Тёмный

osho ~ How to keep calm? చాలా హాయిగా, చాలా ప్రశాంతంగా ఉండడమెలా?  

dhyanajyothy foundation
Подписаться 3,8 тыс.
Просмотров 11 тыс.
50% 1

ముందు మీరు మీ శరీరాన్ని చాలా ప్రశాంతంగా ఉంచండి. నడవడం, తినడం, వినడం, మాట్లాడడం - ఇలా మీరు చేసే పనులను, మీ ప్రవర్తనను చాలా ప్రశాంతంగా జరగనివ్వండి. అలా మీ ఉనికి వెలుపల పరిధిని పూర్తిగా ప్రశాంతతో నింపండి. మీరు చేసే ప్రతి ప్రక్రియను ఏమాత్రం తొందర పడకుండా, చాలా నిదానంగా చెయ్యండి. శాశ్వతమైనదంతా మీకు అందుబాటులో ఉన్నట్లుగా ప్రవర్తించండి. నిజానికి, శాశ్వతమైనదంతా మీకు అందుబాటులోనే ఉంది. అతి ప్రారంభం నుంచే మనం ఇక్కడ ఉన్నాం. అలాగే చిట్ట చివరి వరకు మనం ఇక్కడే ఉంటాం. ప్రారంభమనేది ఉన్నప్పుడు ముగింపు కూడా ఉంటుంది. నిజానికి, ప్రారంభము లేదు, ముగింపు లేదు. మనం ఎప్పుడూ ఇక్కడే ఉన్నాం, ఇక్కడే ఉంటాం. రూపాలు మారుతూ ఉంటాయే కానీ, పదార్థం మారదు. మీ దుస్తులు మారుతూ ఉంటాయే కానీ, మీ ఆత్మ మారదు. ఏదో రక్షణ కోసం, భద్రత కోసం, చాలా సురక్షితంగా ఉండడం కోసం మీరు చేసే నిరంతర ప్రయత్నంలో ఉండే అనుమానంతో కూడిన, భయంతో నిండిన తొందరపాటే ఉద్రిక్తత. అలాగే, రేపటి కోసం లేదా మరణం తరువాత జరిగే దాని కోసం ఇప్పుడే సిద్ధపడడం ఉద్రిక్తత. ఎందుకంటే, రేపు జరిగే వాస్తవాన్ని భరించలేని భయం మీలో ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి, దానిని ఎదుర్కొనేందుకు మీరు ఇప్పుడే సిద్ధంగా ఉండాలి. గతంలో మీరు వాస్తవంగా జీవించలేదు. అయినా ఏదో విధంగా మీ గతం గడిచిపోయింది. కానీ, మీరు వాస్తవంగా జీవించలేదన్న సత్యం మాత్రం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అదే మీలోని ఉద్రిక్తత. కాబట్టి, పూర్తిగా జీవించని ఏ అనుభవమైనా మిమ్మల్ని వెంటాడుతూ ''నాతో జీవించి, నా పని ముగించి, నన్ను కడతేర్చు'' అంటూ మిమ్మల్ని వేధిస్తుంది. ఇది జీవితానికి సంబంధించిన అత్యంత మౌలికమైన విషయం. దీనిని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే, పూర్తిగా జీవించి ముగిసిపోవాలని కోరుకోవడం ప్రతి అనుభవానికి ఉండే సహజమైన గుణం. అందుకే పూర్తిగా ముగిసిన ప్రతి అనుభవం ఆవిరైపోతుంది. కానీ, పూర్తి కాని ఏ అనుభవమైనా ''నా సంగతి ఏం చెయ్యదలచుకున్నావు? నువ్వింకా నా పని పూర్తి చెయ్యలేదు. అందుకే నేనింకా అసంపూర్తిగానే ఉన్నాను. నన్ను సంతృప్తి పరచు'' అంటూ మిమ్మల్ని, మీ ఏకాగ్రతను వెంటాడి వేధిస్తుంది. అలా పూర్తి కాని మీ గతం మిమ్మల్ని పట్టుకుని వేలాడుతుంది. ఎందుకంటే, మీరు తీవ్రమైన సాంద్రత, లోతైన వాంఛ లేకుండా ఊరికే అలా, నిద్రాసంచారిలా ఏదో విధంగా తప్పించుకుంటూ ప్రతి దానితో పాక్షికంగా జీవించారే కానీ, దేనినీ పూర్తిగా, వాస్తవంగా జీవించలేదు. అందుకే మీ గతం ఎప్పుడూ మిమ్మల్ని పట్టుకుని వేలాడుతుంది. అలాగే మీ భవిష్యత్తు ఎప్పుడూ మీకు భయాన్ని సృష్టిస్తుంది. దానితో మీ గతం, భవిష్యత్తుల మధ్య వాస్తవమైన మీ వర్తమానం పూర్తిగా నలిగి నాశనమవుతుంది. కాబట్టి, మీరు మీ ఉపరితల పరిధి నుంచి విశ్రాంతి తీసుకోవాలి. ఆ పనిలో భాగంగా ముందు మీరు వీలైనన్ని సార్లు మీ తల, మెడ, కాళ్ళు, చేతులు, ఇలా మీ శరీర భాగాలలో ఎక్కడైనా ఉద్రిక్తత ప్రభావం ఉందేమో నిశితంగా పరిశీలించాలని, ఒకవేళ ఉంటే ఆ భాగాలను మీరు ప్రేమతో తాకుతూ, హాయిగా