Тёмный

kshaminchanu - Story by Kommuri Venugopala Rao - క్షమించాను - కొమ్మూరి వేణుగోపాలరావుగారు వ్రాసిన కథ 

Kiran Prabha
Подписаться 223 тыс.
Просмотров 31 тыс.
50% 1

#kiranprabha #telugu #kommuri
అలనాటి సుప్రసిద్ధ కథా, నవలా రచయిత కొమ్మూరి వేణుగోపాలరావుగారు 1957 లో వ్రాసిన కథ 'క్షమించాను '. 65 సంవత్సరాల క్రిందట తన 22 సంవత్సరాల వయసులో కొమ్మూరి వేణుగోపాలరావు గారు వ్రాసిన మానసిక విశ్లేషణ అంతర్లీనంగా సాగే కథ ఇది. 35 సంవత్సరాలు కాపురం చేసిన ఓ జంట, ఆమె మరణశయ్య మీద ఉండగా అన్నేళ్ళూ తన మనసులో దాచుకున్న భావాల్ని భర్తకు చెప్పేసింది. అన్నేళ్ళు ఆయన కౄరత్వన్ని భరిస్తూ, ఆయనకు తెలీకుండానే ఆయన్ని క్షమిస్తూ జీవించానని చెప్పింది, ఆయనకదో షాక్..!! ఎలాగూ చనిపోతాను కదా అని అంత ధైర్యంగా చెప్పేసింది.. కానీ.. తర్వాతేం జరిగింది? కొమ్మూరి వేణుగోపాలరావుగారి కథకు కిరణ్ ప్రభ కథనం, విశ్లేషణ. మనసుల్ని కదిలించే కథ, మనసుల్ని కలవరపరిచే కథ కూడా.
చదవడానికి లింక్ ఇదీః
drive.google.c...

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 89   
@commonman6304
@commonman6304 Год назад
ఓ వ్యక్తి తన 22వ ఏట.. సంక్లిష్టమైన భార్యాభర్తల మానసిక చిత్రణని ఇంత గొప్పగా ఆవిష్కరించటం.. చాలా అరుదైన విషయం..!! మీరు మాకు అందించిన తీరు అభినందనీయం..
@nmgodavarthy3680
@nmgodavarthy3680 Год назад
చాలా బాగుంది. 22 ఏళ్ల వయసులో వ్రాయడం గొప్ప విషయం... రచయిత కి మీకు ధన్యవాదాలు....🎉🎉🎉🎉
@suribabukaranam4260
@suribabukaranam4260 Год назад
22 సంవత్సారాలు వయస్సు లో ఇంత మెచ్యుర్డ్ గా ఆలోచించిన రచయితకి పాదభి వందనాలు ఈ కథను ఇంత బాగా వినిపించిన మీకు కూడా పాదాభివందనాలు మీ అభిమాని from Vizag
@vedapanditaha
@vedapanditaha 4 месяца назад
❤ నిజం గా అద్భుతమైన కథను అందించారు ముఫై సంవత్సరాల క్రితమే నేను చదవి లేదా విని ఉంటే ఇంకా బాగుండేది అనే అభిప్రాయాన్ని దాచుకోలేక పోతున్నాను,🙏
@విశ్వామిత్రకొదమసింహం
"అస్థిర స్థిరత్వం" అద్భుతమైన పద ప్రయోగం. అంత చిన్న వయసులో ఎంతో పరిణతి చూపిన కొమ్మూరి వారి రచనారీతి అద్భుతం. తాను మరణించినా జీవించినా ఆదిశేషయ్య మాత్రం జీవశ్చవంగా నే మిగిలి పోతాడు.
@s.sambasivarao9131
@s.sambasivarao9131 Год назад
కిరంగారు నమస్తే క్షమించను కథను ఎంతచక్కగా విశ్లేషణ సినిమాలగా చూపించారు, s సాంబశివరావు 84ఇయర్స్, గుంటూరు......
@subhakarraokanaparthi5311
@subhakarraokanaparthi5311 Год назад
ప్రభాకర్ గారు నమస్కారం. కార్ల్ మార్క్స్ గారి జీవిత చరిత్ర లాగానే అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ను టాక్ షో చేయగలరని మనవి.
