రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్టా గాలికి పెరిగా… అచ్చం నీలాగ నిత్యం నీతో ఉన్నాగా… ఇద్దరి లక్షణమొకటేగా ఆఆఆ ఆఆఆ ఆఆ… ఓఓ ఓఓ ఓ రామ రామ రఘురామ… అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా… ఓ కంట మమ్ము గనుమా అమ్మల్లే నను పెంచింది… ఈ పల్లెసీమ నాన్నల్లే నడిపించింది… ఊరంత ప్రేమ అమ్మల్లే నను పెంచింది… ఈ పల్లెసీమ నాన్నల్లే నడిపించింది… ఊరంత ప్రేమ ఎలా పెంచుకున్నా… ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం… నా చిట్టి జన్మం అన్నీ సొంత ఇల్లే… అంతా అయినవాళ్ళే ఈ స్నేహ బంధం… నా పూర్వ పుణ్యం బ్రతుకంతా ఇది తీరే ఋణమా… ఆ ఆ ఆఆ రామ రామ రఘురామ… అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా… ఓ కంట మమ్ము గనుమా ఏ ఆటలాడిస్తావో… ఓ కోతి బొమ్మ ఏ బాట చూపిస్తావో… కానున్న బ్రహ్మ ప్రసన్నాంజనేయం… అనే నామధేయం ప్రతి మంచి కార్యం… జరిపించు దైవం ప్రభాదివ్యకాయం… ప్రకీర్తి ప్రదాయం నాలోని ధైర్యం… శ్రీ ఆంజనేయం నా వెంటే నువ్వుంటే భయమా… ఆ ఆ ఆఆ రామ రామ రఘురామ… అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా… ఓ కంట మమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్టా గాలికి పెరిగా… అచ్చం నీలాగ నిత్యం నీతో ఉన్నాగా… ఇద్దరి లక్షణమొకటేగా ఆఆఆ ఆఆఆ ఆఆ… ఓఓ ఓఓ ఓ