శిలనైన నన్ను శిల్పివై మార్చావు నాలోని ఆశలు విస్తరింపచేసావు (2) నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు (2) నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన|| మోడుబారిన నా జీవితం నీ ప్రేమతోనే చిగురింపచేసావు (2) నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం (2) వర్ణించలేను లెక్కించలేను (2) నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన|| ఏ విలువలేని అభాగ్యుడను నేను నీ ప్రేమచూపి విలువనిచ్చి కొన్నావు (2) నాయెడల నీకున్న తలంపులు విస్తారం (2) నీ కొరకే నేను జీవింతు ఇలలో (2) నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన|| ఊహించలేను నీ ప్రేమ మధురం నా ప్రేమ మూర్తి నీకే నా వందనం (2) నీ ప్రేమే నాకాధారం - నా జీవిత లక్ష్యం (2) నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి (2) ||
The melodious tune by the legendary music director Dr PJD Kumar gave life to the good lyrics and has become a great song.. just like God's creation of mankind of His Breath to the dust.. Great contribution by Dr PJD Kumar Anna.. Prasad from Tanuku...
Please brother appreciate the music never under estimate the word because word IS GOD JOHN1:1,14....word is never a dust. Word IS what made the dust into life as humans ... MAY THE GOD'S WORD BE WITH US.. AMEN