@satishganta8991
@satishganta8991 Год назад
"క్షమించడం" ఒక బలంగా అభివర్నించడం... 👏👌👍🙏
@chilakamarthisaiseshu4651
@chilakamarthisaiseshu4651 Год назад
ముందుగా శ్రీ కొమ్మూరి వేణుగోపాల్ గారి "క్షమించాను" ను అధ్భుతంగా ఆవిష్కరించిన శ్రీ కిరణ్ప్రభ గారికి అభినందనలు మరియు ధన్యవాదాలు. ఆనాటి 22 సంవత్సరాల శ్రీ కొమ్మూరి వారికి ఈనాటి 57 సంత్సరాల నేను పాదాభివందనం చేస్తున్నాను. అలాగే వారి అబ్బాయి గారి గొంతు విని ఎంతో సంతోషించాను. అందుకు మరోసారి మీకు నమస్కారాలు. - చిలకమర్తి శేషు
@satyagowriballa7913
@satyagowriballa7913 Год назад
చిన్న వయసులోనే ఇంత మంచి కథ రాసిన రచయితకి నా మనస్సులు🙏చదివిన మీకు ధన్యవాదాలు..
@chandrasekhar1234
@chandrasekhar1234 Год назад
అద్భుతమైన కథలు వినిపిస్తున్న కిరణ్ ప్రభ గారికి శతకోటి వందనాలు. ఆనాటి పురుషాధిక్యతను ప్రస్తావిస్తూ కొడవటిగంటి కుటుంబరావు గారు ఒక కథలో "అవినీతి పరులైన అధికారులముందు చేతులు కట్టుకొని చిత్తం, చిత్తం, అనే పురుషులు కొందరు, ఇంటికి వచ్చాక పురుషాహంకారంతో నోరు లేని భార్యపై మాత్రం దౌర్జన్యం చేస్తుంటారు "అని వ్రాశారు. ఆభావాన్నే కొ :వే గారు స్త్రీ ఔన్నత్యాన్ని చక్కగా వివరించారు. కిరణ్ ప్రభ గారు!మీ పఠనా నైపుణ్యం మాత్రం అమోఘం.దైవదత్తం.🙏
@satyagowriballa7913
@satyagowriballa7913 Год назад
మానసిక వ్యథ మనిషిని చాలా కృంగదీస్తుంది
@sistlakrishnamurty3822
@sistlakrishnamurty3822 Год назад
అద్భుతమైన కథను అద్భుతంగా పరిచయం చేసిన అద్భుతమైన వ్యక్తికి ... వందనాలు🙏🙏
@rajinikatragadda1695
@rajinikatragadda1695 Год назад
కధ, కధ గురించి మీరు చెప్పటం రెండూ చాలా బాగున్నాయి , కిరణ్ ప్రభ గారు. అభినందనలు.
@raambabu7111
@raambabu7111 Год назад
ఈ కథలో నన్ను నేను చూసుకుంటున్నాను.. రచయితకు శతకోటి పాదభివందనాలు...
@shankarshaharsid5766
@shankarshaharsid5766 Год назад
నాకు వివాహమై 31 సంవత్సరాలు దాటింది నిజం చెప్పాలంటే నేను కూడా ఈ ఆది శేషయ్య లాంటి వ్యక్తి నే., ఈ కథ వింటున్నంత సేపు నా గుండె దడ దడ లాడింది అక్కడ పార్వతమ్మ ఇక్కడ మా ఆవిడ బ్రతికి ఉంటే చాలు అనిపించింది. ఏది ఏమైనా మా లాంటి వాళ్ళు... ముఖ్యంగా నేను ఇప్పటికైనా మారి భార్యను అర్థం చేసుకుని ఒక మంచి భర్త గా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. రచయితకు మరియు కిరణ్ ప్రభ గారికి నా కృతజ్ఞతలు.
