కువ సమాచారం చెప్పడానికి, మనం తెలుసుకోవడానికి అక్కడ సరైన గైడ్ కాని, ముద్రిత సమాచారం కాని లేకపోవడం కొంచెం బాధ కల్గిస్తుంది. సుదూర ప్రాంతాలనుంచి అంటే ఇతర రాష్ట్రాలనుంచి ఇక్కడ కొచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. యాత్రికుల వసతి సముదాయం ఇటువంటి వారికోసం అందుబాటులో ఉంది.ఆంజనేయుడు:
#journeywithbalaraju

Опубликовано:

 

8 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 30   
@anjaneyareddy8819
@anjaneyareddy8819 5 дней назад
🇮🇳🙏👍
@ShivaKumar-fp9bs
@ShivaKumar-fp9bs 17 дней назад
Nice coverage with good information
@journeywithbalaraju9419
@journeywithbalaraju9419 17 дней назад
Thank you sir
@Laxmanraodivvela
@Laxmanraodivvela 11 дней назад
❤❤
@BaikanNarendar
@BaikanNarendar 17 дней назад
Om namah shivaya 🙌🙌
@Laxmanraodivvela
@Laxmanraodivvela 11 дней назад
Om-nama-sivaya-padabivandalu-saranam-gachhami-pahimam-sarvejanasukenobavanthu
@journeywithbalaraju9419
@journeywithbalaraju9419 10 дней назад
ఓం నమశ్శివాయ. 🙏🙏
@panchaksharipaty8776
@panchaksharipaty8776 10 дней назад
🙏🙏
@Saichaitanya-f8i
@Saichaitanya-f8i 17 дней назад
Super ❤
@Johnmoni-ie2wq
@Johnmoni-ie2wq 17 дней назад
Jay Sri ram
@journeywithbalaraju9419
@journeywithbalaraju9419 10 дней назад
జై శ్రీరామ్.. Jai Sriram.. 🙏🙏
@chiranjeevikumargudala4101
@chiranjeevikumargudala4101 17 дней назад
Nice balaram TQ for sharing
@journeywithbalaraju9419
@journeywithbalaraju9419 10 дней назад
Thank you Annaya Jai Sriram..❤
@BaikanNarendar
@BaikanNarendar 17 дней назад
Om namah shivaya
@journeywithbalaraju9419
@journeywithbalaraju9419 10 дней назад
Om Namasgivaya... 🙏🙏
@MALLEBOINAYELLAIAH
@MALLEBOINAYELLAIAH 11 дней назад
🎉om. Namasiva🎉
@journeywithbalaraju9419
@journeywithbalaraju9419 10 дней назад
Om Namasgivaya.. 🙏
@jakirhussaintapadar
@jakirhussaintapadar 17 дней назад
Nice sir
@journeywithbalaraju9419
@journeywithbalaraju9419 10 дней назад
Thank you mitrama...❤
@shivatextilessareesupplier1652
🙏 వీడియో చాలా బాగుంది 🙏
@journeywithbalaraju9419
@journeywithbalaraju9419 2 дня назад
THANK YOU SO MUCH MITRAMA 💓 💗
@pvrkgallery
@pvrkgallery 12 дней назад
ఓం నమః శివాయ
@journeywithbalaraju9419
@journeywithbalaraju9419 10 дней назад
ఓం నమశ్శివాయ... Jai Sriram 🙏🙏
@ezymoments7619
@ezymoments7619 11 дней назад
ఇంతకీ రహస్య శివలింగం ఎక్కడ వుందో చూపించలేదు ????
@journeywithbalaraju9419
@journeywithbalaraju9419 10 дней назад
వీడియో తీయనియలేదు మిత్రమా దర్శనం మాత్రమే జరిగింది sory But చాలా అద్భుతం మైన దేవాలయం... 🙏🙏
@ezymoments7619
@ezymoments7619 10 дней назад
​@@journeywithbalaraju9419 పర్వాలేదు మిత్రమా... మీరు ఎంతో కష్టపడి ఎంతో వివరంగా చెప్పారు. ఈ టెంపుల్ కి నేను పలుమార్లు వెళ్ళాను. రహస్య శివలింగం గురించి నాకు ఎవరూ చెప్పలేదు. అందుకే మొత్తం వీడియో చూసాను. కాని అది ఏ ప్లేసులో చెప్పలేదు. థాంక్యూ
@journeywithbalaraju9419
@journeywithbalaraju9419 9 дней назад
@@ezymoments7619 Thank you మిత్రమా జై శ్రీరామ్ ఓం నమ శివయ్య..
@kamarajuchandrasekhar8002
@kamarajuchandrasekhar8002 6 дней назад
In name is Kolanpam in wargal serch Google you will get route map contact Telangana tourism office nearby you will get it ❤❤
@packwellinds7748
@packwellinds7748 7 дней назад
Asalde phisalgayaa ! Annatlunnadiraa nee video. Title yemi pettinavraa ?
@journeywithbalaraju9419
@journeywithbalaraju9419 6 дней назад
@@packwellinds7748 మిత్రమా సారీ.. మనించండి నేను చాలా request చేశా.. వీడియో తీసుకోనియలేదు కానీ మళ్లి వెళ్తా వీడియో తప్పక తీస్తా.. ఆ పరమేశ్వరుని ఆశీర్వాద్ధం..మీ అందరి ఆశీర్వాద్ధం వుంది.. నేను తప్పకుండా అప్లోడ్ చేస్తా. మీరు నా వీడియో కి కామెట్ చేసినందుకు ధన్యవాదములు. జై శ్రీరాం
Далее
would you eat this? #shorts
00:13
Просмотров 5 млн
would you eat this? #shorts
00:13
Просмотров 5 млн