Тёмный

Tata Strive Skill Development Centers Offers Free Courses and Jobs | 

LR Media
Подписаться 11 тыс.
Просмотров 2,6 тыс.
50% 1

Please watch: "How to Start Your Day with Meditation | Meditation Benefits | LR Media"
• Video -~-
Tata Strive Skill Development Centers Offers Free Courses and Jobs | లక్షలు ఖర్చయ్యే కోర్సులు + ప్లేస్ మెంట్ ఇప్పుడు FREE...
ఇప్పుడిప్పుడే అగ్ర దేశంగా ఎదుగుతున్న భారత్ ను నిరుద్యోగ సమస్య మాత్రం ఇంకా పీడిస్తూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలను తీసుకుంటున్నప్పటికీ పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించలేకపోతున్నాయి. దీనికి కారణం... చదువుకు తగ్గ అవకాశాలు లేకపోవడం, సరైన కంపెనీలు లేకపోవడం.
ఈ నేపథ్యంలో ఎన్నో ప్రముఖ కంపెనీలు నిరుద్యోగులకు చేయూతను అందించడానికి తమ వంతు కృషి చేస్తున్నాయి. అలాంటి కంపెనీలలో టాటా గ్రూపు కూడా ఒకటి. 'టాటా స్ట్రైవ్' పేరుతో ఈ సంస్థ నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులు నిరుద్యోగుల పాలిట వరంగా మారింది. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచితంగా కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తూ... కోర్స్ పూర్తవగానే సర్టిఫికెట్ ని అందచేసి… ఇంకా ప్లేస్ మెంట్లను కూడా కల్పిస్తోంది. దేశ వ్యాప్తంగా నెలకొల్పిన టాటా స్ట్రైవ్ క్యాంపస్ లలో వేలాది మంది తమ కోర్సులను పూర్తి చేసుకుని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.
అయితే, ఈ సంస్థ గురించి చాలా మందికి తెలియకపోవడం గమనార్హం. అందుకే అందరికీ ఈ గొప్ప అవకాశం గురించి తెలియజేయడం కోసమే ఈ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే కాకుండా... తెలిసిన వారికి, నిరుద్యోగులకు వివరించి, వారి ఉజ్వల భవిష్యత్తుకు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాం.
హైదరాబాద్ తో పాటు నాసిక్, మొహాలీ, ముంబై, పూణే, అలీగఢ్ ల్లో టాటాస్ట్రైవ్ సెంటర్లు ఉన్నాయి. వీటితో పాటు పలు చోట్ల ఎక్స్ టెన్షన్ సెంటర్లు, పార్ట్ నర్ సెంటర్లను కూడా నెలకొల్పారు. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులందరూ దాదాపుగా ఉద్యోగాలు పొందారు. స్టార్ హోటళ్లు, టాప్ బ్రాండెడ్ కంపెనీల్లో పని చేస్తున్నారు.
ఉచితంగా కార్పొరేట్ స్థాయి శిక్షణ:
టాటా స్ట్రైవ్ సెంటర్లన్నీ కార్పొరేట్ స్థాయిలో ఉంటాయి. ఇలాంటి సెంటర్లో సామాన్య విద్యార్ధులు ఎవరూ అడుగుకూడా పెట్టలేరు. అలాంటిది ఈ సెంటర్లో అడుగు పెట్టిన మరుక్షణమే విద్యార్థుల్లో ప్రొఫెషనలిజం నిండేలా పరిసరాలు ఉంటాయి. వేల రూపాయల నుంచి లక్షల రూపాయలు ఖర్చయ్యే కోర్సులను ఇక్కడ ఉచితంగా అందిస్తున్నారు. అలాగే అత్యున్నత స్థాయి ఫ్యాకల్టీలు విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు యూనిఫాం కూడా ఫ్రీగా ఇస్తారు. అయితే హాస్టల్ వసతిని మాత్రం ఇక్కడ free కాదు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న విద్యార్థులు మాత్రమే ఈ కోర్సులకు అర్హులు.
