ఎందుకు చెంతకి వస్తావో ..ఎందుకు చేయొదిలేస్తావో స్నేహమా చెలగాటమా.. ఎప్పుడు నీ ముడి వేస్తావో..ఎప్పుడెలా విడదీస్తావో.. ప్రణయమా పరిహాసమా శపించే దైవమా..దహించే దీపమా ఇదే నీ రూపమా ప్రేమా ఫలిస్తే పాపమా..కలిస్తే లోపమా..గెలిస్తే నష్టమా ప్రేమా వెంటరమ్మంటూ..తీసుకెళ్తావు..నమ్మి వస్తే నట్టడవిలో విడిచిపోతావు జంటకమ్మంటూ..ఆశపెడతావు కలిమి ఉంచే చెలిమి తుంచే కలహమవుతావు.. చేసిన బాసలు ఎన్నంటే...చెప్పిన ఊసులు ఏవంటే మౌనమా...మమకారమా చూపుల్లో శూన్యమా...గుండెల్లో గాయమా..మరీ వేధించకే ప్రేమా... ఎందుకు చెంతకి వస్తావో ..ఎందుకు చేయొదిలేస్తావో స్నేహమా చెలగాటమా.. ఎప్పుడు నీ ముడి వేస్తావో..ఎప్పుడెలా విడదీస్తావో..ప్రణయమా పరిహాసమా
Awesome brother, your talent is out of this world, knew it when you could sing live in the US so comfortably and perfectly. God designed you for this. Keep well and enjoy!