వినరండయ్య తిరుపతమ్మ చరిత కనరండయ్యా ఆ తల్లి ఘనత (2) పెనుగంచిప్రోలు లోన వెలసినాది తల్లి పేరైనా దేవత గా నిలిచినాది (వినరండయ్యా ) తిరుమలేశుని అంశతోని పుట్టినాది తిప్పలన్నీ ఎన్నో మట్టుపెట్టినాది (2) కుంకుమా భరిణిగా వెలిగినాది తల్లి సంకటాలెన్నో తొలగించినాది (వినరండయ్యా ) కష్టాలు ఎన్నో కడ తేర్చినాదయ్యో ఇష్టంతో మమ్ము చేరదీసినాదయ్యో(2) మాల వేసినోల్ల మదిల దాసుకుంటది లీలన్ని ఇలా తల్లి చూపుతున్నదీ (వినరండోయ్యో) మున్నేటి తీరమున పాదమేసెను కంట నీరు బెట్టకుండ మనలచూసెను (2) వాతి గల్ల తల్లి కొలువెదీరేరా నేడు తల్లి పూజాలెన్నో పొంద బట్టరా (వినరండోయ్యో)