కోర్సులు ఎంపిక చేసుకునే విధానం:
ఇక్కడకు వచ్చే విద్యార్థులకు తొలుత ఏ రంగంపై ఆసక్తి ఉందో తెలుసుకుంటారు. అల్గోరిథమ్ అప్రోచ్ అనే విధానం ద్వారా పిక్చర్ బేస్ట్ అసెస్ మెంట్ చేస్తారు. కంప్యూటర్ లో 60 నుంచి 65 పిక్స్ ని గుర్తించే టెస్ట్ పెడతారు. విద్యార్థులు గుర్తించే పిక్స్ ఆధారంగా వారి ఆసక్తిని అంచనా వేసి, ఆ రంగంలో వారికి శిక్షణ ఇస్తారు. వారికి ఆసక్తి ఉన్న రంగంలోనే శిక్షణను ఇస్తే.. విద్యార్థులు మరింతగా రాణిస్తారనేదే ఈ టెస్ట్ లక్ష్యం.
ఇక ఏ కోర్సులో శిక్షణ పొందాలి అనే విషయాన్ని ఫైనలైజ్ చేసిన తర్వాత... విద్యార్థులకు కౌన్సెలింగ్ ఉంటుంది. ఆడియో, వీడియో మాధ్యమాల ద్వారా రియల్ టైమ్ వర్క్ ఎలా ఉంటుందో వివరిస్తారు. ఈ సెషన్లకు విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఆహ్వానిస్తారు. తద్వారా తమ పిల్లలు ఎలాంటి శిక్షణను పొందబోతున్నారనే విషయం వారికి కూడా అర్థమవుతుంది. తమ పిల్లల భవిష్యత్తుపై ఒక భరోసా ఏర్పడుతుంది. తొలి 12 రోజులు విద్యార్థులకు కేవలం వారి లక్ష్యాలు, ఆలోచనలకు సంబంధించిన బోధన ఉంటుంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశగా క్లాసులు ఉంటాయి. 12 రోజులు పూర్తైన తర్వాత కోర్సులో కొనసాగాలా? వద్దా? అనే నిర్ణయాన్ని ఆ విద్యార్థి తీసుకోవచ్చు. కోర్సులో కొనసాగాలనుకునే విద్యార్థికి 13వ రోజు నుంచి అసలైన శిక్షణ ప్రారంభమవుతుంది. క్లాసులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి. శిక్షణలో భాగంగా అందరికీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులతో పాటు ప్రాజెక్ట్ బేస్డ్ ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి. ఆన్ జాబ్ ట్రైనింగ్ పద్ధతిలో శిక్షణ ఉంటుంది. ఇక్కడ ఇచ్చే సర్టిఫికెట్లకు International recognition కూడా ఉంది. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు టాప్ లెవెల్ సంస్థల్లో ఉద్యోగాలు పొందేలా టాటా స్ట్రైవ్ సహకారం అందిస్తుంది.
ఆసక్తిగలవారు సంప్రదించాల్సిన చిరునామా:
టాటా స్ట్రైవ్,
ఎన్ఎస్ఎల్ సెంట్రమ్ మాల్,
బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కన,
కేపీహెచ్ బీ ఫేజ్-3,
హైదరాబాద్.
ఫోన్: 040 67190400
సెల్: 8919302506
పూర్తి వివరాల కోసం: www.tatastrive.com
For more details watch on LR Media.
►Subscribe to Our RU-vid Channel: / @lr_media
►Like Us: / lr-media-684267218444952
►Follow Us: / media_lr
►Follow Us: / lrmedia3108
►Follow Us: / lr-media-b0b914151
►Pin It: / lr_media

Опубликовано:

 

11 фев 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6   
@NRavi-gy9ry
@NRavi-gy9ry 9 месяцев назад
Accommodation and food akka mari free na
@ramkumar-di3uy
@ramkumar-di3uy 3 года назад
Bank courses unnaya
Далее