@nag2447
@nag2447 Год назад
70 years experienced persons రాసే కత @22years లో రాశాడు అంటే k.venugopal rao గారు really great. Thanks kiran prabha garu. Great story. From eswar iit kanpur
@nemanisomayaji9568
@nemanisomayaji9568 Год назад
ఓం చాలా చక్కని కధ వినిపించారు. అభినందనలు. కొమ్మూరి వేణుగోపాల రావు గారి ఈ కధ నిజంగా జీవిత మధనం. అన్ని కాలాలలో ఎదో ఒక మూల కదులు తూనే ఉంటుంది. నా బుద్ధి కి తోచిన అన్వయం. 1 ఆది శేషయ్య లో క్రమం గా మార్పు వచ్చింది. 2 పార్వతమ్మ భర్త ప్రేమ చవి చూసింది. 3 అమ్మ వారి వాక్కు వృధా కాలేదు. పార్వతమ్మ పసుపు, కుంకాలతో చల్లగానే వెళ్లి పోయింది. ఆది శేషయ్య ఎంత మారినా చివరి దశ లో శిక్ష అనుభవించక తప్పలేదు..... 🙏🏻
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 Год назад
ఏం కథ!!అద్భుతం అనాలా,ఆలోచింపజేసే కథ అనాలా,మనసును మధించే కథ అనాలా ..?! అంత చిన్న వయసు లో ఇంతటి మానసిక పరిపక్వత ఎలా అబ్బిందో రచయితకు! ఒక స్త్రీ ఔన్నత్యాన్ని సరళమైన భాషలో ఎంతో లోతైన భావాలతో రచయిత పాఠకులకు పరిచయం చేసారు! అంత చిన్నవయసులోనే రచయిత తెలుసుకున్న కఠిన సత్యాలు-‘భార్య భర్తకు పెట్టిన భిక్ష భర్త దుర్మార్గాన్ని బయట పెట్టక పోవడం’. ఒక భర్త(తండ్రి) ‘పాపాలు చేస్తూ క్షమించబడుతూ వృద్ధుడయ్యాడు’ ,. ‘పాపానికి పరిధి వుంది,ప్రాయశ్చిత్తం లేదు’-ఇలా కథలో ఎన్నో అక్షర సత్యాలు వున్నాయి! ఒక్కటే బాధ-భర్త కు ,జీవితాంతం అతడు చేసిన దుర్మార్గాలను తాను ఏవిధంగా క్షమించిందో చెప్పి తన ఔన్నత్యాన్ని తెలియజెప్పిన భార్య-చివరికి అతని మనసు నొప్పించానేమో అని బాధపడి ఒక మామూలు భార్యగా మనసులోనే బాధపడుతూ చనిపోతుంది! రచయిత అంత చిన్న వయసు లోనే ఒక స్త్రీ భూదేవి లా పరమ సహనశీలి అని,పురుషుడు తన ఇంట్లో తాను సహజంగా పరమ దుర్మార్గుడు-అని గ్రహించిన రచయితకు పాదాభివందనాలు. ఇంత మంచి సహజమైన కథను గొప్పగా విశ్లేషించినందుకు, శ్రోతలకు అందించినందుకు కిరణ్ ప్రభ గారు ఎంతో వందనీయులు.
@k.z.s.kumarkarise8278
@k.z.s.kumarkarise8278 5 месяцев назад
Excellent మేము స్వయంగా చదివినా ఇంత విశ్లేషాత్మకంగా ఆలోచించి అర్ధం చేసుకోగలమా అన్నట్టుగా ఉంది
@gayatrikosuru4741
@gayatrikosuru4741 Год назад
మంచి కథ,వింటున్నంత సేపు సమయం తెలియలేదు.హృదయం కదిలించి కన్నీరు పెట్టించే భావజాలం. 'క్షమ' యొక్క విలువ ఎంత గొప్పది.రచన అద్భుతం. యువ రచయితలకు ఎంతో స్ఫూర్తి. చక్కని వ్యాఖ్యానం చేసిన మీకు ధన్యవాదాలు.
@NAADESAM
@NAADESAM Год назад
పురుషాధిక్యత , మహిళ లసహనాన్ని గొప్పగా పరిచయం చేసిన రచయితకు దాన్ని అత్యంత ఆసక్తికరంగా విశ్లేషించిన కిరణ్ ప్రభగారికి అభినందనలు, ధన్యవాదాలు.
