మల్లాది వారి ప్రవచన సుధా ఝరి అందరికీ అందుబాటులో ఉంచినందుకు ధన్యవాదములు. మరికొన్ని అమూల్యమైన మల్లాది ప్రవచనాలు సేకరించి మమ్మల్ని సంతోష పరచమని ప్రార్థన.🙏🙏🙏
మహాభారతం వేదాంతులకు పంచమవేదంగాను, పౌరాణికులకు పురాణంగాను, చరిత్రకారులకు చరిత్ర గాను, ఐతిహాసకులకు ఇతిహాసం గాను అనిపించినట్లు శాస్త్రిగారి ప్రవచనం హరికధ ఇష్టమైన వారికి హరికధగాను, పధ్యనాటకం ఇష్టపడేవారికి పధ్యనాటకంగాను, పురాణములను ఇష్టపడేవారికి ప్రవచనం గాను అనుభూతి కలుగుతుంది. ఇది యూట్యూబ్ లో ఉంచిన వారికి ధన్యవాదాలు
మల్లాది వారి రుక్మిణీ కల్యాణం రికార్డ్ అందించినందుకు కృతజ్ఢతలు. శాస్త్రిగారి చిత్రం కనుక పెడ్తే ఆస్తికులకి, శ్రోతలకి రికార్డ్ యెవరిదో తెలిసి ఉపయుక్తమైనదిగా వుండగలదని సూచన.
ఈకంఠమాధుర్యంకాని చెప్పేవిధానం గాని అన్వయంకాని పదప్రయోగం ఏమైనా సరే ఇతరులెవరు చెప్పలేరు చెప్పిన ఈ మాధుర్యం రాదు పోతనగారు కూడా ఇలా ఆపద్యాలుచెప్పిఉండరే నమోనమః