విశ్రాంతి తీసుకొమ్మని వాటికి నచ్చచెప్పాలని గుర్తుంచుకోండి. అలా చేసినప్పుడు అవి మీ మాట వినడం మీకు చాలా స్పష్టంగా తెలియడంతో మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి, కళ్ళు మూసుకుని మీ శరీరంలోకి ప్రవేశించి తల నుంచి అరికాళ్ళ వరకు ఎక్కడైనా ఉద్రిక్తత ప్రభావం ఉందేమోనని పరిశీలించండి. ఒకవేళ ఉంటే ఆ భాగాన్ని ప్రేమతో తాకుతూ, ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్లుగా ''భయపడకు. నీకు నేనున్నాను. నిన్ను నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. హాయిగా విశ్రాంతి తీసుకో'' అని వాటికి ధైర్యాన్నిస్తూ, అనునయించండి. అలా చేస్తూ ఉంటే, నెమ్మది నెమ్మదిగా మీరు ఆ పనిలో నైపుణ్యాన్ని సాధిస్తారు. అప్పుడు మీరు చెప్పినట్లు మీ శరీరం హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది. తరువాత మీరు మరికాస్త ముందుకెళ్ళి ''హాయిగా విశ్రాంతి తీసుకో'' అని మీ మనసుకు చెప్పండి. మీ శరీరం మీ మాట విన్నట్లుగానే, మీ మనసు కూడా మీ మాట వింటుంది. కానీ, ముందుగా మీరు మీ మనసుతో ప్రారంభించలేరు. ఎందుకంటే, మీరు మొదటి నుంచి ప్రారంభించాలే కానీ, మధ్య నుంచి ఎప్పుడూ ప్రారంభించలేరు. చాలా మంది ముందు మనసుతో ప్రారంభించి విఫలమవుతారు. ఎందుకంటే, మనసు ఎప్పుడూ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అందువల్ల మనసుది ఎప్పుడూ వక్ర మార్గమే. కాబట్టి, మీరు ఎప్పుడైనా దేనినైనా సక్రమమైన పద్ధతిలోనే చెయ్యాలి. అలా ఎప్పుడు మీరు స్వయంగా మీ శరీరాన్ని మీ చెప్పుచేతల్లో పెట్టుకుని దానికి విశ్రాంతిని ఇవ్వగలుగుతారో అప్పుడు మీరు మీ మనసును కూడా మీ చెప్పుచేతల్లో పెట్టుకుని దానికి కూడా మీరు విశ్రాంతిని ఇవ్వగలుగుతారు. ఒకసారి మీ శరీరం మీ మాట వింటుందనే నమ్మకం మీకు కలిగినప్పుడు, మీపై మీకు మరింత విశ్వాసం పెరుగుతుంది. అప్పుడు సంక్లిష్టమైన మీ మనసు కూడా మీ మాట వింటుంది.
#osho #dhyanajyothyfoundation #sadhguru #oshobharat #Talk25
If you like my videos please Share and Subscribe to this channel.
Note: ఈ వీడియో "అందమైన జీవితం" పుస్తకం నుంచి సేకరించినది. ఈ పుస్తకం మీకు oshowonders.com/ వెబ్ సైట్ లో లభిస్తుంది. Website Contact No.8333852421
The videos of this channel are an attempt to provide the aroma and nectar of Osho Rajneesh's Excellent knowledge in a very easy to understand Telugu language to the seekers of truth who are eager to know the truth, have the courage to bear the reality, are eager to get rid of superstitions, and hope to find light from the darkness.
సత్యాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి, వాస్తవాన్ని భరించగల ధైర్యం, మూఢ విశ్వాసాలను వదిలించుకోవాలనే తెగింపు, అంధకారం నుంచి వెలుగులోకి రావాలని ఆశించే సత్యాన్వేషకులకు ఓషో రజనీష్ గారి జ్ఞానామృతాన్ని చాలా సులభంగా అర్థమయ్యే చక్కని తెలుగు భాషలో అందిచండం కోసం చేసే ప్రయత్నమే ఈ ఛానల్ వీడియోలు.

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 14   
Далее
Новый уровень твоей сосиски
00:33
OSHO-The Most Inspirational Speech Ever!
1:18:59
Просмотров 166 тыс.
Новый уровень твоей сосиски
00:33