@vijayagopalpotukuchi2336
@vijayagopalpotukuchi2336 Год назад
అద్భుత రచయిత వేణుగోపాలరావుగారు
@muraligattupalli6607
@muraligattupalli6607 Год назад
కొమ్మురి వేణుగోపాలరావు గారి రచనలు చాలా బాగుంటాయి, అందునా మీ కధా వివరణ ఎంతో బాగుంది, కొంత ఉపోద్ఘాతం ఎక్కువయిందని నా అభిప్రాయం…👌
@jyothigundabolu5532
@jyothigundabolu5532 Год назад
This story remains as an iconic story forever because writer narrated beautifully about the power of forgiveness and unconditional love. He has shown the power of forgiveness which is living peacefully with head high above water. She was portrayed as a powerful and great human being. A magnanimous story. Thank you for telling such a beautiful story to all of us , Kiran’s Prabha Garu All the best Jyothi
@sundarib8346
@sundarib8346 Год назад
Chaalaa manchi kadha andincharu. Manasika visleshana chalaa baagaa chepparu.kommuri venugopal gaari novels naaku chaalaa ishtam
@sucharithakotagiri3418
@sucharithakotagiri3418 Год назад
నమస్కారం ప్రభాకర్‌ సార్‌ నేను అనుకొనేదాన్ని ఆడవారి హృదయపు లోతులను ఒౌన్నతాన్ని శరత్‌ చూపించినంతగా ఇంకెవరూ చూపించలేరు అని కాని నా అభిప్రాయం తప్పని ఈకథ విన్నాక అనిపించింది ఇంకెంతకాలమయ్‌నా ఆడవారి జీవితాలు ఇంతేనా అనిపిస్‌తున్నది సార్‌
@prasadart5898
@prasadart5898 5 месяцев назад
కథలు చదివితే మంచి ఆలోచనలు వచ్చి, వేరే కథలు రాయటానికి ప్రేరణ కలుగుతుంది అనేవారు దాసరి గారు కూతురు కోణంలో నాకు వేరే కథ తట్టింది. కిరణ్ప్రభ. గారికి‌ ధన్యవాదాలు 🎉
@shaliviran9071
@shaliviran9071 Год назад
Great narration really heart touching story of a real human being.. this is the greatness of forgiveness
@DurgaPrasad-qo2rp
@DurgaPrasad-qo2rp Год назад
It is the most powerful scaning of mind vibrations presentations thanks for this wonderful story
@pushpalatha3775
@pushpalatha3775 Год назад
Thank you sir for sharing excellent story 🙏🙏
@Dur290
@Dur290 Год назад
Chaala klistamaidhi manassu.
@pushparao6922
@pushparao6922 Год назад
The writer was very intelligent/mature at that age/time. Your narration/story telling is very nice, by bringing old novel(s) and doing lot of research for the benefit of Telugu people all over the world. Great work by you Sir. Many many ThanQs. God bless you with all happiness and prosperity.
@leelavathiminnakuru6061
@leelavathiminnakuru6061 Год назад
Kiran Prabha garu manchi Katha vinipinchru alaane appati rojulalo vinna purusha ahakaaram gurthu chesaaru 🙏🙏🙏
@umarani2159
@umarani2159 Год назад
Sir మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా సరిపోదు.
@mohanramprasadpotluri6410
@mohanramprasadpotluri6410 Год назад
మంచి కథ వినిపించారు.. మీకు నెనరులు
@suryapadmavatikotaru3519
@suryapadmavatikotaru3519 Год назад
కథ చాలా బావుంది సర్. చిన్న వయసులో మంచి గా రాశారు రైటర్. కిరణ్ ప్రభ గారి వ్యాఖ్యానం కూడా చాలా బావుంది. ఆ రోజుల్లో భార్యలు...భర్తకు ఎదురు చెప్పకుండా... అలాగే ఉండేది పరిస్తితి. కథ చాలా బావుంది సర్. సున్నితమైన కధ
@narsimharao7400
@narsimharao7400 Год назад
కిరణ్ గారు నమస్తే. చాలా రోజుల తర్వాత మంచి కథను పరిచయం చేశారు. కొమ్మూరు గారి రచనలు చాలా బాగుంటాయి. మీకు ధన్యవాదములు. ఇలాంటి వి ఇంకా మీ నుంచి కోరుకుంటూ..... 🙏🏼
@subbaraokankanala1346
@subbaraokankanala1346 Год назад
నా చిన్న తనం లో సినిమా హీరోల కున్నంత craze నవలా రచియితలకు ఉండేది ! పరిగెడు తున్న రైలు లో నుండి బయటి దృశ్యాలను వీక్షించినంత తేలికగా ఆ కధలను చదివే వాళ్ళం ! మీరే శ్రోతలకు చాలా సౌకర్యంగా వుండే విధం గా ఈ కధను చదివారు ! మేము అప్పట్లో అంత అర్ధవంతం గా చదవనూ లేదు ! 22 ఏండ్ల వయస్సులో ఇంత చిన్ని కధలో అంత పెద్ద ఆలోచనలు భావ గర్భితనగా రచన చేయ గలగటం, వారు ఆ వయస్సులోనే జీవితాలను అంత దగ్గరగా పరిశీలించి, తనదైన శైలిలో కధారూపం లో కి 'శిల్పి' లాగా మలచటం -- ఇవన్నీ అప్పుడు గ్రహించలేని పపసి మనస్సు ! ఇప్పుడైనా, మరిన్ని సార్లు పఠించితే గాని రచయిత కథలో మూలాంశము అర్ధం కాని స్థితి ! మీరు ఈ కధ మీద research చేసి thesis submit చేసినట్లుంది ! వారి కుటుంబ సభ్యులకు ఎంత ఆనందం కలుగజేశారో కదా ? మాకు కూడా ! మీకు ధన్యవాదములు !
