రాఘవ హాస్యం అశ్లీలత లేకుండా ఆరోగ్యకరమైన హాస్యం. తన కే సొంతమైన బాణీ తో అందరినీ ఆహ్లాద పరిచే రాఘవ ఎదిగే కొద్దీ ఒదిగే మనిషిగా అందరి అభిమానం చూరగొన్నాడు. కుటుంబ సభ్యులు అందరితో కలిసి చూడ గలిగే స్కిట్స్ రాఘవ స్కిట్స్ . రాఘవ ఇలాగే కలకాలం కొనసాగుతూ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి .
Rocket raghava team is the only one team delivers healthiest comedy.. in jabardasth from last 7+ yrs.. great comedian.. no matter what the character is he just blends... who ever may be new comers raghava comedy is always feels fresh.. and we never get bored..
ఇంటర్వ్యూ చాలా సింపుల్ గ , ప్రశాంతంగా విన సొంపుగా ఉంది. భాష స్పష్టంగా ,భావం నిర్మలంగా , ఎక్కడా దూషణలు , రోదనలు లేకుండా ,దర్పమన్నదే కనపడక బాగా ఆకట్టుకుంది . సినిమా మోజు లేక పోవటం ,నేను 2001 మొదట్లోనే అమెరికా వచ్చేయ్యటంతో ఎక్కువ ప్రోగ్రామ్స్ ఏవీ చూసే అవకాశం రాలేదు .ఎక్కడో ఒక సారి పదేళ్ల క్రితం జబర్దస్త్ చూసి ,జుగుప్సగా ఉండటంతో మళ్ళీ చూడటం కాలేదు.కానీ కరోనా మొదలైన సమయంలో రాఘవ కిట్ ఒకటీ చూడటం అయ్యింది. ఎంతగానో నచ్చేసి ,నవ్వుకుని,ఆరోగ్యవంతమైన కామెడీ తో (కొన్ని సార్లు బూతు ) అప్పటి నుంచి Rocket Raghava కిట్ లు అన్నీ చాలా వరకు చూసేసా .నేను చూసే జబర్దస్త్ ప్రోగ్రాం అంటే రాఘవ కిట్స్ మాత్రమే . మాటలో మాధుర్యం , మొహం లో అమాయకత్వం,స్పష్టత , కళ్ళల్లో నిజాయతీ చలాకీ తనంతో కూడిన తెలివి ప్రదర్శన,టాలెంట్ తో రాకెట్ రాఘవ చాలా మంచి నటుడు. ఈ ఇంటర్వ్యూ లో కూడా ఒక మంచి మనసున్న వ్యక్తిగా కృతజ్ఞతా భావం, అనుకోకుండా జరిగిన పొరపాటుకు ప్రాయశ్చిత్త దృక్పథం మంచి తనానికి నిదర్శనం . దేవుడు మేలు చేయుగాక . All the Best Raghava ..