నీ సిలువే నన్ను మార్చింది నీ త్యాగమే నీ సిలువే నన్ను మార్చింది నీ త్యాగమే నన్ను బ్రతికించింది ॥2॥ నీ ప్రేమలో చిరకాలము జీవింతును నీ సాక్షిగా నీ సేవలో కలకాలము ప్రకటింతును నీ ప్రేమను ॥ నీసిలువే ॥ 1॰ నీ రక్త ధారలే నా పాప మరకలను కడిగి పవిత్రపరచెను యేసయ్యా ॥2॥ రుధిరమంత నాకై ధారపోశావయ్య ఏమిచ్చి నీ ఋణం నే తీర్చెదనయ్య ॥2॥ ॥ నీ సిలువే ॥ 2॰ నీవు పొందిన దెబ్బలే నా పాప రోగములను విడిపించి రక్షించెను యేసయ్యా ॥2॥ పాప పరిహారార్ధ బలగా బలియైనావయ్య ఏమిచ్చి నీ ఋణం తీర్చెదనయ్య ॥2॥ ॥ నీ సిలువే ॥