@pushparao6922
@pushparao6922 Год назад
Very nice analysis.
@kallesastry
@kallesastry Год назад
కిరణ్ ప్రభ గారు, మొదట మీకు కృతజ్ఞతలు.ఇంత మంచి కథ ను మాకు పరిచయం చేసినందుకు. కొమ్మూరి ేణుగోపాలరావు ఇటువంటి జీవిత సత్యాలను తెలిపే కథలు రాయడం లో నిష్ణాతులు. ఆ కాలంలో భార్య ల మనస్తితినీ చక్కగా రాశారు
@kallesastry
@kallesastry Год назад
కథ చివరన నా ప్రియ మిత్రుడు రవికిరణ్ వాళ్ల నాన్న గురించి మాట్లాడడం చాలా బాగుంది. వీలయితే ఆయన అన్నికథలు అందరూ చదవాలి.
@mahammadsadikpasha9000
@mahammadsadikpasha9000 Год назад
Me hard work Ku na Vandanam🙏
@avasaralanarayanarao8695
@avasaralanarayanarao8695 Год назад
ధన్యవాదాలు
@harshavision675
@harshavision675 Год назад
Excellent story and extraordinary narration thank you so much sir
@sknagulmeera9633
@sknagulmeera9633 Год назад
Thank you sir
@ravikishorereddyindukuri
@ravikishorereddyindukuri Год назад
Guruvu gariki hrudyapurvaka namaskaralu🙏🏻🙏🏻🙏🏻
@satyanarayanavilla1076
@satyanarayanavilla1076 Год назад
A great writer.
@commonman6304
@commonman6304 Год назад
పెద్దలు చెప్పిన చతుర్విధ ఉపాయాలు.. సామం, దానం, బేధం, దండం..!! పండితులు.. మరో రెండు చెప్పారు, రహస్యంగా.. అవి.. క్షమ, ఉపేక్ష (క్షమించటం, ఉపేక్షించటం) పార్వతి భర్తని.. 'క్షమించింది'.. భర్తలో మార్పుకోసం.. 'ఉపేక్షించింది'..!! భర్త ఆదిశేషయ్య.. భార్యని 'క్షమించింది'.. తన కళ్ళు తెరిపించటానికి ఆమె చేసిన ఆలస్యానికి.. లేదా.. ఇంతదాకా ఉపేక్షించినందుకు..
@rasoolshaik909
@rasoolshaik909 Год назад
@nagamuni7461
@nagamuni7461 Год назад
ధన్యవాదాలు సర్
@krishnak3033
@krishnak3033 Год назад
He was my family doctor when we were kids. I met him many times and still remember his face. He used to come to my house to check my grandfathers health🙂. He also treated scar on my face due to an injury. Such a great man and polite nature he had.
@srajgopalrao
@srajgopalrao Год назад
What a great person
@venkateswarluk1570
@venkateswarluk1570 Год назад
Thank you sir kiran prabha garu. Vintunnanu sir.
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 Год назад
Excellent and useful story in real life sir 👍🙏👍
@chadalavadaanjaneyulu5468
@chadalavadaanjaneyulu5468 Год назад
మీకు హృదయపూర్వక నమస్కారములు 🌅🇮🇳🌻
@nagavenil7584
@nagavenil7584 Год назад
Thank u once again for the excellent story narration of Kommuri Venugopal Roa it was very heart touching waiting for the next week.
