ఆదిదైవం భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ధర్మో రక్షతి రక్షితః __ ధర్మం కాపాడబడితే అదే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇది వేదోక్తి ! హిందూ ధర్మ సిద్ధాంతాలకు , సంస్కృతి - సంప్రదాయాలకు, వేదాంతములైన ఉపనిషద్విజ్ఞానమే మూలం .మన జీవన శైలికి రక్షణ కవచం మన హిందూ ధర్మం !! ప్రపంచంలోని ఏ ఇతర దేశం లోనూ ఇంత పటిష్టంగా ఏర్పరచబడిన ధర్మ సిద్ధాంతాలు ఒకప్పుడు ఉన్నట్టుగాని ,ప్రస్తుతం ఉన్నాయని గాని ఎక్కడా దాఖలాలు లేవు !! ఆచారః ప్రభవో ధర్మః __ దేనిని ఆచరించడం వలన సమాజ శ్రేయస్సు కలుగుతుందో అదే ధర్మం అని మను ధర్మ శాస్త్రం లోను , నివేద బాహ్యా ధర్మః -- వేదం బాహ్యమైనదేది ధర్మం కాదని -- ' ధర్మం ' వేదాను వర్తి అని కదా వేదాల్లోనూ చెప్పబడింది. అనాదిగా మన పూర్వీకులు , అనేక సందర్భాలలో త్రికరణ శుద్ధిగా ఆచరించిన ధర్మం ,సంప్రదాయాలు , ఆచారాలు తద్వారా వారు గడించిన శాశ్వత కీర్తి ప్రతిష్టలు, సుఖసంతోషాలు మన శాస్త్రాలలో , రామాయణ ,భారతాది కావ్యాల్లో విస్తారంగా ప్రస్తావించబడింది . మావంతు బాధ్యతగా హిందూ సంప్రదాయకత , హిందూ ధర్మం - సంస్కృతుల పట్ల కొంతైనా ఆవగాహన కలిగించే విధంగా కొన్ని కార్యక్రమాలను రూపొందిస్తున్నాము.