నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఉంటుంది మేడంగారు, నెక్స్ట్ క్లాస్ కోసం ఎదురు చూస్తునన్ను,నేను ప్రతి రోజు ఉదయం 5 గంటల కు లేచి వీడియోలు చూస్తూ ప్రాక్టీసు చేస్తున్నాను,,నెక్స్ట్ వీడియో పెట్టండి మేడం 🙏🙏🙏
సంగీత నాట్యకళలు భారతజాతి అంత ప్రాచీనమైనది. భారతీయ సంగీతానికి మూలం వేదాలు - వేదాలలోని స్వరాలు. ఋగ్వేదం మంత్రాల గురించి వివరిస్తుంది. ఈ మంత్రాలకు మొన్ని లయాత్మక పదాలు చేర్చి పాడేవారు. వీటిని 'స్తోభాలు' అంటారు. రుగ్వేద కాలంలో ఉదాత్త, అనుదాత్త, స్వరిత అనే స్వరాలు ఉచ్ఛరించేవారు. కాలక్రమేణా వీటిని ఉచ్ఛ, వచ, స్వర, విశిష్టలతో సృష్టించారు. ఈ విధానం తరువాత ఏకస్వరమైన ఆర్చిక పఠనంగా మరింది. యజ్ఞయాగాలు జరిపే సమయంలో హాత, ఉద్గాత, సామిక అనే పేర్లతో స్వరాలను పాడేవారు. వేదకాలంలో ఏక (ఆర్చిక), ద్విశ్వరాలు (గాధిక్యం), దిస్వర (సామిక) పేర్లతో రూపొందింది. కాలక్రమేణా చతుస్వరి (నాలుగు), పంచస్వరి (ఐదు), షట్స్వరి (ఆరు), సప్తస్వరి (ఏడు) గా మారాయి. కాలక్రమంగా సప్తస్వర యుక్తమైన ఒక స్థాయిని మన పూర్వీకులు అందించారు.