@sudhasnr5065
@sudhasnr5065 Год назад
Great story and great narration Kiran Prabhagaru. Listening to your talk shows are just enthralling and addictive. Thank you for creating “Talk Show Encyclopedia “
@sudhasnr5065
@sudhasnr5065 Год назад
Sudheshna
@indranigodavarthi2783
@indranigodavarthi2783 Год назад
House surgeon బండ బట్టీ, ఆ inspiration తో నే నేను పట్టుదల గా డాక్టర్ అయ్యాను
@yogeshthota9806
@yogeshthota9806 Год назад
Great work sir
@tsnbabuji2612
@tsnbabuji2612 Год назад
Sir naa manassu moogapoyindi...mee narration vinnataruvata.namaste Sir!
@sathisuryanarayanareddy8647
@sathisuryanarayanareddy8647 4 месяца назад
Sir malladhi sravanthi cheppandi
@madhunlrr
@madhunlrr Год назад
👏👏👏👏👏 excellent
@prasanthparagati3604
@prasanthparagati3604 Год назад
Sir BuchiBabu garu rasina చివరికి మిగిలేది book gurinchi cheppandi
@subbaraosanaka6334
@subbaraosanaka6334 3 месяца назад
🙏🙏🙏🙏🙏
@jyothik4659
@jyothik4659 Год назад
Thank you so much
@varalakshmikala440
@varalakshmikala440 Год назад
👌
@_VenkatC
@_VenkatC Год назад
😢
@rangamsetty6691
@rangamsetty6691 Год назад
22 వయస్సు ku medico. అయ్యుండాలి.
@ananthapadmanabharao7015
@ananthapadmanabharao7015 Год назад
👏👏👏👏👏
@chbabyrani1170
@chbabyrani1170 Год назад
22years ki 62years experience kadha hatsup
@commonman6304
@commonman6304 Год назад
మానసిక పరిపక్వత కొంతమందికి చిన్న వయసులోనే వస్తే.. మరి కొంతమందికి ఆలస్యంగా వస్తుంది.. ఇంకొంతమందికి ఎప్పటికీ రాదు..!! ఎందుకూ..??! ఇదో జీవితసత్యం.. ఓ వింత కూడా..!!
@kelambala3730
@kelambala3730 Год назад
చాలా నిత్యమైన, శాశ్వతమైన సత్యం చెప్పారు, ఇది ఎంతో , బాధించే, వెంటనే కొందరిని గమనిస్తే ఆనందాన్ని ఇచ్చే సత్యం 🙏🙏🙏🌹
@cvrc1577
@cvrc1577 Год назад
ఇది పరమ సత్యం....డాక్టర్ సి వెంకటేశ్వర రావు విజయవాడ.
@rajeshpv6283
@rajeshpv6283 Год назад
A very good morning Kiranprabhagaru, It's Wednesday :)
@Venkat-b3f6k
@Venkat-b3f6k 10 месяцев назад
Story of our mothers seventy years ago
@raghavuluvillupuram4319
@raghavuluvillupuram4319 Год назад
Nice 👍💐
@konthamnarsaiah2543
@konthamnarsaiah2543 Год назад
🙏
@chbabyrani1170
@chbabyrani1170 Год назад
Sir meku mundhu ga na namskarmulu ,e kada ma grand parents gurthukocharu sir
@ramupodila5187
@ramupodila5187 Год назад
Andukuu????????🙏
@rangamsetty6691
@rangamsetty6691 Год назад
పిచ్చెక్కింది. ఇప్పటి పరిస్థితులకు అసమందంగా ఉంధి.కానీ 70 ఎండ్లకిందట నేను కొన్ని సంఘటనలకు సాక్షి నీ. అంతే
@ramachandrarao5673
@ramachandrarao5673 Год назад
సాంబశివరావుగారి కధ హౌస్ సర్జెన్ చిన్నతనంలో చదివాను అప్పుడే ఈయన గొప్పరచయిత ఆని భావించాను ఈకధలో భర్త చనిపోయి భార్య బ్రతుకుతుంది కథను బట్టి అర్ధం అవుతోంది రచయిత బయట పెట్ట లేదు
@satyanandnuthii2196
@satyanandnuthii2196 Год назад
Далее