థాంక్యూ సర్, ఇప్పటి కాలము లో నవవిధ భక్తి ని గురించిన వివరణ ఎంతైనా అవసరం ఉన్నది దీనిని సరళం గా వివరించినందుకు మీకు మేము సదా కృతజ్ఞులము. సర్ ఒక చిన్న పరిశీలన.., శ్రవణము అంటే పరమాత్ముడి గురించిన సంపూర్ణత ను ధ్యానించటం., అనగా అత్యున్నతము, నాసనరహితము ఐన దేవుడి స్వభావము ను వినుట. అత్యుత్తమము మరియూ నాశనము లేనిది ఆత్మ కదా! శ్రవణము ద్వారా ఆ ఆత్మ మన హృదయము లోకి చేరి మనలని ఉద్ధరింపచేస్తుంది కదా! పరమాత్ముడు ఆత్మ. ఆయన బ్రహ్మాండము గా ఉంటూ.., ఆ బ్రహ్మాండము ను లయము చేస్తూ.. ఆ ఆత్మ గా ఎలా? ఎక్కడ? పరిపూర్ణస్థితి ని పొంది నాశనము లేని, అత్యున్నత స్వభావము ను మనకు చూపిస్తున్నాడు, ఈ ఘట్టము నాకు ఎరుక కావటంతో నన్ను యే ఖర్మ బందించదు, కాబట్టి నేను స్వతంత్రుడిని ఐతున్న. పరమాత్ముడు.., జీవమును ఇచ్చే ప్రధాత, కానీ.., ఆయన.., నాశనము కు లేదా మరణమునకు తీసుకుపోతున్న శరీరము నందు జన్మించి అత్యున్నతము మరియు నాశనము లేని స్వభావం లోకి ఎలా వెళ్తున్నాడు?ఎక్కడ ? ఎవరి ద్వారా తన శక్తి ప్రభావము ను చూపిస్తున్నాడు? ఇత్యాది ధర్మము యొక్కపరిపూర్ణ స్థితి ఎక్కడ జరుగుతుంది? సమస్తము పరమాత్ముడికి సమర్పించాలి అని చెప్తున్నారు, అనగా.. ప్రాణము, ఆత్మ, దేహము ను పరమాత్ముడికి సమర్పించిన మార్గదర్శి ఎవరు? ఎలా ?ఎక్కడ?ఈ కార్యాన్ని చేస్తున్నాడు? ఇది నాకు ఎరుక ఐనప్పుడే కదా నేను నా సమస్తమును ఆయన కు అర్పించగలిగేది, ఆయన శక్తి ప్రభావములను కొనియాడేది. ఆయన స్వభావము లోకి రూపాంతరము చెందేది. నవవిధ భక్తి లో యే ఒక్కదానిని పట్టుకుని ప్రయాణం చేసిన లక్ష్యము చేరుతము అంటున్నారే.., కానీ ఈ నవవిధ లక్షణాలు పరమాత్ముడి ని చేరడానికి సోపానలుగా నాకు కనపడుతున్నాయి. శ్రవణము లేకుండా భక్తి మొదలు కాదు కదా! వాస్తవము ఐన శ్రవణము ఉన్నచోట మిగతా లక్షణాలు అన్ని ఉంటాయి కదా! ఇత్యాది విషయాలను ఇంకెప్పుడైన.. దేవుడి కృప ను బట్టి.., పరిశీలనగా ఇంకొంచము లోతుగా వివరించగలరని మా విన్నపము, థాంక్యూ సర్, నమస్తే.🙏